అట్లాంటా నార్క్రాస్ హైస్కూల్లో శనివారం నాడు తామా(తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా) ఆధ్వర్యంలొ సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముగ్గులు, వక్తృత్వ పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. సేవా కార్యక్రమాల కార్యదర్శి సాయిరామ్ కారుమంచి స్వాగతోపన్యాసం అనంతరం కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభింఆరు. ముఖ్య అతిథి లోహిత్ కుమార్ తమాషా విషయాలతో, మిమిక్రీ, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. తామా ఆధ్వర్యంలో నిర్వహించే వైద్యం, విద్య, వికాసం, వినోదం, విజ్ఞానం, సేవ, సదస్సులు, సాహిత్యం, సహాయం, సాంస్కృతిక మరియు ఆటపాటల గురించి వివరించారు. స్థానిక ప్రవాసులు ప్రదర్శించిన భక్తి గేయాలు, పద్యాలు, టాలీవుడ్ మెడ్లీలు, నాటికలు, సినిమా పాటలు, కూచిపూడి నృత్యాలు, బ్రేక్ డాన్సులు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యదర్శి రూపేంద్ర వేములపల్లి ప్రశంసాపత్రాలను అందించారు. అధ్యక్షుడు భరత్ మద్దినేని, బోర్డు ఛైర్మన్ రాజశేఖర్ చుండూరి తామా నూతన సభ్యులను సభకు పరిచయం చేసి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భరత్ తామా చరిత్ర గురించి, రాజశేఖర్ తామా కార్యక్రమాలు, ఉచిత క్లినిక్, మనబడి, వివిధ సదస్సులు, స్కాలర్షిప్స్, ఇటీవల తామాకు లభించిన అమెరికా ప్రెసిడెంట్ వాలంటీర్ ఎలిజిబిలిటీ గురించి ప్రసంగించారు. దాతలు హరిప్రసాద్ సాలియన్ని, సురేష్ ధూళిపూడిని సత్కరించారు. టాలీవుడ్ గాయనీగాయకులు దామిని, ధనుంజయ్ తమ పాటలతో, ఆటలతో, సరదా మాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. తామా ‘గో గ్రీన్’లో భాగంగా ఎకో ఫ్రెండ్లీ ప్లేట్లు, స్పూన్లు, వాటర్ స్టేషన్స్ వాడటం, ప్లాస్టిక్ రహితంగా వేడుకలు నిర్వహించడం అభినందనీయం. సంబరాలను విజయవంతం చేయడానికి తోడ్పడిన రవికుమార్ వడ్డమాను, నిరంజన్, ప్రవీణ్ పురం, వాలంటీర్స్ వినయ్ గోపిశెట్టి, శ్రీనివాస్ లావు, రమేష్ పాలెం, ఉదయ్ కంభంపాటి, ప్రియా బలుసు, సుబ్బారావు మద్దాళి, రాజ్ కిరణ్ మూట, స్రవంతి కోవెల, వెంకట్ తోట, రవి యేలిశెట్టి, సురేష్ ధూళిపూడి, అంజయ్య లావు, అనిల్ ఎలమంచిలి, మురళి బొడ్డు , మల్లిక్ మేదరమెట్ల , వెంకీ గద్దె , హర్ష యెర్నేని, శ్రీని పెద్ది, రామ్ మద్ది, గౌరి కారుమంచి, నరేష్ ఎల్కోటి, శ్రీధర్ పాలడుగు, తేజ వేమూరి, ఉదయ కంభంపాటి, మహేష్ కొప్పు, రమేష్ మేడ, సునీల్ కాంత్ దేవరపల్లి, వినయ్ మద్దినేని, మహి నిమ్మగడ్డ, రీమా బొడ్డు , రోమిత్ చుండూరి , అనీష్ రుద్రరాజు తదితరులకు తామా ఉపాధ్యక్షులు ఇన్నయ్య ఎనుముల ధన్యవాదాలు తెలిపారు.
ఘనంగా “తామా” సంక్రాంతి సంబరాలు
Related tags :