ప్రేమ గురించి ఎవరు ఎన్ని విషయాలు చెప్పినా, ఎంతమంది లవర్స్ అందులో ఉండే మజాను అందుకున్నా దాని గురించి ఎంతో కొంత చెప్పేందుకు ఏదో ఒకటి మిగిలే ఉంటుంది. అందుకే తరాలు మారినా.. యుగాలు మారినా.. ప్రేమ ఇంకా ఇప్పటికీ టాప్ ప్లేసులో నిలుస్తోంది. ఈ జీవితంలోని ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో ప్రేమ అనేది కచ్చితంగా అవసరమవుతుంది. ప్రేమ అవసరం లేకుండా ఎవ్వరూ జీవించలేరు. అయితే ప్రస్తుత జనరేషన్ వారిలో చాలా మంది ప్రేమ అంటే కేవలం శృంగారం అనే భ్రమలో ఉండిపోతున్నారు. ప్రేమకు మరియు శృంగారానికి సంబంధించి తేడాను తెలుసుకోలేకపోతున్నారు…
* నిబద్ధతతో వ్యవహరించడం..
మీరు మీ భాగస్వామితో ప్రేమలో ఉన్నప్పుడు చాలా నిబద్ధతతో వ్యవహరించాలి. వారితో ఉన్న మానసిక అనుబంధాన్ని పటిష్టం చేసుకోవడం వంటి మొదలైన అంశాలు శృంగారాన్ని, ప్రేమను వేరు చేసి చూపిస్తాయి. ఇద్దరి మధ్య ప్రేమ అంటే అది ఎంతో ఆప్యాయత, అనురాగంతో కూడిన మానసిక అనుబంధం. ఇలాంటి వారికి శృంగార పరంగా కలయిక అనేది కేవలం శారీరక కలయిక మాత్రమే కాదు. అది వారికి మంచి భావోద్వేగం కూడా.
*ఇందులో ప్రేమ ఉండదు..
శృంగారం అనే విషయంలో ప్రేమ అనేదే ఉండదు. ఇది కేవలం శారీరక సుఖం చేసే ప్రక్రియ. కొన్ని అవసరాలను తీర్చుకోవడం కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే లైంగిక పరమైన కలయిక మాత్రమే. ఇలాంటివి తాత్కాలికంగానే సంతోషాన్నిస్తాయి. ప్రేమలో మునిగి తేలటమే కాక.. ప్రేమలో లోతుగా మునిగిపోవడమే కాకుండా.. వారు తమ శరీరాల కలయికకు ఎక్కువగా ఆసక్తి చూపే ఇద్దరుప్రేమికులు ఉపయోగించే పదమే లవ్ మేకింగ్. జీవితాంతం కలిసి జీవించాలని నిర్ణయించుకున్న వారు చేసే శృంగార కార్యం చాలా అందంగా ఉంటుంది. వారి కోణంలో రెండు శరీరాల కలయిక అనేది పరిమితం కాదు. అయితే ప్రస్తుత రోజుల్లో ఇలాంటి వాటిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అందరి ఆలోచనల్లోనూ.. ప్రేమ, శృంగారం వంటి విషయాల పట్ల చాలా మంది ఆలోచనల్లో చాలా వ్యత్యాసం ఉంది. ప్రేమ అంటే కేవలం శృంగారం అని, దాని ద్వారానే తమ ప్రేమను తెలియజేయాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే ప్రేమలో శృంగార ఘట్టం ఒక భాగం అని గుర్తించాలి. శృంగారమే జీవితం కాదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. సహజ కోరిక.. శృంగారం అనేది వయసు వచ్చిన ప్రతి ఒక్కరిలో సహజ కోరికగా ఉంటుంది. అలాగే ప్రేమ అనేది కూడా ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరికి కొన్ని కోరికలు ఉంటాయి. ముఖ్యంగా ప్రేమ, శృంగారం విషయంలో చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రెండింటి లక్ష్యం ఒక్కటే. ప్రేమ అనేది ఒక కళ వంటిది. అది ప్రేమలో మునిగి తేలిన వారికే తెలుస్తుంది.
*శృంగారం అనేది యాంత్రిక చర్య..
శృంగారం అనేది ఆడ, మగవారి శరీరాల మధ్య జరిగే ఒక యాంత్రిక చర్య మాత్రమే. కానీ అంతమాత్రాన అది ప్రేమగా మారిపోదు. ప్రేమ అంటేనే మానసికంగా బలమైన అనుబంధం కలిగి ఉండటం అని తెలుసుకోవాలి. ఒకరి పట్ల మరొకరు శ్రద్ధ, ప్రేమ కలిగి ఉంటూ కొనసాగించే లైంగిక పరమైన అనుబంధమే లవ్ మేకింగ్ అని గుర్తుంచుకోవాలి. కళ్లకు నచ్చిన వారిని.. తమ కళ్లకు ఎవరైతే నచ్చుతారో అలాంటి వారందరినీ సొంతం చేసుకోవడానికి, అలాంటి వారందరితో రిలేషన్ కావాలనుకుంటే అది ప్రేమ కాదు. అలాగే అవసరాల కోసం, డబ్బు, ఆస్తి వంటి వాటి కోసం జీవిత బంధాన్ని ఏర్పరచుకునేది కాదు ప్రేమంటే. ప్రేమ కోసం ఏమైనా.. ఎవరినైనా చూసినప్పుడు తమ మనసు నిజాయితీగా, నిజంగా రెస్పాన్స్ వంటివి ఇస్తుందో.. అలాంటి వారి కోసం ఏమైనా చేయాలని అనిపిస్తుందో అలాంటి దాన్నే ప్రేమ అంటారు. ఇలా ఇద్దరి మధ్య బంధం ఏర్పడితే అప్పుడు అది నిజమైన ప్రేమ అవుతుంది. అలాంటి వారు నిజమైన ప్రేమికులు అవుతారు. నీవు లేకుండా.. నిజమైన ప్రేమ అనేది సుగుణాలతో కలిసి ఉంటుంది. సుగుణాలు స్వయంగా.. ఎదుటి వ్యక్తిలోనూ ప్రేమను పుట్టిస్తాయి. అయితే సుగుణాలు తగ్గినప్పుడు ప్రేమ కూడా తగ్గిపోతుంది. ప్రేమ విషయంలో నేను, నీవు లేకుండా బతకలేను అని చెప్పడానికి ఒక ఊత సాయం కూడా నేను నడవలేను అని చెప్పడానికి మధ్య ఎలాంటి తేడా లేదు.
*ప్రేమే శాశ్వతం..
శృంగారం అనేది కేవలం శరీరానికి సంబంధించిన అవసరం అనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. దాని వల్ల కాసేపు సంతోషం, సుఖం దక్కొచ్చు. కానీ జీవితాంతం ఆనందం మాత్రం ఉండదు. ఒక స్టేజీ వరకు వచ్చి అది ఆగిపోతుంది. అదే ప్రేమ విషయానికొచ్చేసరికి ఇది రెండు మనసులకు సంబంధించింది. ఇది మాత్రం శాశ్వతంగా జీవితాంతం ఉంటుంది.
*గర్భం వద్దా.. అయితే ఎఫెక్టివ్‌గా పనిచేసే IUDని వాడండి..
చాలా మంది అనేక కారణాల వల్ల త్వరగా పిల్లలు వద్దనుకుంటారు. దీనికి వారి ఆర్థిక కారణాలు కావొచ్చు, ఇతర బాధ్యతలు కావొచ్చు, మరింకేమైనా కావొచ్చు. ఇలా అనేక కారణాల వల్ల పిల్లల్ని వద్దనుకుంటారు. అలాంటి వారు శృంగారంలోనూ భయం భయంగా పాల్గొంటారు. అలా అందులో పాల్గొన్నా పిల్లలు పుట్టకుండా ఉండేదుకు కొన్ని ప్రత్యామ్నాయలుగా ట్యాబ్లెట్స్, కండోమ్స్ వంటివి వాడుతుంటారు. కానీ, వీటి వల్ల కొంత నెగెటీవ్ ఉంటుందని చాలా మంది అనుకుంటారు. అలాంటి వారు IUDని వాడడం వల్ల చక్కని ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..
*ఎందుకు గర్భనిరోధకాలు అంటే..
నేటి జనరేషన్‌లో ప్రతీ ఒక్కరూ పర్ఫెక్ట్ ప్లాన్‌తో జీవించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది అప్పుడే పిల్లలు కనొద్దనుకుంటున్నారు. వివాహం జరిగాక కొన్ని రోజుల వరకూ ఆ విషయం గురించి అసలు ఆలోచనే లేదు అనుకుంటున్నారు. అందుకోసమే ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నారు. దీని వల్ల త్వరగా పిల్లలు పుట్టరు. అనే వాటిని ఆశ్రయిస్తారు..
*ఇప్పటివరకూ ఉన్న గర్భనిరోధకాలు..
చాలా మంది పిల్లలు వద్దనుకునేవారు ఇప్పటివరకూ అనేక గర్భనిరోధకాలను ఆశ్రయించారు. అందులో ఆడవారు కలయిక జరిగిన కొన్ని గంటల్లోనే మాత్రను వేసుకోవడం, కండోమ్స్ వాడకం, అదే విధంగా ఆడవారు ప్రతీ రోజూ గర్భనిరోధకాలను వాడడం.. ఇలా అనేకం ఉన్నాయి. అయితే, గర్భనిరోధకాలలో చెప్పే కండోమ్స్‌లో ఆడవారు, మగవారు వాడేవి ఉంటాయి. ఇందులో ఎక్కువగా మగవారు వాడేవే ఉంటాయి. ఆడవారి కండోమ్స్ గురించి చాలా మందికి అవగాహన కూడా లేదు..
*తాజాగా మరికొన్ని గర్భ నిరోధకాలు..
అయితే, ఇవే అంశాలపై ఎన్నో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు అనేక కొత్త అంశాలను కనిపెట్టారు. అందులో ఇంజెక్షన్స్, జెల్ ఇలా అనేక గర్భ నిరోధకాలు ఉన్నాయి. అయితే, ఇవి మార్కెట్లోకి రావడానికి సమయం పెడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
*గర్భ నిరోధకాల వల్ల కలిగే నష్టాలు..
అయితే, గర్భనిరోధకాలుగా చెప్పుకునే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అందులో కండోమ్స్ గురించి చెప్పాలంటే.. ఇది చాలా మంది స్త్రీలకు, మగవారికి పడకపోవడం కొన్ని చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా.. దీనిని వాడడం వల్ల అది చిరిగి ఫెయిలై అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని వాడాలంటే చాలా మంది భయపడుతుంటారు. ఇక మాత్రల వల్ల స్త్రీల శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ఫ్యూచర్‌లో కొన్ని సమస్యలు వస్తాయని చెబుతుంటారు.
*ఉమమైన గర్భనిరోధకం..
అదే విధంగా గర్భనిరోధకాలలో ముఖ్యమైన పరికరం గురించి నిపుణులు చెబుతున్నారు. అదేంటంటే IUD దీన్నే ఇంట్రాటూరైన్ అని కూడా అంటారు. ఇది ఇప్పటివరకూ ఉన్న గర్భనిరోధక పద్ధతులలోనే అత్యంత సురక్షితమైనదని నిపుణులు చెబుతున్నారు. T ఆకారంలో ఉండే ప్లాస్టిక్ ముక్కలా ఉంటుంది. దీన్ని స్త్రీ గర్భాశయంలోకి చొప్పిస్తారు. దీని వల్ల మగవారి వీర్యం స్త్రీ గర్భాశయంలోకి వెళ్లగానే.. దాన్ని నిర్వీర్యం చేసేలా పరికరం ఉంటుంది. అయితే, ఇది కచ్చితంగా వైద్యుల సంరక్షణలోనే చేయించుకోవాలి. లేకపోతే అనేక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రేమ అంటే శృంగారమేనా?
Related tags :