సమగ్ర ఎన్నారై విధానాన్ని రూపొందించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎన్నారై విధాన రూపకల్పనకు తెలంగాణ ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. అందుకోసం వివిధ రాష్ర్టాల విధానాలను తెలంగాణ అధికారుల బృందం అధ్యయనం చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర సీనియర్ అధికారుల బృందం కేరళలో పర్యటిస్తోంది. ఈ బృందంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేష్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు ఉన్నారు. తిరువనంతపురంలో ప్రవాస కేరళీయుల సంక్షేమ వ్యవహారాల శాఖ అధికారులతో వారు సమావేశమయ్యారు. మలయాళీల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు, అవలంభిస్తున్న విధానంపై వారు విస్తృత చర్చలు జరిపారు. విదేశాలకు వెళ్లే కేరళ ప్రజలకు ఆ రాష్ట్రం అమలు చేస్తున్న విధానంపై అధ్యయనం చేశారు. కేరళ విధాన పత్రాలను సైతం వారు అధ్యయనం చేశారు.
ఎన్నారై పాలసీపై తెలంగాణా ప్రభుత్వం కసరత్తు
Related tags :