ఆస్ట్రేలియాలో కార్చిచ్చు నివారణకు విరాళం అందజేసిన భారత హాకీ సమాఖ్యకు ఆస్ట్రేలియా ధన్యవాదాలు తెలియజేసింది. తమకు అండగా నిలిచినందుకు అభినందించింది. గతేడాది చివర్లో మొదలైన కార్చిచ్చుతో ఆసీస్‌లో ఎంతో నష్టం వాటిల్లింది. అరుదైన జీవజాలం నశించింది. భారీ ఆస్తినష్టం చోటు చేసుకుంది. కొందరి నివాసాలు బుగ్గి అయ్యాయి. విపత్తు సహాయం కింద హాకీ ఇండియా 25,000 డాలర్లను ఆస్ట్రేలియా రెడ్‌క్రాస్‌కు అందజేసింది. వేలం వేసేందుకు భారత పురుషులు, మహిళల జట్లు సంతకాలు చేసిన రెండు జెర్సీలను ఇచ్చింది. ఈ సందర్భంగా హాకీ ఇండియా అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్‌కు హాకీ ఆస్ట్రేలియా అధ్యక్షుడు మెలానీ వూస్నన్ ధన్యవాదాలు తెలిపారు. ఉదారతను చాటుకున్నందుకు ప్రశంసించారు. ‘ఆస్ట్రేలియాలోని కార్చిచ్చును చూసి హాకీ ఇండియా, భారత హాకీ సమాజం ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. హాకీ ఆస్ట్రేలియా ప్రయత్నానికి మేం హృదయ పూర్వకంగా మద్దతిస్తున్నాం’ అని ముస్తాక్ తెలిపారు.
ఆస్ట్రేలియాకు హాకీ ఇండియా సాయం

Related tags :