Rule 71…సీఎం జగన్ రాజధానిని మారుస్తూ రూపొందించిన వికేంద్రీకరణ బిల్లుకు మండలిలో చుక్కెదురయింది. నిజంగా ఇది జగన్ సర్కారుకు శరాఘాతమే. దీనికి కారణం ఎవరో తెలుసా?.. టిడిపి అనుకుంటే కచ్చితంగా కాదు అవును.. సర్కారు బిల్లు కంటే ఓ రూల్‌ను తెరపైకి తెస్తే ఆ బిల్లుపై చర్చ ఉండదన్న సలహా తెదేపాకు ఆక్సిజన్ ఇచ్చింది. ఆ సలహా ఇచ్చిన న్యాయవాది జంధ్యాల రవిశంకర్! శాసనసభ చట్టాలపై పట్టున్న ఈయనది గుంటూరు జిల్లా. అంతేనా? ఇప్పుడు ఏ జగనయితే వికేంద్రీకరణ చట్టం తీసుకువచ్చే ప్రయత్నం చేశారో.. ఆ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి, ఈ లాయర్ జంధ్యాల అత్యంత సన్నిహితుడు. ఆయన హయాంలోనే ఉమ్మడి శాసనసభకు ఈ లాయర్ న్యాయసలహాదారు. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో దొంగఓట్లు నమోదయ్యాయని, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ వ్యవహారాన్ని కోర్టుకు వెళ్లారు. అదీ సంగతి! సలు జరిగిందేమిటో చూద్దాం. సోమవారం అసెంబ్లీలో పాసయిన వికేంద్రీకరణ బిల్లును, మంగళవారం శాసనమండలిలో ప్రవేశపెట్టాలని సర్కారు సంకల్పించింది. మండలిలో వైసీపీకి బలం లేదు కాబట్టి, టిడిపికి బలం ఉన్నందున, ఆ పార్టీ ఒకవేళ బిల్లును వ్యతిరేకించినా దానిని డీమ్డ్ టు పాస్డ్ కింద ఆమోదించుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అందుకే తొలుత బిల్లుపై చర్చ లాగిద్దామని తొందరపడింది. ఒకవేళ బిల్లు చర్చకు ముందు అనుమతి లభిస్తే, ఇక ఆ తర్వాతనే మిగిలిన అంశాలపై చర్చించే వీలుంటుంది. ఈ వ్యూహంతోనే మంగళవారం వైసీపీ సర్కారు మండలిలో అడుగుపెట్టింది. కానీ, అప్పటికే తెలుగుదేశం పార్టీ రూల్ 71పై తీర్మానం చేయాలని మండలి చైర్మన్‌కు నోటీసు ఇచ్చింది. దానిని ఆయన నిబంధన ప్రకారం స్వీకరించారు. అంతకంటే ముందు దానికి మద్దతుగా ఉన్న సభ్యుల సంఖ్యనూ లెక్కవేసి, దానిపై తీర్మానానికి రూలింగ్ ఇవ్వడం పాలకపక్షానికి షాక్ కలిగించింది. ఇక అక్కడి నుంచి సభలో జరిగిన వాదోపవాదాలు, విమర్శలు, వాయిదాలపై వాయిదాలు తెలిసిందే. అయితే అసలు బిల్లే ప్రవేశపెట్టకపోతే అలాంటి అవకాశం ప్రభుత్వానికి ఉండద న్న వ్యూహంతో, టిడిపి రూల్ 71ను అకస్మాత్తుగా తెరపైకి తీసుకురావడ ం కలవర పరిచింది. ఈ విషయంలో మండలి చైర్మన్ షరీఫ్ ఒత్తిళ్లకు లొంగకుండా, నిబంధనల ప్రకారం సభ నిర్వహించడంతో వికేంద్రీకరణ బిల్లు మీమాంసలో పడింది. ఇది కూడా చదవండి.. ‘ కౌన్సిల్‌పై షరీఫ్ మార్కు ముద్ర ’వైసీపీ సర్కారు విస్తుపోయే ఈ ఆలోచన ఎవరిదంటే.. ప్రముఖ న్యాయవాది, అఖిల భారత హిందూ మహాసభ తె లుగు రాష్ట్రాల బాధ్యుడు జంధ్యాల రవిశంకర్. నిజం. ఆయన టివి 5లో వినిపించిన వాదన, ఆలోచనను అందిపుచ్చుకున్న టిడిపి.. మండలిలో వికేంద్రీకరణ బిల్లుకు చిల్లు పెట్టింది. మండలిలో వికేంద్రీకరణ బిల్లు రానున్న ఒకరోజు ముందు.. టివి5 ఆ అంశంపై చర్చ నిర్వహించింది. దానికి న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ను లైన్‌లోకి తీసుకుంది. మండలిలో బిల్లు ప్రవేశపెడితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నకు.. రూల్ 71తో బిల్లును అడ్డుకోవచ్చంటూ, ఆ మేరకు తాను ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ సలహాదారుగా ఉన్నప్పుడు చేర్చిన నిబంధనలు ఉటంకించారు. దానిని టిడిపి వ్యూహబృందం అందిపుచ్చుకుంది.నిజానికి సోమవారం రాత్రి వరకూ టిడిపిది అయోమయ పరిస్థితే. ఒకరకంగా చుక్కానిలేని నావ. మంగళవారం ఉదయం నాటికి న్యాయవాది జంధ్యాల ఇచ్చిన రూల్ 71 ఆలోచచనను సర్కారుపై అస్త్రంగా సంధించి సభలో పైచేయి సాధించింది. సురేష్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, నాదెండ్ల మనోహర్ స్పీకర్లుగా ఉన్న సమయంలో.. కాంగ్రెస్ సర్కారు రాజ్యాంగపరమైన సమస్యల్లో ఉన్నప్పుడు, ఇదే జంధ్యాల సలహాదారుగా ఇచ్చిన అనేక ఆలోచనలు సమస్యల నుంచి బయట పడేశాయి.
జంధ్యాల నిబంధన తెదేపాకు కలిసొచ్చింది
Related tags :