యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ తాజాగా తన పెళ్లిపై వచ్చిన రూమర్స్‌పై స్పందించారు. ప్రస్తుతానికి కెరీర్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని వెల్లడించారు. శ్రద్ధాకపూర్ కథానాయికగా నటించిన ‘స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ’ సినిమా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శ్రద్ధా త్వరలో సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్టాను వివాహం చేసుకుబోతున్నారంటూ వస్తున్న వార్తలపై శ్రద్ధాకపూర్ స్పందించారు. ‘ప్రస్తుతానికి కెరీర్‌పైనే నా ఆలోచనలన్నీ ఉన్నాయి. నేను నటిస్తున్న సినిమాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. అంతకుమించి దేనిగురించి.. ముఖ్యంగా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. నా పెళ్లిపై వస్తోన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. అది కేవలం ప్రచారం మాత్రమే’ అని ఆమె పేర్కొన్నారు. ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ రోహిత్ శ్రేష్టాతో శ్రద్ధా చాలా సన్నిహితంగా ఉంటుంటారు. శ్రద్ధా-రోహిత్ కలిసి తరచూ పార్టీలకు, డిన్నర్లకు వెళ్లడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఒకానొక సమయంలో వీరిద్దరు 2020లో పెళ్లి చేసుకోనున్నారంటూ బాలీవుడ్ గుసగుసలాడుకుంది. అప్పట్లో శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్ పెళ్లి వార్తలను ఖండించారు. శ్రద్ధాకు ప్రస్తుతం కెరీర్ పై దృష్టి ఉన్నట్లు చెప్పారు. అంతేకాకుండా ‘నేను అమ్మాయి తండ్రిని.. పెళ్లికి నన్ను ఆహ్వానించడం మర్చిపోకండి’ అంటూ చమత్కరించారు.
శ్రద్ధా పెళ్లి కబురు
Related tags :