Health

గర్భిణుల్లో మూత్రకోశ వ్యాధులు

గర్భిణుల్లో మూత్రకోశ వ్యాధులు

గర్భిణీల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే ముందుగానే ప్రసవం..

స్త్రీలకే ఎందుకు వస్తుందంటే..శరీర నిర్మాణ పరంగా స్త్రీల మూత్రద్వారం, మలద్వారం మధ్య దూరం తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా బ్యాక్టీరియా త్వరగా మూత్ర వ్యవస్థలోకి ప్రవేశించి ఇన్ఫక్షన్‌కి గురవుతారు స్త్రీలు. మరీ ముఖంగా లైంగిక జీవితం గడుపుతున్న స్త్రీలకు అంతగా ఈ ప్రభావం ఉండదు..

​గర్భ సమయంలో యూరిన్ ఇన్ఫెక్షన్స్..

గర్భధారణ సమయంలోనూ హార్మోన్ల ప్రభావం వల్ల మూత్రవ్యవస్థలో మార్పులు జరుగుతాయి. ఈ కారణంగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మరీ ముఖ్యంగా నెలలు గడిచే కొద్ది మూత్రాశయంపై గర్భాశయ ఒత్తిడి పెరిగి మూత్రాన్ని కూడా విసర్జించలేరు. దీంతో మూత్రాశయంలో మిగిలిపోయిన బ్యాక్టీరియా మరి ఎక్కువగా వృద్ధి చెంది సమస్య మరింత ఎక్కువ అవుతుంది. అదే విధంగా ఈ సమయంలో ఇమ్యూన్ వ్యవస్థ బలహీనమవ్వడం కూడా ఓ కారణమే. త్వరగా ఈ సమస్యకు చికిత్స చేయకపోతే బ్యాక్టీరియా మూత్రపిండాల్ని చేరుతుంది. అది ఫ్యూచర్‌లో మరింత ఇబ్బందికరంగా మారుతుంది.

లక్షణాలు ఇవే..

యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కొన్ని లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.
ఎక్కువగా మూత్రవిసర్జన చేయాలనిపించడం..
మూత్ర విసర్జన సమయంలో మంట
ఎరుపు, ముదురు గులాబీ రంగులో ఇలా అనేక రంగుల్లో మూత్రం ఉంటుంది
మూత్రం ఘాటు వాసనతో ఉండడం
పొత్తి కడుపు మధ్యలో నొప్పి
అలసట, వణుకు ఉంటుంది
చలి, జవ్వరం
నడుము నొప్పి ఎక్కువగా ఉంటుంది.

​ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కనీస జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. రోజుకి కనీసం 8 గ్లాసుల నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల బ్యాక్టీరియా రూపంలో బయటి వెళ్తుంది.
అదేవిధంగా ఎక్కువ సమయం మూత్రాన్ని ఆపుకోవడం లాంటివి చేయకూడదు.
పూర్తిగా మూత్ర విసర్జన చేయాలి.
జననాంగాల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
లైంగికంగా కలిసిన ప్రతీసారి ప్రైవేట్ పార్ట్స్‌ని గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.
కొంతమంది ఎక్కువగా హైజీన్ స్ప్రే, వెజైనల్ డూష్‌లు వంటివి వాడతారు. దీని వల్ల కూడా ఎక్కువగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయని తేలింది.
జననాంగాలని శుభ్రంగా క్లీన్ చేసుకుని వాటిని పొడిగా ఉంచుకోవాలి.
అదే విధంగా వదులుగా ఉన్న దుస్తులు, లోదుస్తులను వాడకూడదు.
జీన్స్, స్కిన్ టైట్ డ్రెస్సులను అస్సలు వాడొద్దు.
గర్భిణీలు ముఖ్యంగా వదులుగా ఉన్న దుస్తులను మాత్రమే వాడాలి.

​పరీక్షలు..

యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కొన్ని పరీక్షలు చేయించాలి. ఇందులో ఎక్కువగా మూత్రంలో చీము కణాలు, రక్త కణాలు ఉన్నాయో పరీక్షించాలి. అదే విధంగా మూత్రంలో ఏ రకపు బ్యాక్టీరియా ఉంది. ఎలాంటి మందులు వాటిని నిర్మూలిస్తాయి అనేవి కల్చర్ అండ్ సెన్సిటివిటీ పరీక్ష చేసి తెలుసుకోవచ్చు.