* సిఆర్డిఏ రద్దు, రాజధాని తరలింపు పై అంశాలపై హైకోర్టులో విచారణ.రైతుల పిటిషన్ ఏ స్థాయి లో ఉన్నాయని ప్రభుత్వ లాయ ర్లను ప్రశ్నించిన హైకోర్టు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపినట్లు తెలిపిన ప్రభుత్వ న్యాయవాదులు.బిల్లు చట్టంగా మారకుండా కనీసం నెల రోజుల సమయం ఉన్నందున వచ్చే నెల 24 వాయిదా వేసిన హైకోర్టు.
* ప్రపంచ ప్రజాస్వామ్య సూచీలో భారత్ 51వ స్థానంలో నిలిచింది. ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం.. 2018తో పోలిస్తే 2019లో భారత్ పది స్థానాలు దిగజారింది. దేశంలో పౌర హక్కులు హరించుకుపోతుండటమే ఇందుకు కారణమని ఈఐయూ వివరించింది.
*మీడియాపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంభిస్తోందని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏబీఎన్టీవీ చానళ్లపై వైసీపీ ప్రభుత్వం కక్ష గట్టిందని ఆరోపించారు. మహిళా పోలీసులతో అక్రమ కేసు పెట్టించారనితక్షణమే అక్రమ కేసును ఎత్తివేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
* ఫేస్‌బుక్‌లో తానే నంబర్ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నంబర్ అని పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌లోని దావో్‌సలో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన మాట్లాడారు.
* ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతుల పక్షాన ఉద్యమించేందుకు బీజేపీ-జనసేన కూటమి ఉమ్మడి కార్యాచరణను ఖరారుచేసింది. ఇందులో భాగంగా వచ్చే నెల రెండో తేదీన తాడేపల్లి నుంచి విజయవాడ వరకు భారీ కవాతు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణజనసేనాని పవన్ సారథ్యంలో ఉభయపార్టీల సమన్వయ కమిటీ సమావేశం బుధవారమిక్కడ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నివాసంలో జరిగింది.
* అమరావతి రాజధాని ఇక్కడే ఉండేలా చూడాలని మహిళలు పూజలు నిర్వహించారు. గురువారం మందడం శివాలయంలో లక్ష్మి గణపతి హోమం నిర్వహించారు. సీఎం జగన్ తమ బాధలను అర్ధం చేసుకోవాలని కోరారు. మేము చేసిన త్యాగాలను మంత్రులు అవమానిస్తున్నారు.. నోటికి వచ్చినట్లు మంత్రులు మాట్లాడుతున్నా…మీరు మాట్లాడరాఅంటూ ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి ఎంతో శక్తి ఉందన్నారు. అమరావతి ఇక్కడే ఉండేలా ఆ శివుడు కరుణించాలని మహిళలు ప్రార్థించారు.
* ఏపీ సీఆర్టీఏ కేంద్ర నియమ నిబంధనలతో ఏర్పడిన చట్టం అని…ఆ చట్టాన్ని రద్దు చేయాలనుకోవడం సరికాదని తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు లొడగల కృష్ణ అన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టును తొలగించడం కుట్రపూరితమని మండిపడ్డారు. చెల్లని బిల్లును తీసుకువచ్చి ప్రాంతాల మధ్య వైషమ్యాలు తెస్తున్నారని కృష్ణ ఆరోపించారు.
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి బుధవారం రాత్రి తీసుకున్న అత్యంత కీలక నిర్ణయంతో రాష్ట్ర రాజధాని వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీ ముందుకు వచ్చింది. అంటే, ఈ బిల్లుపై నిర్ణయం వెల్లడించేందుకు మూడు నెలల సమయం లేదా అంతకుమించి పట్టొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ముందున్న మార్గాలేంటి అనే అంశంపై న్యాయనిపుణులు తమతమ అభిప్రాయాలను వెల్లడించారు.
*నేడు శాసన సభ కార్యక్రమాలను బహిష్కరించిన టిడిపిఅసెంబ్లీకి హాజరు కాకూడదని నిర్ణయంనిన్న మండలిలో జరిగిన పరిణామాలపై టిడిపి తీవ్ర అసంతృప్తినిరసనగా సభా కార్యక్రమాలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం
*ఇంటర్మీడియట్ వృత్తివిద్య కోర్సుల విద్యార్థులకు నాలుగేళ్ల క్రితం ఆగిపోయిన అప్రెంటిస్షిప్ విధానం మళ్లీ అమల్లోకి వచ్చింది. దీనివల్ల వృత్తివిద్య కోర్సు పూర్తయిన విద్యార్థులకు ఆసుపత్రులు ఏడాదిపాటు అప్రెంటిస్షిప్ సౌకర్యం కల్పిస్తాయి. నెలకు రూ.7వేల చొప్పున విద్యార్థులకు చెల్లిస్తాయి.
*మంచు ఖండమైన అంటార్కిటికాలోని 4,897 మీటర్ల ఎత్తెన పర్వతం విన్సన్ మాసిఫ్ను హైదరాబాద్ పోలీస్ సంయుక్త కమిషనర్ తరుణ్జోషి అధిరోహించారు. పర్వతారోహణలో భాగంగా కొద్దిరోజుల క్రితం ఆయన అంటార్కిటికాకు వెళ్లారు. భారత కాలమానం ప్రకారం ఈ నెల 16న ఉదయం 8.30 గంటలకు విన్సన్ మాసిఫ్ శిఖరాగ్రాన్ని ఆయన చేరుకున్నారు
*ఏప్రిల్లో దిల్లీలో జరగనున్న ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ లార్జ్ డ్యామ్స్ (ఐసీవోఎల్డీ) వార్షిక అంతర్జాతీయ సదస్సులో సాంకేతిక పత్రాల సమర్పణకు తెలంగాణ సాగునీటి శాఖ ఇంజనీర్లు సమర్పించిన రెండు పత్రాలు ఎంపికయ్యాయి. వీటిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ గ్రోత్ ఇంజిన్ ఫర్ కాంప్రెహెన్సివ్ గోదావరి బేసిన్ డెవలప్మెంట్తో పాటు మోడర్నైజేషన్, ఆప్టిమైజేషన్ అండ్ రిహాబిలిటేషన్ ఆఫ్ ఏజింగ్ డ్యామ్స్ ఉన్నాయి.
*ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న వాతావరణ మార్పుల కారణంగానే భారత్ సహా అనేక దేశాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయని బాబా అణు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త ఉదయ్కుమార్ సిన్హాతెలిపారు. రాబోయే కాలంలో ఈసంక్షోభం తీవ్రంగా ఉండనుందని, అందుకే ఉపరితల, భూగర్భ జలాలను సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘నీటి వనరుల అభివృద్ధి- నిర్వహణలో ఐసోటోపుల వినియోగం’పై బుధవారం జలసౌధలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. పారిశ్రామికీకరణ కారణంగా భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయన్నారు.
*కేంద్ర జలసంఘం హైదరాబాద్ చీఫ్ ఇంజినీర్గా ఎం.కె.శ్రీనివాస్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న రంగారెడ్డిని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) డైరెక్టర్ జనరల్గా శ్రీనివాస్ ఇటీవల వరకు దిల్లీలో విధులు నిర్వహించారు.
*సీబీఎస్ఈ ఆధ్వర్యంలో జులై 5వ తేదీన 14వ కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్) జరగనుంది. దేశవ్యాప్తంగా 112 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ నెల 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 24 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ నెల 24 నుంచి www.ctet.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని సీబీఎస్ఈ తెలిపింది.
*ఆగ్నేయ భారతం నుంచి తేమ గాలులు వీస్తున్నందున రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో పగటిపూట పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. రాత్రిపూట కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటున్నందున చలి తీవ్రత తగ్గింది. బుధవారం తెల్లవారుజామున అత్యల్పంగా రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి గ్రామంలో 12.9 డిగ్రీలుంది. నిజామాబాద్లో సాధారణంకన్నా 4.9 డిగ్రీలు పెరిగి 20.9, హైదరాబాద్లో 19.3, రామగుండంలో 20 డిగ్రీలు నమోదైంది. బుధవారం పగలు హైదరాబాద్లో 29.8, రామగుండంలో 31.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత ఉంది.
*టీఎస్ ఆర్టీసీని ఆర్థికంగా గాడిలో పెట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన కార్గో సేవల ప్రారంభానికి ముహుర్తం కుదిరింది. ఈ నెల 27న ఈ సేవలను ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆ మేరకు ఏర్పాట్లను ఆర్టీసీ అధికారులు చేపట్టారు. తొలిదశలో వ్యవసాయం, పౌర సరఫరాలు, ఆబ్కారీ, విద్యా శాఖల ద్వారా ఒప్పందం చేసుకుని వారికి సేవలను అందించాలని నిర్ణయించారు.
*పట్టణ వాసులతో సమానంగా గ్రామీణ ప్రజలకు ఎయిర్ ఫైబర్ సేవలు అందించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ సుభాష్బాబు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరికీ ఇక్కట్లు లేకుండా ఎక్కువ వేగంతో ఇంటర్నెట్ సౌకర్యం (ఎయిర్ ఫైబర్ సేవలు) అందించేందుకు బీఎస్ఎన్ఎల్తో యప్టీవీ ఒప్పందం చేసుకుందని చెప్పారు.
*ఖమ్మం జిల్లాలోని వైరా మునిసిపాలిటీ 15వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఓటర్లకు చీరెలు పంచుతుండగా ఇండిపెండెంట్ అభ్యర్థి నాగరాజు అడ్డుకున్నాడు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనపై నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
*మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్ఎస్-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడే ఉన్న డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి రెండు వర్గాలను అక్కడి నుంచి పంపించివేశారు. విధుల్లో ఉన్న సిబ్బందికి సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామి డీసీపీ హెచ్చరించారు.
*ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రైబ్యునల్ (ఏపీఏటీ) రద్దు వ్యవహారంలో తామెప్పుడు అంగీకారం తెలిపామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు నిలదీసింది. ఏపీఏటీ రద్దు విషయమై కేంద్రం ఈనెల 14న జారీ చేసిన ఉత్తర్వుల్లో తాము అంగీకరించినట్లు ఎందుకు ప్రస్తావించారని ఆగ్రహించింది.
*జగనన్న అమ్మఒడి పథకం అమలుకు మైనారిటీ సంక్షేమశాఖ నుంచి రూ.16.35 కోట్ల విడుదలకు పరిపాలన అనుమతులనిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు మైనారిటీ ఆర్థిక సహకార సంస్థ, క్రైస్తవ ఆర్థిక సహకార సంస్థల వీసీ, ఎండీలు చర్యలు తీసుకోవాలని సూచించింది.
*వాల్మీకి/ బోయ సామాజికవర్గ ఆర్థికాభివృద్ధి, సంక్షేమం కోసం అమలుచేసే పథకాల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. బీసీ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దీనికి ఛైర్మన్గా వ్యవహరిస్తారు. కమిటీలో మరో 13 మంది ఉన్నతాధికారుల్ని సభ్యులుగా నియమించారు.
*సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్కు ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు.
*పోలవరం ప్రాజెక్టు పరిధిలో గాలి, నీటి నాణ్యతను పరీక్షించి నివేదిక రూపొందించటానికి ప్రభుత్వం రూ.4.22 కోట్లు విడుదల చేసింది.
*ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ఆధార్ అనుసంధానం తప్పనిసరి అనే నిబంధనకు బుధవారం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ సిద్ధార్థ్ జైన్ తెలిపారు.
*దేశంలోనే తొలిసారిగా పెద్ద సంఖ్యలో ట్రాన్స్జెండర్లు పాత్రికేయ వృత్తిని చేపట్టనున్నారు. హైదరాబాద్కు చెందిన సయోధ్య సంస్థ… 20 మంది ట్రాన్స్జెండర్లకు రెండు నెలల పాటు తిరుపతిలోని మహిళా ప్రాంగణంలో శిక్షణ అందించింది. ఈ కార్యక్రమం మంగళవారం శిక్షణ ముగిసింది.ట్రాన్స్జెండర్లకు మరో నెల పాటు క్షేత్రస్థాయి శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత వారు పాత్రికేయ వృత్తిని చేపట్టనున్నారు.
* వచ్చే ఖరీఫ్ నుంచి ప్రతి గ్రామ పంచాయతీలోని రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. అసెంబ్లీలో మంగళవారం రైతు భరోసా కేంద్రాలపై స్వల్పకాలిక చర్చను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 11,158 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటినే పంట కొనుగోలు కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని వివరించారు. పశువులకూ హెల్త్కార్డులు ఇస్తామని, ఈ-క్రాప్ బుకింగ్ను తప్పనిసరి చేశామని తెలిపారు. భరోసా కేంద్రాల్లోనే రైతులకు పురుగుమందులూ లభిస్తాయని వివరించారు.
*కాకతీయుల అద్భుత ఆలయం రామప్పపై త్వరలో ‘యునెస్కో’కు మరింత సమాచారం పంపేందుకు రంగం సిద్ధమవుతోంది. భవిష్యత్తులో ఆలయాన్ని సంరక్షించే విధానం, దాని నిర్వహణ ఎలాఉంటుందన్న అంశాలను జోడించి ‘ఇంటిగ్రేటెడ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ ప్లాన్’ అనే పుస్తకాన్ని త్వరలో యునెస్కోకు పంపనున్నారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో సాంస్కృతిక శాఖ కార్యదర్శి, పురావస్తు శాఖ సంచాలకుడు బుర్రా వెంకటేశంతో కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యుడు ఆచార్య పాండురంగారావు సమావేశమై చర్చించారు.
*వ్యవసాయ విస్తరణ, పరిశోధన, ఉత్తమ బోధన, యువత వాణిజ్యవేత్తలుగా మారేలా నైపుణ్యాలను పెంపొందించడం, పరీక్షల నిర్వహణలో డిజిటల్ విధానం అమలు సహా పలు రంగాల్లో చేసిన కృషికిగానూ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీకి జాతీయ ఉత్తమ పురస్కారం లభించింది.
*డ్రైవర్లను ప్రోత్సహించేందుకు ఈ నెల 24న డ్రైవర్ల దినోత్సవం నిర్వహించాలని ఆర్టీసీ ఇన్ఛార్జి మేనేజింగ్ డైరెక్టర్ సునీల్శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. వారి సేవలకు గుర్తింపుగా అన్ని డిపోల్లో కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ప్రమాదరహితంగా బస్సులు నడిపిన ఆర్టీసీ డ్రైవర్లను సత్కరించాలని పేర్కొన్నారు.
*భారత నౌకాదళ పోరాట సామర్థ్యానికి మరింత పదునుపెట్టే దిశగా రక్షణ శాఖ కీలక ముందడుగు వేసింది. రూ.50వేల కోట్లతో దేశీయంగా ఆరు జలాంతర్గాములను నిర్మించేందుకు భారత్కు చెందిన 2 నౌకా నిర్మాణ సంస్థలను, 5 విదేశీ ఆయుధ తయారీ దిగ్గజాలను ఎంపిక చేసింది.
*అత్యంత ప్రముఖులు నివసించే బాగ్దాద్లోని గ్రీన్జోన్పై సోమవారం అర్ధరాత్రి రాకెట్ల దాడి జరిగింది. అమెరికా రాయబార కార్యాలయానికి సమీపంలో 3 రాకెట్లు పడ్డాయని, అయితే వీటి ధాటికి ప్రాణనష్టం సంభవించినట్టు ఎలాంటి సమాచారం లేదని ఇరాక్ సైన్యం వెల్లడించింది.
*విశాఖపట్నం-న్యూఢిల్లీ మధ్య రాకపోకలు సాగించే ఏపీ ఏసీ ఎక్స్ప్రెస్ ప్రయాణ వేళలు మార్చారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఏపీ ఏసీ ఎక్స్ప్రెస్ (నంబర్ 20805) రాత్రి పది గంటలకు విశాఖలో బయలుదేరి మూడవ రోజు ఉదయం 6.35 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది.
రాజధాని తరలింపు కేసు 24కి వాయిదా-తాజావార్తలు
Related tags :