NRI-NRT

CATS అధ్యక్షురాలిగా కొండపు సుధ

Sudha Kondapu Elected As CATS New President

డీసీకు చెందిన క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ(CATS) సంఘానికి నూతన అధ్యక్షురాలిగా కొండపు సుధ ఎన్నికయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు చెందిన సుధ 2006లో ఈ సంస్థ సాంస్కృతిక విభాగ ఉపాధ్యక్షురాలిగా అడుగుపెట్టి ఆహార కమిటీ అధ్యక్షురాలిగా, సాంస్కృతిక కమిటీ అధ్యక్షురాలిగా, ఉపాధ్యక్షురాలిగా, ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా పలు విభాగాల్లో పనిచేశారు. పలు హోదాల్లో పనిచేసిన అనుభవంతో సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్తానని సుధ అన్నారు.