ఈరోజుల్లో జనాలకి ఫొటోల మీదుండే శ్రద్ధ అంతా ఇంతా కాదు. అప్పుడే పుట్టిన పసిపాప దగ్గర్నుంచీ షష్టి పూర్తి చేసుకునే బామ్మల వరకూ ప్రతి సందర్భాన్నీ ఫొటోల రూపంలో ఒడిసిపట్టుకుంటున్నారు. మరి ఈ ఫొటో షూట్ తంతు మనుషులకేనా అనుకుంటున్నారేమో… తిరుమలలో కొలువైన ఆ ఏడుకొండల వాడికీ సతీసమేతంగా ప్రత్యేకంగా షూట్ జరుగుతుందని మీకు తెలుసా… ఆ ఫొటోలే క్యాలెండర్ల రూపంలో ఆవిష్కృతమవుతాయని ఎప్పుడైనా విన్నారా?
**సంవత్సరాన్ని మార్చుతూ… రోజులన్నింటినీ ఒక్కచోటికి తెచ్చే క్యాలెండర్లకి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టే వేళ ఎంత డిమాండో. ఎవరి అభిరుచికి తగ్గట్టు వాళ్లు వీటిని ఎంచుకుంటూ ఉంటారు. పిల్లల ఫొటోలు ఉండే క్యాలెండర్లను కొందరు ఇష్టపడితే… ప్రకృతి అందాలను మరికొందరు కోరుకుంటుంటారు. అయితే ఎక్కువ మంది ఓటువేసేది మాత్రం ఆ కోనేటి రాయుడి ఫొటోలతో అత్యంత మనోహరంగా రూపొందించిన క్యాలెండర్లకే. తెల్లవారి లేచింది మొదలు స్వామిని స్మరించుకుంటూ క్యాలెండరులోని రూపాన్ని కళ్ల నిండా నింపుకోవాలన్నదే భక్తుల ఆకాంక్ష.
***అలంకారం ప్రత్యేకం
స్వప్నతిరుమంజనం, వసంతోత్సవం, బ్రహ్మోత్సవం సమయాల్లో స్వామిని ఎంతో శోభాయమానంగా అలంకరిస్తారు. అప్పుడే సతీసమేతుడైన వడ్డికాసుల వాడికి ప్రత్యేకంగా ఫొటో షూట్ కూడా చేస్తారు. ఇందుకోసం ముగ్గురు తితిదే ఫొటోగ్రాఫర్లూ, జేఎన్‌టీయూ-హైదరాబాద్‌లో ఫొటోగ్రఫీ కోర్సులో శిక్షణ ఇచ్చే మరో ఏడుగురు నిపుణులూ శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీమలయప్పస్వామి ఫొటోలు తీయడానికి పనిచేస్తారు. ఆ సమయంలో పుష్ప ప్రియుడైన స్వామివారి అలంకారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. దేశవిదేశాల నుంచి తెప్పించే రకరకాల పువ్వులతోపాటు ఎండు ఫలాలూ, యాలకులూ, చిక్కుడు గింజలూ, వేరుసెనగలూ, డ్రైచెర్రీస్, వట్టివేళ్లూ తదితరాలతో రూపొందించిన మాలలూ కిరీటాలూ పెడతారు. స్వామివారి దుస్తులూ, నగలూ, తలపాగాలన్నీ పరస్పరం మ్యాచ్ అయ్యేలా చూస్తారు. స్వామికి ఈ సమయంలో కట్టే పీతాంబరం దాదాపు నలభై కేజీల బరువు ఉంటుంది. దుస్తులకీ నగలకీ తగ్గట్టే కిరీటాలనూ ప్రత్యేకంగా తయారుచేస్తారు. వీటిని తమిళనాడులోని తిరుప్పూర్‌కి చెందిన ఓ ఇరవై మంది నిపుణులు స్వామివారి విగ్రహాల కొలతలు తీసుకుని దాదాపు మూడు నెలలపాటు శ్రమించి రూపొందిస్తారు. ఈ విధంగా ప్రత్యేక అలంకరణతో శోభిల్లే ఆ మలయప్పస్వామిని అన్నికోణాలలోనూ అందంగా ఫొటోలు తీశాక తితిదే ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆగమ నియమాలకు అనుగుణంగానూ, నాణ్యంగానూ ఉన్న పన్నెండు ఫొటోలను ఎంపిక చేసి టెండర్ల ద్వారా జాతీయస్థాయి ప్రింటింగ్ సంస్థలకు ముద్రణ బాధ్యతలు అప్పగిస్తారు.
ఈ ఏడాది ఫరీదాబాద్‌కు చెందిన ఇన్‌ఫినిటీ, శివకాశిలోని లవ్‌లీ, ముంబయికి చెందిన ఓం ప్రింటర్స్ ఈ టెండర్లను దక్కించుకుని క్యాలెండర్లనూ, డైరీలనూ ముద్రించాయి. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ముద్రించే ఈ క్యాలెండర్లను ురాష్ట్రాలవారితోపాటు దేశవిదేశీ భక్తులు సైతం ఇష్టంగా కొంటుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానంతోపాటు తితిదే కల్యాణమండపాల్లోనూ ఇవి అందుబాటులో ఉంటాయి. అలానే టీటీడీసేవ, టీటీడీపబ్లికేషన్ వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఆర్డరిచ్చి తెప్పించుకోవచ్చు. చాలామంది భక్తులు వీటిని నూతన సంవత్సరం-సంక్రాంతి సందర్భంగా బంధువులకీ, ఆత్మీయులకీ కానుకలుగానూ అందజేస్తుంటారు.
2.4 నుంచి పాతగుట్టలో వార్షికోత్సవాలు-ఈ నెల 31 నుంచి అధ్యయనోత్సవాలు
యాదాద్రి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ వార్షికోత్సవాలు ఈ నెలాఖరున మొదలవుతాయి. తొలుత అధ్యయనోత్సవాలు, అనంతరం బ్రహ్మోత్సవాలను చేపట్టేందుకు యాదాద్రి దేవస్థానం నిర్ణయించింది. స్థానాచార్యులు, ప్రధాన పూజారులు నిర్ణయించిన ప్రకారం ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు అధ్యయనోత్సవాలు నిర్వహిస్తారు. అనంతరం వారం పాటు నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 4న శ్రీకారం చుడతారు. ఫిబ్రవరి 6న ఎదుర్కోలు, 7న కల్యాణం, 8న రథోత్సవ వేడుకలను నిర్వహిస్తారు. 10న అష్టోత్తర శతఘటాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయని యాదాద్రి దేవస్థానం కార్యనిర్వహణాధికారి గీతారెడ్డి తెలిపారు. ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా పాతగుట్టలో ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 10 వరకు భక్తులు నిర్వహించే శ్రీ స్వామి, అమ్మవార్ల మొక్కు కల్యాణోత్సవాలు రద్దు చేసినట్లు వెల్లడించారు.
3. సత్యసాయి ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీగా రత్నాకర్
సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీగా ఆర్.జె.రత్నాకర్ను నియమించారు. గురువారం సత్యసాయి సెంట్రల్ ట్రస్టు బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులు రత్నాకర్ను మేనేజింగ్ ట్రస్టీగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ట్రస్టులో 9 మంది సభ్యులుండగా ఆయనకు మేనేజింగ్ ట్రస్టీ బాధ్యతలు అప్పగించారు
4. 2 నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు.. 50 శాతం చార్జీలు అదనం
ఈ ఏడాది ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక, సారలమ్మ జాతర-2020 సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుందని రంగారెడ్డి జిల్లా ఆర్ఎం వరప్రసాద్ తెలిపారు. ఫిబ్రవరి 2 నుంచి 8వ తేదీ వరకు హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లతో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 500ల బస్సులను నడపనున్నారు. నగరంలోని దిల్సుఖ్నగర్ బస్టాండ్, జగద్గిరిగుట్ట, నేరేడ్మెట్, కేపీహెచ్బీ, మియాపూర్, లింగంపల్లి, లాల్దర్వాజ తదితర ప్రాంతాల నుంచి బస్సులు బయల్దేరి ఉప్పల్లోని వరంగల్ పాయింట్ మీదుగా ఆర్టీసీ బస్సులను నడపనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం క్యూలైన్లను, బుకింగ్ కౌంటర్లను, బస్సులను, ప్రయాణికుల రద్దీని పర్యవేక్షించేందుకు ప్రతి పాయింట్లో డిపో మేనేజర్లకు, ట్రాఫిక్ సూపర్వైజర్ స్థాయి అధికారులకు, సెక్యూరిటీ సిబ్బందికి బాధ్యతలు అప్పగించనున్నారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక బస్సులకు అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యాన్ని ఆన్లైన్లో కల్పించారు. బస్సుల కోసం చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ముందస్తుగా మేడారం ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో సీట్లను రిజర్వేషన్ చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సుమారు 50మంది ప్రయాణికులు ఒక బస్సు హైదరాబాద్ నుంచి బుక్ చేసుకుంటే వారి వద్దకే బస్సులను పంపేవిధంగా ఏర్పాట్లు చేశారు.
5. తిరుమలలో ఉచిత లడ్డూ పంపిణీ ప్రారంభం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూ ఇచ్చే విధానాన్ని సోమవారం నుంచి ప్రారంభించారు. టీటీడీ పాలకమండలి నిర్ణయం మేరకు ఇప్పటివరకు లడ్డూపై రాయితీలను రద్దుచేసి శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక ఉచిత లడ్డూ ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా సోమవారం తెల్లవారుజామున 12.05 గంటల నుంచి ఉచిత లడ్డూ టోకెన్లు పంపిణీ చేశారు. ధర్మదర్శనం, స్లాటెడ్, దివ్యదర్శనం, వృద్ధులు-దివ్యాంగులు, చంటిబిడ్డల తల్లిదండ్రులు.. ఇలా 12 ఏళ్లు పైబడిన భక్తులందరికీ వారు క్యూకాంప్లెక్సులోకి ప్రవేశించే మార్గాల్లో ఉచిత లడ్డూ టోకెన్లు అందజేశారు. అదనంగా లడ్డూలు కావాలనుకునే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 12 కౌంటర్లలో ఒక్కొక్కటి రూ.50 చొప్పున టోకెన్లు విక్రయించారు. ఒక్కొక్క భక్తుడు 2 నుంచి 10 లడ్డూల వరకు పొందే వెలుసుబాటు కల్పించారు. మరోవైపు ఇప్పటివరకు ఆలయంలో ఉన్న ఆర్జితసేవలు, సిఫారసు లేఖలపై ఇచ్చే ప్రసాదాల కేంద్రాన్ని(వగపడి) కూడా ఆలయం వెలుపల లడ్డూ కౌంటర్లోకి మార్చారు. కళ్యాణోత్సవం, విశేషపూజ, అష్టదళపాద పద్మారాధన, సహస్ర కలశాభిషేకం, అభిషేకం తదితర ఆర్జితసేవా టికెట్లు కలిగిన భక్తులకు 45, 46 నంబరు కౌంటర్లలో ప్రసాదాలను అందజేస్తున్నారు. సిఫారసు లేఖలు కలిగిన భక్తులకు కూడా ఈ కౌంటర్ల వద్దే లడ్డూలు, వడలు విక్రయిస్తున్నారు. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి సోమవారం లడ్డూకౌంటర్లలో తనిఖీలు నిర్వహించారు.
6. పంచాంగము 21.01.2020
సంవత్సరం: వికారి
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: హేమంత
మాసం: పౌష్య
పక్షం: కృష్ణ బహుళ
తిథి: ద్వాదశి రా.02:58 వరకు
తదుపరి త్రయోదశి
వారం: మంగళవారం (భౌమ వాసరే)
నక్షత్రం: జ్యేష్ఠ రా.01:19 వరకు
తదుపరి మూల
యోగం: ధృవ, వ్యాఘత
కరణం: కౌలవ
వర్జ్యం: ఉ.07:14 – 08:49
దుర్ముహూర్తం: 09:04 – 09:49
రాహు కాలం: 03:16 – 04:40
గుళిక కాలం: 12:27 – 01:51
యమ గండం: 09:38 – 11:02
అభిజిత్ : 12:05 – 12:49
సూర్యోదయం: 06:49
సూర్యాస్తమయం: 06:04
వైదిక సూర్యోదయం: 06:53
వైదిక సూర్యాస్తమయం: 06:01
చంద్రోదయం: రా.03:31
చంద్రాస్తమయం: ప.03:00
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
దిశ శూల: ఉత్తరం
నక్షత్ర శూల: తూర్పు
చంద్ర నివాసం: ఉత్తరం
భాగవత ఏకాదశి
తిల ద్వాదశి
7. రాశిఫలం – 21/01/2020
తిథి:
బహుళ ద్వాదశి రా.2.33 , కలియుగం-5121 ,శాలివాహన శకం-1941
నక్షత్రం:
జ్యేష్ఠ రా.12.52
వర్జ్యం:
ఉ.6.50 నుండి 8.24 వరకు
దుర్ముహూర్తం:
ఉ.08.24 నుండి 09.12 వరకు, తిరిగి రా.10.48 నుండి 11.36 వరకు
రాహు కాలం:
మ.3.00 నుండి 4.30 వరకు విషేషాలు: వైష్ణవానాం ఏకాదశి
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా నుండుట మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి వుంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరును. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాలవల్ల లాభం చేకూరును. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణా తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా వుంటుంది. బంధు, మిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) ఋణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలుండును. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం వుంది. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి వుంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) కుటుంబ విషయాలపై అనాసక్తితో వుంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్ర్తిలతో జాగ్రత్తగా నుండుట మంచిది.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) కుటుంబంలో సుఖ, సంతోషాలుంటాయి. ధనధాన్యాభివృద్ధి వుంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యములు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా వుంటాయి.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గూర్చి జాత్త్ర వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులెదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనవసర వ్యయ ప్రయాసలుంటాయి. ప్రయాణాలెక్కువ చేస్తారు.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) అపకీర్తి రాకుండా జాగ్రత్తపడుట మంచిది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండుటకు ప్రయత్నించాలి.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) తలచిన కార్యాలన్నియు విజయవంతంగా పూర్తిచేసుకోగలుగుతారు. బంధు, మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలుండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులేర్పడతాయి.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంలో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
8. ఆధ్యాత్మికం
పంచభూతాలను తన వశం చేసుకున్న పరమాత్ముడు ఆంజనేయుడు. అలాగే జ్ఞానేంద్రియాలను కూడా నియంత్రణలో వుంచుకోగలిగిన మహాశక్తిశాలి.. హనుమంతుడు. శ్రీ రాముడు లంకకు చేరుకునేందుకు గాను.. రామసేతు నిర్మాణంలో ఆంజనేయుడు నిమగ్నమై వుండగా.. శనిభగవానుడు హనుమంతుడిని బంధించేందుకు వచ్చాడు. రెండున్నర గంటసేపు హనుమను పట్టేందుకు వచ్చిన శనీశ్వరుడికి ఆంజనేయుడు చుక్కలు చూపించాడు. ”రెండున్నర గంట పాటు హనుమా నిన్ను చెరపట్టాలి. నీ శరీరంలో ఏదైనా ఒక ప్రాంతాన్ని నాకివ్వమని అడుగుతాడు. అయితే రామసేతు నిర్మాణంలో తానుండగా.. చేస్తున్న పనికి ఆటంకం కలిగిస్తున్నావని హనుమ చెప్తాడు. అయినా నీకు నా తలభాగం ఇస్తాను. అక్కడ ఎక్కి కూర్చోమంటాడు. అంతే శని కూడా హనుమంతుడి తలపై ఎక్కి కూర్చుంటాడు.
కానీ ఆంజనేయుడు రాళ్లను, కొండలను తన తలపై మోసాడు. భారం తాళలేక శనిభగవానుడు గగ్గోలు పెట్టగా, మాట తప్పకూడదు. రెండున్నర గంట సేపు అలానే వుండాల్సిందేనని షరతు విధిస్తాడు. ఆ రెండున్నర గంటకు తర్వాతే హనుమంతుడు శనీశ్వరుడు తల నుంచి శనీశ్వరుడిని కిందికి దించుతాడు. ఆపై రామ భక్తులను, ఆంజనేయ భక్తులను శనీశ్వరుడు ఇక్కట్లకు గురిచేయకూడదని హెచ్చరించాడు” అలా శనీశ్వరుడి చెర నుంచి హనుమంతుడు తప్పుకున్నాడు.
అలాంటి మహిమాన్వితుడైన హనుమంతునికి తులసీ మాలను సమర్పించుకుంటే శనిగ్రహ బాధల నుంచి గట్టెక్కవచ్చు. ఆంజనేయునికి రామనామం అంటే మహాప్రీతి. హనుమజ్జయంతి రోజున ”రామ రామ రామ” అనే మంత్రాన్ని పఠించడం చేయొచ్చు.”ఓం ఆంజనేయాయ విద్మహే
9. వాయుపుత్రాయ ధీమహి
తన్నో హనుమాన్ ప్రచోదయాత్” అనే మంత్రాన్ని 11 సార్లు పఠించడం ద్వారా శనీశ్వర గ్రహ దోషాల నుంచి గట్టెక్కవచ్చు. హనుమజ్జయంతి రోజున తులసీమాల సమర్పించడం, తులసీ ఆకులతో అర్చన చేయడం ద్వారా సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆ రోజున వడమాల సమర్పించడం, వెన్నతో ఆంజనేయుడిని అలంకరించడం, అన్నదానం చేయడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు.
మనోబలం, బుద్ధిబలం, శరీరబలం, ప్రాణ బలం కోసం ఆంజనేయ స్వామిని స్తుతించడం చేయాలి. ఆంజనేయ ఆరాధన ద్వారా వీరం, వివేకం పెంపొందుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
10. మనో వికాసం:ఆత్మవిశ్వాసం
కొందరు వ్యక్తులుంటారు నిండుగా కనిపిస్తూ, మనసారా నవ్వుతూ, హాయిగా జీవిస్తూ చలాకీగా కనిపిస్తారు. హుందాగా సాగే వారి జీవితానికి కారణం ఏమిటి? చాలా మందిలో లేనిది, వారికి ఉన్నది ఏమిటని పరిశీలిస్తే- అలాంటి ఆత్మ సంతృప్తి గల వ్యక్తులు అందం కలిగి ఉండవచ్చు. ధనం, హోదా, అధికారం కలిగి ఉండవచ్చు. ఆస్తిపాస్తులతో పాటు విద్యావంతులై ఉండవచ్చు. లేదా గొప్ప మేధావుల కుటుంబంలో జన్మించి ఉండవచ్చు. ఈ కారణాలన్నీ గొప్ప వ్యక్తుల ఆత్మ విశ్వాసానికి మూలమని సామాన్యంగా మనం భావిస్తాం! కానీ చిత్రమేమంటే ఈ అంశాలన్నీ వారి ఆత్మ విశ్వాసానికి కారణం కావచ్చు, కాకపోవచ్చు కూడ.జానికి ఆత్మ పట్ల నమ్మకం, విశ్వాసం ప్రోది చేసుకున్న వ్యక్తి ఆత్మవిశ్వాసం సంపూర్ణంగా కైవసం చేసుకోవచ్చు. విచిత్రమేమంటే ఆత్మ, దేవుడు వంటి విషయాల పట్ల ఏ మాత్రం నమ్మకం, ఆసక్తిలేని వ్యక్తులూ అనేక కారణాలవల్ల సంపూర్ణ ఆత్మసంతృప్తితో జీవితం గడిపి తమతమ గమ్యాలకు చేరుకొని విశేషంగా లబ్ధి, ప్రాచుర్యం పొందిన ఘటనలు ఈ లోకంలో అనేకం!స్వార్థరహితమైన మనసు, ప్రవృత్తి, వ్యాపకం వంటివి మనిషి ధీరోదాత్తతకు ఉపకరణాలు. ఏ ప్రలోభాలకూ లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మవిశ్వాసం సంతరించుకుంటాడు. దైవం పట్ల ప్రత్యేక శ్రద్ధ, ఆకర్షణ లేకపోయినా తనలోని ‘నేను’ పట్ల గురి, నమ్మకం ఉన్న వ్యక్తి ఆత్మ విశ్వాస సంభూతుడే అవుతాడు.మనిషిలోని మచ్చలేనితనం పదిమందిలో అతడికి గౌరవాన్ని ప్రసాదిస్తుంది. ప్రశంసలకు, సన్మానాలకు ఆశపడని అతీతుడు నిజానికి గొప్పవాడే! ఏదో తెలియని పిరికితనం వల్ల మనిషి గౌరవాలను స్వీకరించకపోతే దాన్ని అతడి వినమ్ర స్వభావం కింద జమకట్టలేం! ప్రతిభ ఉండీ పిరికితనం వల్ల మనిషి చాలా పోగొట్టుకుంటాడు.ధైర్యం మనిషి శక్తిని సాచేందుకు ఉపకరణమవుతుంది. తదుపరి ఆభరణమవుతుంది. అలంకారమవుతుంది. ధీరజనులు, వారిలోని ధీరగుణానికి తమ మద్దతు ప్రకటించిన మహాపురుషుల్లో పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు, నేటియుగపు త్రివిక్రముడు అయిన స్వామి వివేకానంద ప్రముఖులు. యుద్ధభూమిలో అర్జునుడి పిరికితనాన్ని నిరసిస్తూ అతడికి ధైర్యాన్ని నూరిపోయవలసిన మహా అవసరాన్ని నొక్కి వక్కాణించిన గొప్ప సన్నివేశం అర్జున విషాదయోగం. పరమాత్మ ప్రబోధం తరవాత అర్జునుడు పిరికితనాన్ని వీడి ఆత్మవిశ్వాసాన్ని, దాని ప్రాశస్త్యాన్ని గుర్తెరిగి యుద్ధానికి ఉపక్రమించడం తదుపరి పరిణామం!ఇనుప కండరాలు, ఉక్కు నరాలు సంతరించుకొని ఆత్మవిశ్వాస సంభూతులై జీవన సమరాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మార్గ నిర్దేశం చేసిన స్వామి వివేకానందుడి పాత్ర యువతను కలత నిదుర నుంచి లేపి జీవితంలో అజేయులై నిలిచేందుకు తోడ్పడేదే!ఆత్మవిశ్వాసం అంటే నలుగురితో కలిసి మెలిసి ఉండక, గుంభనంగా ఆధిక్యత ప్రదర్శించడం కాదు. తనకున్న ఏ ఒక్క ప్రత్యేకత ఆధారంగానూ అహంకారం ప్రదర్శించి అందరిలోనూ తాను విభిన్నం, అధికం అని చాటుకోవడం కాదు. ఆత్మ విశ్వాసం ఓ బలవర్ధక పానీయం వంటిది. ఆ భావం పిరికితనాన్ని పారదోలుతుంది. విద్యార్జనకు, ఆరోగ్యసాధనకు తోడ్పడుతుంది. భిన్నత్వం గల సమాజంలో ఏకతా భావన సాధించేందుకు బలం ఇస్తుంది. ఆత్మ, పరమాత్మకు భిన్నంకాదు కాబట్టి ఆధ్యాత్మిక అంశంలో సైతం ముందుకు సాగేందుకు తోడ్పడుతుంది. ఆధునిక కాలంలో యువత కోరుకొనే ఎత్తులకు ఎదిగేందుకు ఉపకరణమవుతుంది. ఏ వయసువారైనా పట్టు సాధించవలసిన మహత్తర అంశం ఆత్మవిశ్వాసం!
11. శుభోదయం
మహానీయుని మాట
” ఎవరైనా మనకిచ్చేది తాత్కాలికమైనది.
కృషి తో మనం సంపాదించుకునేది శాశ్వతం ”
నేటి మంచి మాట
” జ్ణానం వంశపారపర్య సంపద కాదు. ఎవరికివారు కష్టపడి ఆర్జించుకోవలసిందే.
12. నేటి సుభాషితం
బలం లేనప్పుడు విశ్వాసమును పొందలేము, ఏ గొప్ప పని సాధించడానీకైనా విశ్వాసం మరియు శక్తి అనేవి రెండు అవసరం
13. నేటి సామెత
పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు
పొయ్యిమీద ఉన్న పెనం కన్నా పొయ్యిలోని మంట ఇంకా చాలా వేడిగా ఉంటుంది. ఏదైనా వస్తువు పెనం మీదినుండి పొయ్యిలో పడితే ఇంకా ఎక్కువ కాలుతుంది. ఈ విధంగా ఎవరైనా ఉన్న బాధల కంటే ఎక్కువ బాధలలోకి దిగజారితే వారి పరిస్థితిని వివరిస్తూ ఈ సామెతను వాడుతారు.
14. నేటి ఆణిముత్యం
మొదలు పెట్టిన యత్నంబు తుదకు విడిచి
వేరు యత్నాలు చేయుటే పిరికి తనము;
ప్రాణ మెద్దియు పాయక యత్నములను
చేయువా ఓయిల ఘను, డజేయు డగును
భావము :
ఒక పని మొదలు పెట్టిన తర్వాత విడిచిపెట్టి వేరు ప్రయత్నాలు చేయటం పిరికితనం అవుతుంది. ప్రాణం పోయినా సరే, తలపెట్టిన కార్యం పూర్తిచేయగలవాడే గొప్పవాడవుతాడు.
15. మన ఇతిహాసాలు
రామాయణం లో సంఖ్యా మానంశతం శతసహస్రాణాం కోటిమాహుర్మనీషణః
శతం కోటిసహస్రాణాం శంఖ ఇత్యభిధీయతే. రామా..యు.కాం…సర్గ..28..33
శతం శంఖసహస్రాణాం మాహాశంఖ ఇతి స్మ్రతః
మహా శంఖసహస్రాణాం శతం బృందమితిస్మ్రతమ్. రామా..యు.కాం…సర్గ..28..34
శత బృందసహస్రాణాం మహాబౄందమితి స్మ్రతమ్
మహాబృందసహస్రాణాం శతం పద్మమితిస్మ్రతమ్. రామా..యు.కాం…సర్గ..28..35
శతం పద్మసహస్రాణాం మహాపద్మమితిస్మ్రతమ్
మహాపద్మసహస్రాణాం శతం ఖర్వమిహోచ్యతే రామా..యు.కాం…సర్గ..28..36
శతం ఖర్వసహస్రాణాం మహాఖర్వమిహోచ్యతే
మహాఖర్వ సహస్రాణాం సముద్రమ్ అభిభీయతే రామా..యు.కాం…సర్గ..28..37
శతం సముద్రసాహస్రమ్ ఓఘ ఇత్యభీభీయతే
శతమోఘసహస్రాణాం మహోఘ ఇతి విశ్రుతః రామా..యు.కాం…సర్గ..28..38
అర్థం
నూరు లక్షలు ఒక కోటి.లక్షకోట్లు ఒక శంఖము. లక్ష శంఖములు మహాశంఖము.లక్షమహాశంఖములు ఒక బృందము. లక్ష బృందములు ఒక మహాబృందము.లక్షమహాబృందములు ఒక పద్మము. లక్షపద్మములు ఒక మహాపద్మము. లక్ష మహాపద్మములు ఒక ఖర్వము. లక్ష ఖర్వములు ఒక మహా ఖర్వము. లక్షమహాఖర్వములు ఒక సముద్రము.లక్ష సముద్రములు ఒక ఓఘము.లక్ష ఓఘములు మహౌఘము.
ఒకటి1=1
పది10=10^1
నూరు లేక వంద 100=10^2
వెయ్యి1000=10^3
లక్ష100,000=10^5
కోటి10,000,000= 10^7
కోటి10^2X1^05=10^7
లక్ష Xకోటి=10^5X10^7=1^012 శంఖము
లక్ష X శంఖము= 10^5X10^12=10^17 మహా శంఖము
లక్ష X మహా శంఖము=10^5X10^17=10^22బృందము
లక్ష X బృందము=10^5X10^22=10^27మహాబృందము
లక్ష Xమహాబృందము=10^5X 10^27=10^32పద్మము
లక్ష Xపద్మము=10^5X 10^32=10^37మహా పద్మము
లక్ష Xమహాపద్మము=10^5X 10^37=10^42ఖర్వము
లక్ష Xఖర్వము=10^5X 10^42=10^47మహా ఖర్వము
లక్ష Xమహా ఖర్వము=10^5X 10^47=10^52సముద్రము
లక్ష Xసముద్రము=10^5X 10^52=10^57ఓఘము
లక్ష Xఓఘము=10^5X 10^57=10^62మహౌఘము
16. తిరుమల\|/సమాచారం
ఓం నమో వేంకటేశాయ!!
• ఈరోజు మంగళవారం,
21.01.2020
ఉదయం 5 గంటల
సమయానికి,
తిరుమల: 16C°-25℃°.
• నిన్న 77,988 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం లభించింది,
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్
లో 03 కంపార్ట్మెంట్ లో
సర్వదర్శనం కోసం భక్తులు
వేచి ఉన్నారు.
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
06 గంటలు
పట్టవచ్చును,
• నిన్న స్వామివారికి
హుండీ లో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3.06 కోట్లు,
• నిన్న 17,532 మంది
భక్తులకు శ్రీ పద్మావతి
అమ్మవారి దర్శన భాగ్యం
కలిగినది,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
/ / గమనిక / /
• ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
ప్రత్యేక దర్శనాలు:
• జనవరి 21, 28వ తేదీల్లో
వృద్ధులు, దివ్యాంగులకు
శ్రీవారి ప్రత్యేక దర్శనం,
• జనవరి 22, 29వ తేదీల్లో
5 ఏళ్లలోపు చంటిపిల్లల
తల్లిదండ్రులకు ప్రత్యేక
దర్శనం.
17. సిద్ధి వినాయకునికి 35 కిలోల స్వర్ణ కానుక… విలువ ఎంతంటే?
మహానగరం ముంబైలోని సిద్ధి వినాయక ఆలయానికి ఒక భక్తుడు భారీ ఎత్తున బంగారాన్ని కానుకగా అందించాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఢిల్లీకి చెందిన ఒక భక్తుడు గణేశునికి బంగారు ప్లేటింగ్‌ను కానుకగా అందించాడు. దీనిని తయారు చేసేందుకు 35 కిలోల బంగారాన్ని వినియోగించారు. దీని విలువ రూ. 14 కోట్లు ఉంటుంది. ఈ సిద్ధి వినాయక ఆలయం దేశంలోనే అత్యంత ధనిక ఆలయాలలో ఒకటిగా పేరుగాంచింది. ప్రతీయేటా ఈ ఆలయానికి కోట్ల రూపాయలు కానుకల రూపంలోవస్తుంటాయి.
తిరుమల వెంకన్న ఫోటో షూట్
Related tags :