Movies

నాకు కడుపు ఉంది. మా వాళ్లకు మూఢత్వం లేదు.

Kalki Coechlin Speaks About Pre Wedding Pregnancy

బాలీవుడ్‌ నటి కల్కి కొచ్లిన్‌ త్వరలో శిశువుకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌తో విడాకులు తీసుకున్న కొన్ని ఏళ్లకు ఆమె హర్ష్‌బర్గ్‌ అనే వ్యక్తితో కలిసి జీవిస్తున్నారు. ఇటీవల తను తల్లికాబోతున్న విషయాన్ని కల్కి ప్రకటించారు. తాజాగా కరీనా కపూర్‌ రేడియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెళ్లికి ముందే తల్లి కాబోతున్న వార్తను కుటుంబ సభ్యులు ఎలా స్వీకరించారని పశ్నించగా… ఇలా సమాధానం ఇచ్చారు. ‘అదృష్టవశాత్తు మా ఇరు కుటుంబ సభ్యులు దీన్ని పాజిటివ్‌గా తీసుకున్నారు. మా వాళ్లు మరీ మూఢంగా ఉండరు, పెళ్లి చేసుకున్న తర్వాతే పిల్లలకి జన్మనివ్వాలనే ధోరణి వారిది కాదు. ‘ఈసారి పెళ్లి చేసుకో..’ అని ఈ శుభవార్త చెప్పగానే మా అమ్మ అన్నారు. నేను ఇప్పటికే విడాకులు తీసుకున్నా కాబట్టి వారికి నా పెళ్లి విషయంలో అంత తొందర లేదు. నేను తల్లి కాబోతున్న విషయాన్ని ముందు హర్ష్‌ బర్గ్‌కు చెప్పా. అతడు చాలా సంబరపడ్డాడు’ అని కల్కి పేర్కొన్నారు. 2011లో అనురాగ్‌ కశ్యప్‌, కల్కి వివాహం చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల 2013లో విడిపోయారు. 2015లో వీరికి అధికారికంగా విడాకులు లభించాయి. అయినా ఇప్పటికీ వీరిద్దరు స్నేహితుల్లానే కొనసాగుతున్నారు.