సగం మంది పురుషులకు ‘ఆ’ సమస్యలు..యువకులూ బాధితులే..లండన్‌లోని కింగ్స్ కాలేజీ పరిశోధకులు నిర్వహించిన సర్వేలో.. పురుషుల లైంగిక సామర్థ్యం రోజు రోజుకు తగ్గిపోతోందని వెల్లడైంది.
పురుషుల శృంగార సామర్థ్యంపై నిర్వహించిన ఓ తాజా సర్వేలో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురుషుల్లో సగం మంది అంగస్తంభన సమస్యలతో బాధపడుతున్నారట. 50 ఏళ్ల లోపు ఉన్న పురుషుల్లో 50 శాతం మంది ఈ సమస్యతో సెక్స్‌ను ఎంజాయ్ చేయలేకపోతున్నారని తేలింది. లండన్‌లోని కింగ్స్ కాలేజీ పరిశోధకులు నిర్వహించిన సర్వేలో.. పురుషుల లైంగిక సామర్థ్యం రోజు రోజుకు తగ్గిపోతోందని వెల్లడైంది. వాళ్లు నిర్వహించిన సర్వేలో బ్రెజిల్‌లోని పురుషుల్లో 40 ఏళ్లలోపు వాళ్లలో.. 35.6 శాతం మంది 18-25 వయస్కులు అంగస్తంభన సమస్యతో మదనపడుతున్నారు. 30.7 శాతం మంది 26-40 ఏళ్ల వయస్కులు ఈ సమస్యతో మానసికంగా కుంగిపోతున్నారు.
రోజూవారీ జీవితంపై పడిన ప్రభావమే.. ఈ సమస్యకు కారణమని, ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి వల్ల దీని బారిన పడుతున్నారని తేలింది. హృద్రోగ సమస్యలు, మతిమరుపు, అకాల మరణం లాంటివి కూడా ఏర్పడుతున్నాయని పరిశోధకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 2025 నాటికి 322 మిలియన్ల పురుషులు అంగస్తంభన సమస్యను ఎదుర్కొంటారని వెల్లడించారు. 1995లో ఆ సంఖ్య 152 మిలియన్లుగా ఉండేది. యూకేలో 11.7 మిలియన్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని, ప్రతి 8 మందిలో ఒకరు బాధితులేనని పేర్కొన్నారు.
లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చని తెలిపారు. బరువు తగ్గడం, ధూమపానానికి దూరంగా ఉండటం, ఆరోగ్యకర ఆహారం తినడం, ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల అంగస్తంభన సమస్యలను దూరం చేసుకోవచ్చని వివరించారు.