అమ్మయ్యాక తొలి గ్రాండ్‌స్లామ్ శ్లామ్ ఆడాలన్న సానియా కల నెరవేరలేదు. పిక్క గాయంతో బాధపడుతున్న ఆమె ఇంతకు ముందే మిక్స్డ్ డబుల్స్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసింది. అయితే తన భాగస్వామి నదియా కిచెనోక్ (ఉక్రెయిన్)తో కలిసి మహిళల డబుల్స్ ఆడింది. తొలిరౌండ్లో చైనా ద్వయం జిన్యున్ హన్, లిన్ ఝుతో తలపడింది. ఆటలో 2-6, 0-1తో వెనకబడ్డప్పుడు గాయం తీవ్రమవ్వడంతో మధ్యలోనే తప్పుకుంది. కుమారుడిని చూసుకొనేందుకు సానియా టెన్నిస్‌కు దూరమైంది. రెండేళ్ల తర్వాత పునరాగమనం చేసి హోబర్ట్ ఇంటర్నేషనల్ గెలిచి సంచలనం సృష్టించింది.
గాయంతో వెనుదిరిగిన సానియా
Related tags :