దక్షిణాదిన తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం కొత్త భామల రాకతో ఇటీవల ఈమె జోరు కాస్త తగ్గింది. అయినప్పటికీ సీనియర్ హీరోల సరసన అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం టాప్ డైరెక్టర్ శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న `భారతీయుడు-2`లో కాజల్ హీరోయిన్గా నటిస్తోంది.ఈ సినిమా గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడింది. ఈ సినిమాలో కాజల్ 85 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో కనిపించబోతోందట. “భారతీయుడు-2`లో పాత్ర గురించి దర్శకుడు శంకర్ నన్ను సంప్రదించినపుడు ఆశ్చర్యపోయా. ఆ పాత్రకు నేను న్యాయం చేయగలనా? అనే సందేహం వచ్చింది. ఇప్పుడు ఆ సందేహం తీరిపోయింది. `భారతీయుడు-2`లో కమల్ పాత్ర తర్వాత నాదే అతి కీలకమైన పాత్ర. మేకప్ కోసమే గంటల సమయం పడుతోంది. ఈ సినిమాతో నాకు మరింత ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంద`ని కాజల్ పేర్కొంది.
85ఏళ్ల వృద్ధురాలిగా కాజల్
Related tags :