Movies

ఎందుకు ఇంత జాప్యం?

Mallika Sherawat Angry On Nirbhaya Hanging Delay

‘నిర్భయ’ దోషులకు ఉరిశిక్ష వాయిదా వేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో బాలీవుడ్ భామ మల్లికా షెరావత్ చేరారు. అత్యాచార బాధితులకు చేయూతనందించడంలో ముందుండే మల్లిక ‘నిర్భయ’ దోషులకు ఉరి వాయిదా వేశారని తెలియగానే నిరాశకు లోనయ్యారు. ఉరి విషయంలో ఇలా జాప్యం చేయడం దేశంలోని మహిళలకు ఎలా అనిపిస్తుంది? అత్యాచార బాధితులు ఏమనుకుంటారు? అని ప్రశ్నించారు. ప్రతిరోజూ దేశంలో అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటున్న వార్తలు వింటున్నాం. దీనిని చూస్తుంటే మహిళలపై అకృత్యాలకు పాల్పడేవారి సంఖ్య పెరిగిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుండగా ‘నిర్భయ’ దోషులకు ఉరి వాయిదా వేశారని తెలియగానే ‘నిర్భయ’ తల్లి కూడా అసహనం వ్యక్తంచేస్తూ, నిందితులు కోరుకున్నట్టే జరుగుతున్నట్టుందని వ్యాఖ్యానించారు.