Movies

రకుల్ “ఎటాక్”

Rakul Preet Singh Busy In Bollywood Attack

బాలీవుడ్‌ ‘ఎటాక్‌’లో జాయిన్‌ అయ్యారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. జాన్‌ అబ్రహాం హీరోగా లక్ష్యరాజ్‌ దర్శకత్వంలో హిందీలో ‘ఎటాక్‌’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. 2008లో ఢిల్లీలో జరిగిన ఓ ఉగ్రవాద దాడి ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలిసింది. ఇందులో ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు జాన్‌ అబ్రహాం. గత ఏడాది డిసెంబరులో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ప్రస్తుతం జాన్‌ , రకుల్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘ఎటాక్‌’ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. మరోవైపు అజయ్‌ దేవగన్‌–సిద్దార్థ్‌ మల్హోత్రా, అర్జున్‌ కపూర్‌ హీరోలుగా నటిస్తున్న చిత్రాల్లో రకుల్‌ కథానాయికగా చాన్స్‌ కొట్టేశారు. ఈ మూడు సినిమాలతో రకుల్‌ ఈ ఏడాది బాలీవుడ్‌లో బిజీ బిజీ.