టాలీవుడ్ నటి పూజాహేగ్డే ఉదార హృదయాన్ని చాటుకున్నారు. క్యాన్సర్ బాధిత చిన్నారుల కోసం రూ.2.5 లక్షలను ఆమె విరాళంగా ప్రకటించారు. హైదరాబాద్‌లో గోల్ఫ్ క్లబ్‌లో ‘క్యూర్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫౌండేషన్ అందించిన ఆర్థిక సహకారంతో క్యాన్సర్‌ను జయించిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజా మాట్లాడుతూ.. ‘వైద్యుల కుటుంబం నుంచి నేను వచ్చాను. మా అన్నయ్య వైద్యుడు. అలాగే స్నేహితులు కూడా వైద్యరంగంలో ఉన్నారు. వైద్యుడే నిజమైన హీరో అని నేను భావిస్తాను. బాధిత చిన్నారుల కోసం తగినన్ని నిధులను సమకూర్చి వారి జీవితాన్ని కాపాడాలని కోరుతున్నాను. ప్రతిఒక్కరూ జీవితంలో మంచి పనులు చేయాలని భావిస్తుంటారు. కాకపోతే ఎలా చేయాలి అనే దానిపై సరైన అవగాహన ఉండదు. అందుకే ఇలాంటి ఆర్గనైజేషన్స్‌కు ఆర్థిక సాయం చేసి బాధిత చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతున్నాను’ అని పూజాహెగ్డే అన్నారు.
క్యాన్సర్ బాధిత చిన్నారులకు పూజా విరాళం
Related tags :