పవన్ కల్యాణ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించనున్నారా? అంటే… ఫిల్మ్నగర్ వర్గాలు అవుననే అంటున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలో ఈ జోడీని వెండితెరపై ప్రేక్షకులు చూడొచ్చు. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం ఓ చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.మొఘల్ సామాజ్య్ర నేపథ్యంలో రూపొందునున్న ఈ చారిత్రక చిత్రంలో కథనాయకుడి పాత్ర రాబిన్ హుడ్ తరహాలో ఉంటుందట. అతడి సరసన కథానాయికగా పూజా హెగ్డే అయితే బావుంటుందని దర్శకుడు భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఆమెను కలిసి కథ వివరించారట. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి. ఇదిలా ఉంటే… పవన్ కల్యాణ్ న్యాయవాదిగా నటించనున్న ‘పింక్’ రీమేక్ చిత్రీకరణ ఈ నెల 20 నుండి మొదలు కానుందని తెలిసింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘దిల్’ రాజు, బోనీ కపూర్ నిర్మాతలు.
పవన్-పూజా ఒకే చిత్రంలో
Related tags :