ముఖం అందంగా మారాలంటే కాకరతో ఇలా చేయండి..
కాకరకాయ ఆరోగ్యానికి మంచిదని తెలుసు.. కానీ, దీన్ని ఉపయోగించడం వల్ల ముఖం కూడా ఎంతో అందంగా తయారవుతుందని తెలుసా.. ఇందుకోసం కాకరతో కొన్ని ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య చాలా వరకూ తగ్గుతుంది. ఈ ఫేస్ ప్యాక్స్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
అందానికి కాకర..
కాకరకాయ.. ఈ పేరు వినగానే ముందుగా అందరూ ముఖాన్ని వికారంగా పెడతారు. చేదుగా ఉన్న కాకరని తినడానికి ఎవరూ ఇష్టపడరు. అయితే, ఈ కాకరని ఉపయోగించి ఎంతో అందంగా తయారవ్వొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఆరోగ్యాన్నిచ్చే కాకరలో అందానికి పనికొచ్చే ఎన్నో గుణాలు ఉన్నాయని చెబుతున్నారు. దీనిని ముఖానికి పూతల వేసుకుంటే ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చల సమస్యలు చాలా వరకూ తగ్గుతాయని చెబుతున్నారు.
కాకర ఫేస్ ప్యాక్ ఇలా..
ముందుగా కాకర కాయని రసంలా చేయండి.. ఈ రసాన్ని ముఖానికి రాయాలి. 5 నిమిషాలు అలానే ఉంచి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడిగాలి. ఇలా రోజుకి ఓ సారి చేయడం వల్ల ముఖం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది. ఎలాంటి మచ్చలు ఉన్నా చాలా వరకూ దూరం అవుతాయి. ముఖం కూడా ఎంతో తాజాగా మారుతుంది. మొటిమల సమస్యతో బాధపడేవారు ఈ ప్యాక్‌ని రెగ్యులర్‌గా వేసుకుంటూ ఉండడం వల్ల సమస్య త్వరగా తగ్గుతుంది.
కాకరకాయ పేస్ట్‌లో కరివేపాకు పొడి వేసి కలపాలి. ఇప్పుడు దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేయాలి. ఆరిన తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కూడా మొటిమల సమస్య చాలా వరకూ తగ్గుతుంది.
కాకర పెరుగు ప్యాక్..
కాకరకాయ సగం ముక్కని తీసుకుని పేస్ట్‌లా చేయాలి. ఇందులో జాజికాయ పొడి, పెరుగు కలిపాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని ముఖంపై ప్యాక్‌లా వేయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో ముఖాన్ని క్లీన్ చేయాలి. ఇలా వరుసగా కొన్ని రోజులు చేస్తుంటే.. మొటిమలు, మచ్చల సమస్య పూర్తిగా తగ్గుతుంది.
జాజికాయలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవన్నీ మొటిమలు ఏర్పడడానికి బ్యాక్టీరియాని నాశనం చేస్తాయి. దీని వల్ల ఆ సమస్య చాలా వరకూ తగ్గుతుంది. అదే విధంగా పెరుగు చర్మానికి మంచి కాంతిని ఇస్తుంది. పెరుగుని రాయడం వల్ల ముఖంపై ఏర్పడిన మచ్చల సమస్య చాలా వరకూ దూరం అవుతుంది.
ముఖం తాజాగా మారాలంటే..
కాకర ముక్కలను నీటిలో మరిగించాలి. ఆ నీటిలో కాటన్ బాల్ ముంచి క్లీన్ చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న ఎలాంటి మచ్చలైనా దూరం అవుతాయి.
దీనిని ఓ రకంగా చెప్పాలంటే మంచి టోనర్‌గా వాడొచ్చు. ఎప్పటికప్పుడు రసంని తీసుకోవడం కష్టం అనుకుంటే ఒక్కసారిగా రసంని తీసుకుని ఓ బాటిల్‌లో పోసుకుని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడల్లా ఈ టోనర్‌ని రాసి సమస్యని దూరం చేసుకోవచ్చు.
చర్మ సమస్యలకు కాకర..
కాకరని ముందుగా పేస్ట్‌లా చేయాలి. ఆ తర్వాత అందులో కాసింత అలోవేరా జ్యూస్ కలపాలి. ఇదే మిశ్రమంలో కాసింత పసుపు కలపాలి. చర్మ సమస్యలు, దురద సమస్యలు ఉన్నవారు ఆ ప్రాంతంలో ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. ఈ ప్యాక్ వేసిన అనంతరం కాసేపు ఆరిన తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా సమస్య తగ్గుతుంది. రెగ్యులర్‌గా ఇలా చేయడం క్రమంగా ముఖం మీద ఉన్న మచ్చలు మొత్తం తగ్గుతాయి. ఎన్నో ఖరీదైన క్రీమ్స్ రాసినా తగ్గని మొటిమల సమస్య మొత్తం ఈ కాకర ఫేస్ ప్యాక్‌తో తగ్గిపోతాయి. దీనికి కారణం కాకరలో ఎన్నో ప్రత్యేక గుణాలు ఉండడమే. ఇవి చర్మంపై ఉన్న మొటిమలని చాలా వరకూ తగ్గిస్తాయి.