గతేడాది నాయికా ప్రాధాన్య చిత్రం ‘శాండ్ కీ ఆంఖ్’తో మెప్పించింది తాప్సి. ఇప్పుడు మరో చిత్రాన్ని పట్టాలెక్కించింది. ‘హసీనా దిల్‌రూబా’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ నిర్మిస్తున్నారు. వినిల్ మాథ్యూ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ‘ఛపాక్’లో దీపికా పదుకొణెతో కలసి నటించిన విక్రాంత్ మస్సే కీలక పాత్రలో నటిస్తున్నారు. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందతున్నట్లు సమాచారం. శనివారం ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ విషయాన్ని చిత్రబృందం ట్విటర్‌లో వెల్లడించింది. సెప్టెంబరు 18న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కాగా తాప్సి ‘రష్మి రాకెట్’, ‘తప్పడ్’ అనే మరో రెండు చిత్రాల్లోనూ నటిస్తోంది. ‘రష్మి రాకెట్’లో పరుగు పందెంలో పాల్గొనే అథ్లెట్‌గా కనిపించనుంది. అనుభవ్ సిన్హా తెరకెక్కిస్తున్న ‘తప్పడ్’ ఈ ఏడాదే విడుదల కానుంది.
తీరిక లేకుండా చేతినిండా సినిమాలు
Related tags :