ముంబయి పోలీసుల సేవలను గుర్తుచేసుకుంటూ వారి గౌరవార్థం ప్రతి ఏటా నిర్వహించే ‘ఉమాంగ్’ కార్యక్రమం ఈ ఏడాది కూడా అట్టహాసంగా జరిగింది. ‘ఉమాంగ్-2020’ పేరుతో ఆదివారం సాయంత్రం ముంబయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. ప్రియాంక చోప్రా, కత్రినాకైఫ్, రకుల్ ప్రీత్‌సింగ్, విద్యాబాలన్, జాన్వీకపూర్ చీరకట్టులో మెరిసిపోయారు. మరోవైపు బాలీవుడ్ అగ్రకథానాయకులు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌తోపాటు వరుణ్ ధావన్, కార్తీక్ ఆర్యన్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని అలరించారు. అంతేకాకుండా వరుణ్ ధావన్, కార్తీక్ ఆర్యన్ డ్యాన్స్ చేసి ప్రేక్షకులను మెప్పించారు. మరోవైపు షారుఖ్ సైతం స్టేజ్‌పై డ్యాన్స్ చేయడంతోపాటు తన మాటలతో నవ్వులు పూయించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
ఉమాంగ్-2020లో ఫ్యాషన్ తళుకులు
Related tags :