సస్టెయినబుల్ ఫ్యాషన్స్‌కు ఇటీవలి కాలంలో డిమాండ్ పెరుగుతోంది. కాన్సెప్ట్ పరంగా ఇది వినూత్నంగా ఉండడమే కాదు… ధర పరంగా కూడా అందుబాటులోనే ఉంటుంది. తమకు అవసరం లేని వస్త్రాలను, ఉపయోగం లేనివిగా పారేయడం కాకుండా ఎంతో కొంత సంపాదించుకునే అవకాశం ఉండటంతో ఫ్యాషన్ ప్రియులు సెకండ్‌హ్యాండ్‌సేల్స్‌కు సై అంటున్నారు. ఫ్యాషన్‌లు సీజన్‌లను బట్టి మారుతూనే ఉంటాయి. ప్రతి సీజన్‌లో కొత్తవికొంటాం. పాతవి వదిలించుకోవాలనుకుంటాం. ఆ వదిలించుకునేది ఆన్‌లైన్‌లో అయితే ఎవరికీ ఇబ్బంది ఉండదనేది ఈ తరహా వస్త్రాలను విక్రయించేవారిమాట. ఎర్రగడ్డ సంతలో పాతవస్త్రాలను అమ్మడం చాలామంది చూసే ఉంటారు కానీ ఆన్‌లైన్‌లో ఈ సెకండ్‌హ్యాండ్ వస్త్రాలను కొనుగోలు చేయడం మాత్రం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. పనిలో పనిగా ప్రీ లవ్డ్‌వస్త్రాలతో పాటుగాఎగుమతులను రిజెక్ట్ చేసిన వస్త్రాలను సైతం పలు వెబ్‌సైట్లలో విక్రయిస్తున్నారు. ఖాతా సృష్టించుకోవడం, అమ్మాలనుకున్న వస్త్రాల చిత్రాలను అప్‌లోడ్ చేసి, విక్రయించడమేనని వెబ్‌సైట్లు అంటుండటంతో చాలా మంది ఇప్పుడు అటు వైపు మొగ్గుచూపుతున్నారు.
బాగా ప్రాచుర్యం పొందిన కొన్ని వెబ్‌సైట్లు..
స్టైల్‌ఫ్లిఫ్ : ప్రీ ఓన్డ్ ఫ్యాషన్ స్టోర్ అని దీనిని అనొచ్చు. ఇక్కడకేవలం కొనడమే కాదు, తాజా ట్రెండ్స్‌కూడా తెలుసుకోవచ్చు. ఇండియాలో అతిపెద్ద కమ్యూనిటీ డ్రివెన్ వర్ట్యువల్ వార్డ్‌రోబ్ ప్లాట్‌ఫామ్‌గా ఇది నిలిచింది. కొనడం, అమ్మడం, వ్యక్తిగతశైలి తెలుసుకోవడం కూడా చేయొచ్చు.
ఓఎల్‌ఎక్స్ : అందరికీ తెలిసిన వెబ్‌సైట్ ఇది. ఓ విధంగా లోకల్ క్లాసిఫైడ్ అని కూడా అనొచ్చు. అపారమైన అవకాశాలు దీనిలో ఉంటాయి.
కియాబ్జ : ఆన్‌లైన్ ప్రీ ఓన్డ్ బ్రాండ్ క్లాతింగ్‌స్టోర్ ఇది. 1500కు పైగా బ్రాండెడ్‌వస్త్రాలు ఇక్కడలభిస్తాయి. అంతేనాటీచ్‌ఫర్ ఇండియా, విద్యలాంటిసంస్థలకు విరాళాలనూ అందించవచ్చు.
ఎలానిక్ : చక్కటి ధరలోవస్త్రాలు విక్రయించేందుకు అనువైన ప్లేస్ ఇది. దీనిలో అవతలివ్యక్తితో మీరే నేరుగా చాట్ చేయడం ద్వారారేట్‌ఫిక్స్ చేసుకోవచ్చు. మీరు నిర్ణయించిన ధరపై కమీషన్‌మాత్రం వెబ్‌సైట్‌కు చెల్లించాల్సి ఉంటుంది.
కౌట్‌లూట్ : ఇండియా వ్యాప్తంగా ఇప్పుడు క్రయవిక్రయాలను జరిపే అవకాశం కల్పిస్తుంది.
జాపిలి : హైస్ట్రీట్ ఫ్యాషన్‌ఉమెన్‌క్లాత్స్‌మాత్రమే విక్రయాలు జరుపుతుంది. ప్రీఓన్డ్ క్లాత్స్‌పై భారీడిస్కౌంట్లుకూడాలభిస్తున్నాయి
ఇటాషీ : ఫ్యాషన్‌వస్తువులు మాత్రమే విక్రయించడం లేదంటేకొనేఅవకాశం అందించేవెబ్‌సైట్ ఇది.మరీముఖ్యంగా ప్రీ ఒన్డ్ ఫ్యాషన్స్‌కొనడం, విక్రయించడం దీనిపై చేయొచ్చు.
స్పాయిల్ : సెకండ్‌హ్యాండ్‌వస్తువులను స్థానికంగావిక్రయించేందుకు లేదంటేకొనేందుకు ఇది ఓ చక్కటివెబ్‌సైట్. ఫ్యాషన్‌మాత్రమే కాదు బ్యూటీ ప్రొడక్ట్స్, బేబీ ప్రొడక్ట్స్, గిఫ్టింగ్‌ఐటెమ్స్, బుక్స్‌సహా ఫర్నిచర్ కూడా దీనిపై అమ్మవచ్చు.
రిఫ్యాఫనర్ : వస్త్రాల నుండిఫుట్‌వేర్‌వరకూ, బ్యాగ్‌ల నుండియాక్ససరీలవరకూ అమ్మేందుకు ఇది తోడ్పడుతుంది.మరీముఖ్యంగాడిజైనర్‌వస్త్రాలను సహేతుకమైన ధరలోకొనేందుకు ఇది తోడ్పడుతుంది.
పోష్‌మార్క్ : ఫ్యాషన్‌కు సంబంధించి సోషల్ కామర్స్‌మార్కెట్ ప్లేస్‌ల్లో ఇది ఒకటి.కొనడం, విక్రయించడమే కాదు, మీ వ్యక్తిగతశైలిని సైతం ప్రదర్శించేఅవకాశం ఇది కల్పిస్తుంది.
విక్రయించేందుకూ మార్గదర్శకాలున్నాయి..
ఓఎల్‌ఎక్స్‌లాంటిసైట్లలో మీ ఇష్టమొచ్చిన రీతిలో వస్త్రాలను విక్రయించేఅవకాశముంది కానీ కియాబ్జ లాంటిసైట్లలోమాత్రం నిర్ధిష్టమైన ప్రమాణాలను అనుసరించాల్సిందే ! బ్రాండెడ్‌వస్త్రాలు లేదంటేడిజైనర్‌వస్త్రాలు మాత్రమే ఇక్కడవిక్రయిస్తారు. కొన్ని వెబ్‌సైట్లలోవస్త్రాలఅమ్మకం, కొనుగోలుకు సంబంధించిన నిబంధనలేమిటంటే..
నకిలీ లేదంటే నమూనాలను విక్రయించకూడదు. కేవలం అధీకృత బ్రాండ్ల వస్త్రాలు మాత్రమే విక్రయించాలి.
కొన్ని వెబ్‌సైట్లలో ఇండియన్ లేదంటే ఎథ్నిక్ ఔట్‌ఫిట్స్ విక్రయించడాన్ని అనుమతించవు. వెస్ట్రన్ క్లాత్స్ అమ్ముడైనంత విరివిగా ఎథ్నిక్ ఫ్యాషన్స్ విక్రయించబడక పోవడమే దీనికి కారణం.
ఫ్యాషన్‌కదా అని ఇన్నర్ వేర్ లేదంటే నైట్‌వేర్ విక్రయాలకు పెట్టకూడదు. మరకలు ఉన్న వస్త్రాలు కూడా అమ్మకానికి పనికి రావు.
కనిపించే రీతిలో చిరుగులు, దారాలు బయటకు వచ్చి ఉంటే ఆ వస్త్రాలను విక్రయించడానికి తీసుకోరు.
కలర్ పోయిన, జిప్స్ లేదంటే బటన్స్ పోయిన వస్త్రాలు అమ్మకానికి పనికి రావు.
అన్నిటికన్నా ముఖ్యమైనది వస్త్రాల లైఫ్‌సైజ్ మూడేళ్లు దాటితే వాటిని విక్రయించడానికి ఒప్పుకోరు. కొన్ని సైట్‌లలో వీటి జీవితకాలం రెండేళ్లలోపే.