Food

బియ్యం పురుగు పడుతోందా?

Latest Food Saving Tips In Telugu-How to prevent bugs in rice?

కొత్త బియ్యం, పాత బియ్యం అనే తేడా లేకుండా బియ్యంలో చిన్న చిన్న పురుగులు చేరుతూ ఉంటాయి. అలాగే గోధుమపిండి ఒక వారం డబ్బాలో ఉంచినా చాలు వెంటనే పురుగులు చేరతాయి. ఆ పురుగులను బయటకు తీయడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లయితే ఆ వస్తువులను బయటపడేయాల్సి వస్తుంది. అందుకే కొన్ని చిట్కాలు మీకోసం..
*కర్పూరం బిళ్ళలు:
బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే కర్పూరం బిళ్లలను మెత్తగా పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని చిన్న చిన్న కాటన్‌ క్లాత్‌లలో ఉంచి, బియ్యం సంచి లేదా బియ్యం డబ్బాలో వేయాలి. ఇలా చేస్తే పురుగు పట్టకుండా నిరోధించవచ్చు.
వేపాకు ఉండలు: పైన కర్పూరం బిళ్ళలతో చేసిన విధంగా బియ్యంలో పురుగు పట్టినప్పుడు వెంటనే కొన్ని ఎండిన వేపాకులు తీసుకుని పొడిగా చేసుకోవాలి. ఇలా పొడిగా చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా ఒక పొడి వస్త్రంలో కట్టుకుని, బియ్యం మధ్యలో ఉంచడం వల్ల పురుగు పట్టకుండా ఆపవచ్చు.
*వెల్లుల్లి:
బియ్యంలో పురుగులు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా పురుగులు పట్టకుండా ఉండాలంటే వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీయకుండా లేదా ఒక క్లాత్‌లో ఉంచి బియ్యం డబ్బాలో వేయడం వలన ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
*లవంగాలు:
బియ్యం పురుగు పట్టకుండా ఆపడంలో లవంగాలు మరింత ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. కొన్ని లవంగాలను తీసుకుని, పొడిగా చేసుకుని ఆ పొడిని పలుచటి పొడి వస్త్రంలో కట్టి బియ్యం మధ్యలో ఉంచాలి. లేదా ఎటువంటి పొడి చేయకుండా లవంగాలను క్లాత్‌లో ఉంచుకొని, బియ్యం మధ్యలో ఉంచినా సరే పురుగు పట్టకుండా ఆపవచ్చు.
*ఉప్పు:
ఇది దాదాపు అందరికీ తెలిసిన విషయమే. రాళ్ళ ఉప్పును బియ్యం డబ్బాలో లేదా బియ్యం సంచిలో ఉంచినట్లయితే పురుగు పట్టకుండా ఆపవచ్చు. అలాగే ఎండిన కాకరకాయ ముక్కలను పొడి వస్త్రంలో చిన్న చిన్న మూటలుగా చేసుకుని, బియ్యంలో ఉంచడం వలన పురుగు పట్టదు.