మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు అభ్యర్థి నూనావత్ ఉషకి మద్దతుగా ఎన్నారై టి.అర్.ఎస్ సెల్-యూకే ప్రతినిధులు ప్రచారం నిర్వహించారు. ఎన్నారై టి.అర్.ఎస్ సెల్ యూకే ప్రధాన కార్యదర్శి కడుదుల రత్నాకర్, కార్యదర్శి వినయ్ ఆకుల, అధికార ప్రతినిధి రాజ్ కుమార్ శానబోయిన, తెలంగాణ జాగృతి యువత రాష్ట్ర అధ్యక్షులు కోరబోయిన విజయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఇంటి ఇంటికి తిరుగుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేబడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ కెసిఆర్ నాయకత్వాన్ని బలపరచడం ద్వారా రానున్న రోజులల్లో ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆధ్వర్యంలో వర్ధన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్తుందని అన్నారు.
వర్ధన్నపేటలో యూకే ఎన్నారై తెరాస ప్రచారం
Related tags :