DailyDose

భారత మార్కెట్లోకి ఎంజీ విద్యుత్‌ కారు-వాణిజ్యం

Chinese MG Releases Electric Car Into India-Telugu Business News Roundup

*హెక్టర్‌ మోడల్‌తో భారత్‌లో ప్రవేశించి వినియోగదారులను ఆకట్టుకుంటున్న ఎంజీ మోటార్స్‌ జెడ్‌ఎస్‌ ఈవీ పేరుతో ఎలక్ట్రిక్‌ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కంపెనీ నుంచి భారత్‌ మార్కెట్లోకి వచ్చిన తొలి విద్యుత్తు ఎస్‌యూవీ ఇదే. రెండు వేరియంట్లలో ఈ కారును వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్సైట్‌ వేరియంట్‌ కారు ధర రూ.20.88లక్షలు కాగా.. ఎక్స్‌క్లూజివ్‌ వేరియంట్‌ ధర రూ.23.58లక్షలుగా నిర్ణయించారు.
* హైదరాబాద్లో స్థిరాస్తి రంగం ఊపును తాజా సూచీ ఒకటి కళ్లకు కట్టింది. గృహ రేట్ల పెరుగుదలకు సంబంధించిన అంతర్జాతీయ స్థాయి సూచీలో నగరానికి 14వ స్థానం దక్కినట్లు వెల్లడించింది. ఈ జాబితాలోని టాప్-20లో భారత్ నుంచి హైదరాబాద్కు మాత్రమే స్థానం దక్కినట్లు తెలిపింది. 2019 జులై-సెప్టెంబరు మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 150 నగరాల్లో ఇళ్ల ధరల పెరుగుదలను పరిశీలించిన ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ ‘నైట్ ఫ్రాంక్’ తాజా సూచీని రూపొందించింది. ఇందులో హంగేరీ రాజధాని బుడాపెస్ట్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. హైదరాబాద్లో గృహ రేట్ల పెరుగుదల 9 శాతంగా నమోదైంది.
* డేళ్లలో ప్రపంచ డిజిటల్‌ మార్కెట్‌ 2 లక్షల కోట్ల డాలర్లకు చేరగలదని సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో ‘డిజిటల్‌ యాక్సిలరేషన్‌ సమ్మిట్‌-2020’ పేరుతో జరిగిన సదస్సులో భవిష్యత్తులో డిజిటల్‌ టెక్నాలజీలు తీసుకురానున్న మార్పులను చర్చించారు. ఈ సదస్సులో 10 దేశాలకు చెందిన 150 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
* స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కొత్త ఎండీగా చిత్తూరు జిల్లాకు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగేలా కేంద్రం ఆయన నియామకాన్ని ఖరారు చేయటంతో… మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించినట్లు బ్యాంకు ఒక ప్రకటనలో తెలియజేసింది. గతంలో ఈయన ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు. 1988లో అహ్మదాబాద్‌ ఎస్‌బీఐలో ప్రొబెషనరీ అధికారిగా ఉద్యోగంలో చేరిన శ్రీనివాసులుకు వ్యవసాయమంటే ఎంతో ఇష్టం. దానికి తగ్గట్టే ఆయన హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో (ప్రస్తుతం ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్సిటీ) వ్యవసాయ విద్యను అభ్యసించారు. ఆ తరవాత అనుకోకుండా బ్యాంకింగ్‌ రంగంలో అడుగు పెట్టి అక్కడే స్థిరపడ్డారు. ఎస్‌బీఐలో వివిధ హోదాల్లో పనిచేసిన శ్రీనివాసులు… వృత్తి రీత్యా గతంలో కొన్నాళ్లపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు.
*ఇంధన, పర్యావరణ అనుకూల డిజైన్ (లీడ్) విభాగంలో దేశంలోని మొదటి 10 రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి స్థానం లభించింది. భవనాలు, స్థలాలను పర్యావరణానికి అనుకూలంగా తీర్చిదిద్దిన పక్షంలో వాటికి లీడ్ సర్టిఫికేషన్ లభిస్తుంది. జీబీసీఐ ఇండియా (గ్రీన్ బిజినెస్ సర్టిఫికేషన్ ఇంక్) దీన్ని మంగళవారం నాడు విడుదల చేసింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం 6వ స్థానంలో నిలిచింది. మొదటి అయిదు స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లు ఉన్నాయి. లీడ్ సర్టిఫికేషన్ కల భవనాలు మనదేశంలో 1,400 పైగా ఉండగా, ఇందులో తెలంగాణ రాష్ట్రంలో 106 ప్రాజెక్టులు ఉన్నాయి. పర్యావరణానికి అనుకూలమైన విధంగా భవనాలు నిర్మించే విషయంలో భారత్ ముందంజ వేస్తున్నట్లు జీబీసీఐ సీఈఓ మహేష్ రామానుజమ్ పేర్కొన్నారు
*ఏటీఎంల ద్వారా కార్డు రహిత నగదు ఉపసంహరణ సౌలభ్యాన్ని ఐసీఐసీఐ బ్యాంక్ మంగళవారం ప్రారంభించింది. రోజుకు రూ.20,000 వరకు ఈ పద్ధతిలో నగదు ఉపసంహరించుకోవచ్చు. ఇందుకుగాను ముందుగా ఐమొబైల్ యాప్లో డబ్బుల కోసం రిక్వెస్ట్ పంపించాలి. ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన 15000కి పైగా ఏటీఎంల నుంచి డెబిట్ కార్డు అవసరం లేకుండానే నగదును ఉపసంహరించుకోవచ్చు. డెబిట్ కార్డుతో పనిలేకుండా ఏటీఎం నుంచి నగదు తీసుకునేందుకు ఇది అత్యంత సులువైన, సౌకర్యవంతమైన మార్గమని ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.
*ఏటీఎంల ద్వారా కార్డు రహిత నగదు ఉపసంహరణ సౌలభ్యాన్ని ఐసీఐసీఐ బ్యాంక్ మంగళవారం ప్రారంభించింది. రోజుకు రూ.20,000 వరకు ఈ పద్ధతిలో నగదు ఉపసంహరించుకోవచ్చు. ఇందుకుగాను ముందుగా ఐమొబైల్ యాప్లో డబ్బుల కోసం రిక్వెస్ట్ పంపించాలి. ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన 15000కి పైగా ఏటీఎంల నుంచి డెబిట్ కార్డు అవసరం లేకుండానే నగదును ఉపసంహరించుకోవచ్చు. డెబిట్ కార్డుతో పనిలేకుండా ఏటీఎం నుంచి నగదు తీసుకునేందుకు ఇది అత్యంత సులువైన, సౌకర్యవంతమైన మార్గమని ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.
*భారతీ ఎయిర్టెల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) పరిమితిని 49 శాతం నుంచి 100 శాతానికి పెంచుకునేందుకు టెలికాం విభాగం (డాట్) అనుమతి ఇచ్చింది. కంపెనీలో 74 శాతం వరకు విదేశీ పెట్టుబడిదార్లు వాటా అట్టిపెట్టుకోవడానికి ఆర్బీఐ ఇప్పటికే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఎయిర్టెల్ పెయిడప్ మూలధనంలో 100 శాతం వరకు ఎఫ్డీఐకు డాట్ ఆమోదం లభించిందని కంపెనీ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. త్వరలో ప్రభుత్వానికి దాదాపు రూ.35,586 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో.. ఎయిర్టెల్కు ఈ అనుమతి రావడం గమనార్హం.
*పంజాబ్ నేషనల్ బ్యాంక్ను మోసం చేసి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త నీరవ్ మోదీ ఆస్తులను వేలం వేయనున్నారు. ముంబయికు చెందిన వేలం సంస్థ శాఫ్రోనార్ట్ తదుపరి రెండు వేలాల్లో నీరవ్ మోదీ నుంచి జప్తు చేసిన కళాఖండాలు, ఖరీదైన వాచీలు, హ్యాండ్బ్యాగ్లు, కార్లను విక్రయించనున్నారు. ఈడీ, భారత ప్రభుత్వం తరఫున శాఫ్రోనార్ట్ ఈ వేలం నిర్వహించనుంది. ముంబయిలో ఫిబ్రవరి 27న మొదటి వేలం ప్రత్యక్షంగా జరగనుంది. రెండో వేలం ఆన్లైన్లో మార్చి 3-4 తేదీల్లో నిర్వహించనున్నారు. భారత కళాకారులు తయారు చేసిన 15 కళాఖండాలు వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటి వరకు ఎప్పుడు వేలానికి రాని అమృతా షేర్ గిల్ 1935 కళాఖండం విలువ రూ.12-18 కోట్లు ఉండొచ్చు.ఎంఎఫ్ హుస్సేన్ మహాభారత కాన్వాస్ విలువ రూ.12-18 కోట్లని అంచనా. రూ.7-9 కోట్ల విలువైన వీఎస్ గైటోండే పెయింటింగ్, రూ.3-5 కోట్ల విలువైన మంజిత్ బావా రూపొందించిన కృష్ణుడి ఆకృతి వేలంలో ఉన్నాయి. పలు ఖరీదైన వాచీలు, 80కి పైగా బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్లు సైతం వేలం వేయనున్నారు.
*ట్రేడైన కాంట్రాక్టుల సంఖ్య పరంగా 2019లో ప్రపంచంలో అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్ఛేంజీగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) అవతరించింది. డెరివేటివ్ సంఘం ఫ్యూచర్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ (ఎఫ్ఐఏ) ఈ గణాంకాలను వెలువరించింది. ఇక ప్రపంచ ఎక్స్ఛేంజీల సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఈ) గణాంకాల ప్రకారం.. క్యాష్ ఈక్విటీ విభాగంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచామని ఎన్ఎస్ఈ వెల్లడించింది
*హ్యుందాయ్ మోటార్ ఇండియా సరికొత్త కాంపాక్ట్ సెడాన్ ‘ఆరా’ను విపణిలోకి విడుదల చేసింది. ధరల శ్రేణి రూ.5.79 లక్షలు- 9.22 లక్షలు (దిల్లీ, ఎక్స్షోరూం). మారుతీ డిజైర్, హోండా అమేజ్లకు, ఫోర్డ్ యాస్పైర్ మోడళ్లకు ఆరా పోటీనివ్వనుంది. బీఎస్-6 ఉద్గార ప్రమాణాలతో కూడిన 1.2 డీజిలు, 1.2 లీటరు పెట్రోలు పవర్ట్రెయిన్స్, 1 లీటరు టర్బో పెట్రోలు వేరియంట్లలో ఇది లభ్యం కానుంది.

Attachments area