Movies

నేను క్షేమంగానే ఉన్నాను

Actor Sunil Releases Confirmation Saying He Is Safe

సినీ నటుడు సునీల్ తీవ్ర అస్వస్థతలో ఆసుపత్రిలో చేరారనే వార్తతో సినీ వర్గాలు, అభిమానులు ఉలిక్కిపడ్డారు.

ఏమైందో అని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో, సునీల్ స్పందించారు.

తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఆయన తెలిపారు. సైనస్, ఇన్ఫెక్షన్ కారణంగానే ఆసుపత్రిలో చేరానని చెప్పారు.

డాక్టర్ల సూచన మేరకు ఆసుపత్రిలో చేరానని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరారు.

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో సునీల్ చికిత్స పొందుతున్నారు.

వైద్య పరీక్షలను నిర్వహించిన వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.