ఎంతసేపూ ఇండస్ట్రీలో అమ్మాయిలను వేధిస్తున్నారని వార్తలు వస్తూ ఉంటాయి. కానీ ఇండస్ట్రీలో మగవాళ్లను కూడా వేధిస్తుంటారు. ఈ విషయంపై కూడా ఇంతకుముందు చాలా మంది మాట్లాడారు.
ఎంతసేపూ ఇండస్ట్రీలో అమ్మాయిలను వేధిస్తున్నారని వార్తలు వస్తూ ఉంటాయి. కానీ ఇండస్ట్రీలో మగవాళ్లను కూడా వేధిస్తుంటారు. ఈ విషయంపై కూడా ఇంతకుముందు చాలా మంది మాట్లాడారు. అబ్బాయిలకు కూడా ఇక్కడ సేఫ్టీ లేదని చెప్పిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఎప్పుడూ కాస్టింగ్ కౌచ్ అంటే అమ్మాయిల వైపు మాట్లాడటమే ఎక్కువగా కనిపిస్తుంది. దాంతో అబ్బాయిల వేధింపులు ఎప్పుడూ బయటికి రాలేదు. కానీ ఇప్పుడు వచ్చాయి.. లేదు లేదు సన్నీ లియోన్ తీసుకొచ్చింది. అమ్మాయిలపైనే కాదు ఇండస్ట్రీలో అబ్బాయిలపై కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆమె సంచలన విషయాలు బయటపెట్టింది. కాకపోతే అమ్మాయిల విషయంలో పడి అబ్బాయిలను లైట్ తీసుకుంటున్నారని చెబుతుంది.
వాళ్లు కూడా లైంగికంగా వేధింపులను ఎదుర్కొంటున్నారని సన్నీ చెప్పడంతో అంతా షాక్ అవుతున్నారు. అవకాశాల కోసం అబ్బాయిలు సైలెంట్‌గా ఉండటంతో ఈ తరహా విషయాలు బయటికి రావడం లేదని సంచలన నిజాలు బయటపెట్టింది సన్నీ లియోన్. లైంగిక వేధింపులకు ఆడ, మగా తేడా ఉండకూడదని ఎవరైనా కూడా బయటికి వచ్చి చెప్పాలని చెబుతుంది సన్నీ లియోన్. సన్నీ లియోన్ బయటికి వచ్చి ఇలా మగవాళ్ల లైంగిక వేధింపుల గురించి మాట్లాడటం.. వాళ్ల తరఫున వకాల్తా పుచ్చుకోవడంతో కొంత షాక్ అవుతున్నారు అభిమానులు. దీని వెనక కారణమేమై ఉంటుందా అని జుట్టు పీక్కుంటున్నారు.