హెచ్-1బీ వీసాదారుల పిల్లలకు విద్య ఆర్థికంగా భారం కాకుండా చూసేలా అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం సరికొత్త చట్టాన్ని తీసుకురానుంది. స్థానికుల పిల్లల తరహాలోనే నామమాత్రపు రుసుములు చెల్లించేలా అది వీలు కల్పించనుంది. అమెరికన్ పబ్లిక్ పాఠశాలల్లో 12వ తరగతి వరకు విద్యను ఉచితంగా బోధిస్తారు. ఆపై కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువు కొనసాగించాలంటే అమెరికా పౌరుల పిల్లలు నామమాత్రపు రుసుములు చెల్లిస్తే సరిపోతుంది. వలసదారుల పిల్లలు, ఇతరులు మాత్రం భారీగా ఫీజులు సమర్పించుకోవాలి. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రంలో హెచ్-1బీ వీసాదారుల పిల్లలకు కూడా స్థానికుల తరహాలోనే నామమాత్రపు రుసుములు వర్తించేలా రూపొందించిన ‘ఎస్2555’ బిల్లుపై న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ ముర్ఫీ మంగళవారం సంతకం చేశారు.
న్యూజెర్సీలో H1B వీసాదారుల పిల్లలకు తక్కువ ఫీజులు
Related tags :