తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు మంచి ఫలితాలు ఇచ్చాయని పురపాలిక ఎన్నికల్లో తెరాస అన్ని స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని తెరాస మలేషియా శాఖ అధ్యక్షులు చిట్టిబాబు చిరుత అన్నారు. పట్టణ ప్రగతి పరుగులు పెట్టాలంటే అధికార తెరాస పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు పట్టం కట్టాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెరాస అభ్యర్థులకు తెరాస మలేషియా మద్దతు ప్రకటించింది. ప్రతిపక్షాలు చెప్పే తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని, బంగారు తెలంగాణ నిర్మాణం ఒక్క తెరాస పార్టీతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మారుతి కుర్మ, కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, రవితేజ, రఘునాత్ నాగబండి, రవిందర్ రెడ్డి , హరీష్ గుడిపాటి తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో తెరాస విజయం ఖాయం-మలేషియా తెరాస
Related tags :