హైకోర్టులో రాజధాని కేసులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ కేసులు వాదించేందుకు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని నియమించుకుంది. ఆయనకు ఫీజు కింద రూ.5 కోట్లు కేటాయిస్తూ ప్రణాళికా విభాగం ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాకుండా అడ్వాన్స్‌గా ఆయనకు రూ.కోటి చెల్లించేందుకు అనుమతిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు, మూడు రాజధానుల నిర్ణయం, సీఆర్‌డీఏ చట్టం ఉపసంహరణ తదితర అంశాలపై ఉన్నత న్యాయస్థానంలో నమోదైన కేసుల విచారణకు ప్రభుత్వం తరఫున వాదనలు విన్పించేందుకు రోహత్గీని నియమించారు. ఇకపై ఆయా కేసులన్నింటినీ రోహత్గీయే వాదించనున్నారు.
రాజధాని కేసుల వాదనకు ₹5కోట్లు చెల్లిస్తున్న జగన్ సర్కారు
Related tags :