*మండలిలో వికేంద్రీకరణ బిల్లుకు అడ్డుకట్ట
ఏపీ శాసన మండలిలో వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టగా తెదేపా అడ్డుకుంది. వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ రూల్ 71 మోషన్ కింద నోటీసు ఇచ్చింది. బిల్లులు ప్రవేశపెట్టే ముందు తామిచ్చిన నోటీసుపై చర్చ జరపాలని మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. శాసనమండలిని కించపరిచే విధంగా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారనే విషయాన్ని ప్రస్తావించిన యనమల.. మండలికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మండలి సభ్యులకు ఎందుకు ఫోన్లు చేస్తున్నారని ప్రశ్నించారు. వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందినందున చర్చ జరగాల్సిందేనని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. రూల్ 71 కింద బిల్లును తిరస్కరించే అధికారం మండలికి లేదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మండలి ఛైర్మన్ … రూల్ 71 నోటీసుపై చర్చకు అనుమతిచ్చారు. దీంతో మండలిలో వికేంద్రీకరణ బిల్లుకు తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది. మండలిలో బిల్లు పెట్టి వీగిపోతే డీమ్డ్ టూ బీ పాస్డ్ కింద ప్రభుత్వానికి ఆమోదం చేసుకునే అవకాశం ఉంటుంది. అసలు బిల్లే పెట్టకపోతే డీమ్డ్ టు బీ పాస్డ్ కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు
*అమరావతిలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని అరెస్ట్ అయిన ఎంపీ గల్లా జయదేవ్‌కు మంగళగిరి మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. పోలీసులు ఆయనను తెల్లవారుజామున గుంటూరు సబ్ జైలుకు తరలించారు. నిన్న ఉదయం పోలీసుల నిఘా, నిషేధాఘ్నలను దాటుకుని అసెంబ్లీ సమీపానికి జయదేవ్ చేరుకున్నారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. రిమాండ్‌కు పంపించేందుకు రొంపిచర్ల పోలీస్‌స్టేషన్ నుంచి గుంటూరుకు తీసుకువచ్చి అర్ధారాత్రి వరకు పోలీసుల వాహనంలోనే కూర్చోబెట్టారు. అర్ధరాత్రి జీజీహెచ్ వైద్యులతో జయదేవ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. న్యాయమూర్తి రిమాండ్ విధించగా సబ్‌జైలుకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు జైలు దగ్గరకు భారీగా చేరుకుంటున్నారు.
*ఏపీ శాసన మండలిలో వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టగా తెదేపా అడ్డుకుంది. వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ రూల్ 71 మోషన్ కింద నోటీసు ఇచ్చింది. బిల్లులు ప్రవేశపెట్టే ముందు తామిచ్చిన నోటీసుపై చర్చ జరపాలని మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. శాసనమండలిని కించపరిచే విధంగా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారనే విషయాన్ని ప్రస్తావించిన యనమల.. మండలికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మండలి సభ్యులకు ఎందుకు ఫోన్లు చేస్తున్నారని ప్రశ్నించారు. వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందినందున చర్చ జరగాల్సిందేనని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. రూల్ 71 కింద బిల్లును తిరస్కరించే అధికారం మండలికి లేదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మండలి ఛైర్మన్ … రూల్ 71 నోటీసుపై చర్చకు అనుమతిచ్చారు. దీంతో మండలిలో వికేంద్రీకరణ బిల్లుకు తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది. మండలిలో బిల్లు పెట్టి వీగిపోతే డీమ్డ్ టూ బీ పాస్డ్ కింద ప్రభుత్వానికి ఆమోదం చేసుకునే అవకాశం ఉంటుంది. అసలు బిల్లే పెట్టకపోతే డీమ్డ్ టు బీ పాస్డ్ కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
*రాజధాని అమరావతి విడిపోయిందనే బాధతో ఎమ్మెల్సీ పదవికి తెదేపా నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. భవిష్యత్తులో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన ప్రకటించారు. చంద్రబాబు, లోకేశ్ తనపై చూపిన ఆదరణ మరువలేనిదన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న మాణిక్యవరప్రసాద్.. ఈరోజు మండలి సమావేశాలకు కూడా హాజరుకాలేదు
* రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు భ్రష్టు పట్టించారు : అనిల్
ఏపీ శాసనసభ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. సభ ప్రారంభం కాగానే తెదేపా సభ్యులు ఆందోళనకు దిగారు. ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. తెదేపా సభ్యులపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర ఖజానాను దివాళా తీయించారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. సభలో దేనికోసం రచ్చ చేస్తున్నారని తెదేపా సభ్యులను నిలదీశారు. ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించారు కాబట్టే.. 23 స్థానాలు ఇచ్చారని విమర్శించారు. బీసీలు, ఎస్సీల గురించి తెదేపా నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
* మండలిలో వికేంద్రీకరణ బిల్లుకు అడ్డుకట్ట
ఏపీ శాసన మండలిలో వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టగా తెదేపా అడ్డుకుంది. వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ రూల్ 71 మోషన్ కింద నోటీసు ఇచ్చింది. బిల్లులు ప్రవేశపెట్టే ముందు తామిచ్చిన నోటీసుపై చర్చ జరపాలని మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. శాసనమండలిని కించపరిచే విధంగా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారనే విషయాన్ని ప్రస్తావించిన యనమల.. మండలికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మండలి సభ్యులకు ఎందుకు ఫోన్లు చేస్తున్నారని ప్రశ్నించారు.
* సభ నుంచి కోపంతో వెళ్లిపోయిన స్పీకర్
శాసనసభలో తెదేపా సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారం అసహనం వ్యక్తం చేశారు. రెండో రోజు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి సభలో తెదేపా సభ్యులు ఆందోళనకు దిగారు. ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చకు సభ్యులు అడ్డుతగిలారు. స్పీకర్ పోడియం వద్దకు చేరి ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రతిపక్ష సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర మనస్తాపానికి గురవుతున్నట్లు ప్రకటించి.. సభ నుంచి వెళ్లిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
*అమ్మఒడి’ ఓ విప్లవాత్మకం:వల్లభనేని వంశీ
వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి కార్యక్రమం ఓ విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిందని తెదేపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి జగన్‌ను అభినందించాల్సిన అవసరముందన్నారు. అసెంబ్లీలో అమ్మ ఒడి పథకంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా పేద విద్యార్థులను సరిగా పట్టించుకోలేదని, దూరదృష్టితో సీఎం జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వంశీ కొనియాడారు. అమ్మఒడి పథకం వల్ల సంక్రాంతికి ముందే.. అందరు తల్లిదండ్రుల ముఖాల్లో పండగ వాతావరణం కనిపించిందని చెప్పారు. అమ్మఒడి వల్ల దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న చాలా కుటుంబాలు లబ్ధిపొందుతాయని, సీఎం జగన్ ఉన్నారన్న భరోసాతో వారి పిల్లలను పాఠశాలలకు పంపిస్తారని ఆయన అన్నారు.
* ‘అమ్మఒడి’ ఒక గొప్ప సంస్కరణ పథకమని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టి లో ఉంచుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘అమ్మఒడి’ పథకాన్ని తీసుకువచ్చారని పేర్కొన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. పేదల భవిష్యత్ మార్చేందుకు అమ్మ ఒడి పథకం ఉపయోగపడుతుందన్నారు. పేద ప్రజలు, రైతులు కూలీలు మాత్రమే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తారని, అలాంటి వారికి ‘అమ్మఒడి’ భరోసా ఇచ్చిందన్నారు. ఈ పథకం వల్ల డ్రాపౌట్స్ తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.అమ్మఒడి పథకంలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి గొప్ప పథకాన్ని తెచ్చి ఇతర రాష్ట్రాలకు సీఎం జగన్ ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఇటువంటి మంచి పథకంపై జరుగుతున్న చర్చలో టీడీపీ అధినేత చంద్రబాబు లేకపోవడం దురదృష్టకరం అన్నారు. పేద పిల్లల భవిష్యత్‌ను మార్చే పథకానికి టీడీపీ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించకపోవడం దారుణమన్నారు. ఒక ప్రభుత్వ పాఠశాలలో చదవుకున్న వ్యక్తిగా తాను ‘అమ్మ ఒడి’ పథకానికి మద్దతు ఇస్తున్నానని, ఇలాంటి గొప్ప పథకాన్ని తెచ్చిన సీఎం జగన్‌ను అభినందిస్తున్నానని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్‌ను అభినందించాలన్నారు.