హిమాలయ పర్వత శ్రేణుల ఆరంభంలో ఉన్న ఋషికేశ్‌లో రెండు నెలల పాటు యోగా వేదాంతాల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఋషిఖేశ్‌లో ఉన్న శివానంద ఆశ్రమంలో గత యాభై సంవత్సరాల నుండి యోగా వేదాంతాలలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 94 బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చారు. 95వ బ్యాచ్ కి వచ్చే ఏప్రిల్, మే నెలల్లో శిక్షణ ఇస్తున్నట్లు శివానంద ఆశ్రమం అధ్యక్షులు స్వామీ యోగ స్వరూపానంద, ప్రధాన కార్యదర్శి స్వామీ పద్మనాభానంద తెలిపారు. ఆశ్రమానికి అనుబంధంగా ఉన్న యోగావేదాంత ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శిక్షణతో పాటు భోజన వసతి సదుపాయాలు కూడా ఉచితంగానే సమకూరుస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగినవారు తమ దరఖాస్తులను వచ్చే మార్చి 15వ తేదీలోపుగా పంపించవలసి ఉంటుంది. పూర్తి వివరాలకు ఈ దిగువ ప్రకటనను పరిశీలించగలరు.
హిమాలయాల్లో యోగాలో ఉచిత శిక్షణ-TNI ప్రత్యేకం
Related tags :