Movies

నన్ను చిన్నప్పుడు రేప్ చేశారు

Rahul Ramakrishna Speaks Of His Childhood Horrors

బాల్యం నుంచి తనలో దాచుకున్న ఓ బాధాకరమైన సంఘటన గురించి బయటపెట్టాడు అర్జున్ రెడ్డి మూవీ స్టార్ రాహుల్ రామకృష్ణ. తాను చిన్నతనంలో ఉండగా రేప్‌కు గురయ్యానని ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. లోలోపల ఇన్నాళ్లుగా తను అణచిపెట్టుకున్న ఆవేదన బయటపెట్టడంతో ఒక్కసారిగా ఫ్యాన్ నుంచి సపోర్ట్ వెల్లువలా వచ్చింది. కొందరు కో యాక్టర్స్ కూడా రాహుల్‌కు సానుభూతి తెలిపారు. తనకు అండగా నిలిచిన వారందరికీ థ్యాంక్ అంటూ రాహుల్ ఇవాళ మధ్యాహ్నం ట్వీట్ చేశారు.అర్జున్ రెడ్డి సినిమాతో బాగా ఫేమ్ అయ్యి వరుస సినిమాలతో మంచి యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ తన చిన్నతనంలో జరిగిన బాధాకరమైన ఘటనను బయటపెట్టాడు. ‘‘నేను బాల్యంలో అత్యాచారానికి గురయ్యాను. నా బాధ గురించి ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు. ప్రతిదీ బాధిస్తూనే ఉంటుంది. కానీ నా గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. నేను అనుభవించిన క్షోభ బయటపెట్టడం తప్ప ఏం చేయాలో తెలియలేదు’’ అని ఆదివారం అర్ధరాత్రి ట్వీట్ చేశాడు రాహుల్. ఆ తర్వాత మళ్లీ సోమవారం ఉదయం తాను ట్వీట్ చేయడానికి కారణం చెబుతూ మరో పోస్ట్ చేశాడు.