ScienceAndTech

బెంగుళూరులో గీకితే న్యూయార్క్‌లో డబ్బులు పోయాయి

Guy swipes card in bangalore...loses money in NY

బెంగళూరులోని ఓ హోటల్‌లో కస్టమర్ కార్డు స్వైస్ చేస్తే.. అతడి ఎకౌంట్ నుంచి న్యూయార్క్ లో నాలుగు లక్షల రూపాయలు మాయమయ్యాయి. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కోరమంగళ్ ఫోర్త్ బ్లాక్‌లో ఉన్న పబ్‌కు వరుణ్ గుప్తా అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీరు వెళ్లాడు. హోటల్‌లో రూ. 4181 బిల్లును తన యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డుతో స్వైప్ చేశాడు. అదే రాత్రి డెబిట్ కార్డు న్యూయార్క్ నుంచి పది సార్లు స్వైప్ చేసి రూ.4,10,036 చెల్లించినట్టుగా సందేశాలు వచ్చాయి. దీంతో వెంటనే వరుణ్ కంగుతిన్నాడు. యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తాను బెంగళూరులో ఉంటే లండన్‌లో డెబిట్ కార్డు ఎలా స్వైప్ చేశారని వరుణ్ పోలీసులు అడుతున్నారు. ఒక సారి కార్డును క్లోనింగ్ చేస్తే చాలు ఎక్కడి నుంచైనా స్వైప్ చేయవచ్చని సైబర్ క్రైమ్ నిఫుణులు చెబుతున్నారు. హోటల్ స్వైప్ చేసినప్పుడు డెబిట్ కార్డు కోన్లింగ్‌కు గురై ఉంటుందని సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.