* ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి జనవరి 27న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం 9.30 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. కాగా, రాజకీయ అజెండాతో నడుపుతున్న శాసనమండలిని కొనసాగించాలా.. వద్దా అనే దానిపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎం వైఎస్ జగన్ స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరిన సంగతి తెసిందే. సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదనకు అంగీకరించిన స్పీకర్ సోమవారం ఆ అంశాన్ని శాసనసభలో చర్చించేందుకు అనుమతించారు.
* ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రజనీకాంత్‌పై చర్యలకు చెన్నై పోలీసులను ఆదేశించాలంటూ ‘ద్రావిడర్ విడుదలై కళగం’ వేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. దీనిపై మేజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లకుండా హైకోర్టుకు రావాల్సిన అవసరమేంటని కోర్టు ప్రశ్నించింది. ఇటీవల చెన్నైలో జరిగిన తుగ్లక్ పత్రిక 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ..1971లో సేలంలో నిర్వహించిన ఓ ర్యాలీని గుర్తు చేశారు. అప్పట్లో పెరియార్ సీతా రాముల ప్రతిమలను నగ్నంగా తీసుకెళ్లారని రజనీ వ్యాఖ్యానించారు.ఇది అప్పట్లో బయటకు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తపడిందని పేర్కొన్నారు.
* తెలంగాణ భవన్‌లో రేపు ఉ.10 గంటలకు ఎమ్మెల్సీలు, ఎంపీలతో మంత్రి కేటీఆర్ భేటీకానున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్‌అఫీషియో ఓట్లపై చర్చించనున్నారు. అవసరం ఉన్న చోట ఎక్స్‌ఫీషియో ఓట్లను టీఆర్‌ఎస్ వాడుకోనుంది. టీఆర్‌ఎస్‌కు ఆరుగురు రాజ్యసభ సభ్యులు, 9 మంది ఎంపీలు, 32 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు.
*ఇందిరాగాంధీ స్టేడియాలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహిస్తున్నట్లు డీజీపీ గౌతమ్ సవంగ్ తెలిపారు. రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈసారి పరేడ్ లో తెలంగాణా పోలీసులు పాల్గొనబోతున్నారని చెప్పారు.
*స్మార్ట్ సిటీ మిషన్ లక్ష్యాలు చేరు కోవడంలో ఉత్తమ ఫలితాలు కనబర్చిన నగరాలుగా అమరావతి, విశాఖ అవార్డులు సాధించాయి. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో విశాఖ వేదికగా ఆకర్షణీయ నగరాల మూడో శిఖరాగ్ర సమావేశం కొనసాగుతోంది. ప్రజల కోసం నగరాల నిర్మాణం అనే అంశంపై రెండ్రోజుల సదస్సు ఇవాళ ప్రారంభమైంది. స్మార్ట్ సిటీల దిశగా వివిధ అంశాల్లో ఆదర్శంగా నిలిచిన నగరాలకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. రికగ్నేషన్ ఆఫ్ పెర్ఫామెన్స్ అంశంలో అమరావతికి, ముడసర్లలో ఫ్లోటింగ్ సోలార్ ఏర్పాటుపై విశాఖకు అవార్డులు దక్కాయి. అత్యుత్తమ ప్రదర్శనతో సూరత్ నగరం ‘సిటీ’ అవార్డును కైవసం చేసుకుంది
*రాజధాని ప్రాంత 29 పంచాయతీల్లో రేపు(శనివారం) గ్రామసభలు జరుగనున్నాయి. అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో కలిపేందుకు తీర్మానం కోసం గ్రామసభలను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈరోజు బోరుపాలెంలో నిర్వహించిన గ్రామసభ రేపటికి వాయిదా పడింది. తీర్మానంపై రేపు నిర్ణయం చెబుతామని బోరుపాలెం గ్రామస్థులు తెలిపారు.
* హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని మంత్రుల బృందం శత్రు ఆస్తుల అమ్మకాన్ని పర్యవేక్షిన్చానుంది. దేశవ్యాప్తంగా దాదాపు 9400 శత్రు ఆస్తులున్నాయి. వాటి అమ్మకం ద్వారా లక్ష కోట్లు వస్తాయని అంచనా. ఇందుకోసం మంత్రుల బృందంతో పాటు మరో రెండు ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేసారు.
*ఉరి శిక్ష తప్పించుకునేందుకు నిర్భయ దోషులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నలుగురు దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయాల్సిందిగా ఇప్పటికే దిల్లీ పటియాలా హౌస్ కోర్టు రెండోసారి డెత్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. మరణ శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఇప్పటికే వాళ్లు క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు వేసుకొని సమయాన్ని వృథా చేయడంతో తొలిసారిగా ఇచ్చిన డెత్‌వారెంట్ గడువు ముగిసిపోయింది. ఈ నేపథ్యంలోనే మళ్లీ డెత్‌వారెంట్ జారీ చేశారు. దోషులు దాన్ని కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిర్భయ దోషులు మళ్లీ కోర్టుకెక్కారు.
*రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. తహసీల్దార్ కార్యాలయాల్లో రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంటవడమాలపుత్తూరునగరి తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. నెల్లూరు జిల్లాలో.. సూళ్లూరుపేటకావలిముదిగుప్పతహసీల్దార్ కార్యాలయాల్లోనూ… శ్రీకాకుళం జిల్లా కొత్తూరుకర్నూలు జిల్లా కల్లూరుప్రకాశం జిల్లా పొన్నలూరు.. విశాఖ జిల్లాలో సబ్బవరంభీమిలితూ.గో జిల్లా పెద్దాపురంకడప జిల్లాలో బ్రహ్మంగారిమఠం.. విజయనగరం జిల్లా వేపాడు తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.
*మరోసారి మినహాయింపు కోరిన జగన్
నాంపల్లిలోని సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ కొనసాగుతోంది. ఇవాళ్టి విచారణకు సీఎం జగన్ మినహాయింపు కోరారు. ఎంపీ విజయసాయిరెడ్డి, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, విశ్రాంత అధికారులు శామ్యూల్, రాజగోపాల్ తదితరులు సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.
*భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని అంతర్జాతీయ స్థాయిలో నడిపించి, యువత స్వాతంత్య్రోద్యమంలో చేరేందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రేరణగా నిలిచి చిరస్మరణీయులయ్యారని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. గురువారం విజయవాడలోని రాజ్భవన్లో నగర ప్రముఖుల సమక్షంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించారు. నేతాజీ చిత్రపటానికి గవర్నర్ పూలమాల వేసి నివాళులర్పించారు. నేతాజీ జన్మస్థలమైన ఒడిశాలోని కటక్లోనే తన విద్యాభ్యాసం సాగిందని, అక్కడి నుంచే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించానని గుర్తు చేసుకున్నారు.
*తెలంగాణ ఎంసెట్తో పాటు లాసెట్, పీజీఈసెట్ తేదీల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఇంతకుముందు ప్రకటించినట్లుగా ఎంసెట్ మే 5కి బదులు 4నుంచే ఇంజినీరింగ్ విభాగం పరీక్షతో మొదలవుతుంది. ఆన్లైన్ పరీక్షలకు సాంకేతిక సహకారంఅందించే టీసీఎస్కు మే 6న మరో జాతీయ పరీక్షనిర్వహణ బాధ్యతలుఉండటంతో ఎంసెట్ను ఒకరోజుముందుకు జరిపారు. ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు మాత్రం గతంలో ప్రకటించినట్లుగానే మే 9, 11 తేదీల్లోనే నిర్వహిస్తారు.లాసెట్ను మే 25న నిర్వహిస్తామని డిసెంబరులో ప్రకటించినా రంజాన్ పండగ తేదీల దృష్ట్యా 27న జరిపేలా మార్పు చేశామన్నారు.
*పౌరహక్కుల సంఘం 19వ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 8, 9 తేదీల్లో విశాఖ నగర పరిధి రైల్వేన్యూకాలనీ సుబ్బలక్ష్మి కల్యాణమండపంలో నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.చిట్టిబాబు తెలిపారు.
*తిరుపతి పట్టణంలో మార్చి 7, 8వ తేదీల్లో అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు, ఏఐజీఈఎఫ్ ఉపాధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్రెడ్డి తెలిపారు
*పట్టణ స్థానిక సంస్థలకు ప్రకటన (నోటిఫికేషన్) వెలువడిన 20 రోజుల్లోగా ఎన్నికలు పూర్తి చేసేలా నగరపాలక సంస్థ చట్టంలో, పురపాలక నిబంధనల్లో సవరణలు చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో నిర్వహించిన పుర ఎన్నికల్లో ఇదే విధానాన్ని అమలు చేశారు. ఇక్కడా 27 రోజులకు బదులుగా 20 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది
*గ్రూపు-1 ప్రధాన పరీక్షలు ఏప్రిల్ 7 నుంచి 19వ తేదీ మధ్య జరగనున్నాయి. తొలుత ప్రకటించిన ప్రకారం ఈ పరీక్షలు ఫిబ్రవరి 4 నుంచి 16వ తేదీ మధ్య జరగాల్సిఉంది. కొత్తగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 7వ తేదీన తెలుగు, 8న-ఆంగ్లం, 11న-పేపరు-1, 13న-పేపరు-2, 15న-పేపరు-3, 17న-పేపరు-4, 19వ తేదీన పేపరు-5 పరీక్ష జరగనుంది. గెజిటెడ్ ఉద్యోగాల పరీక్షల తేదీలు కూడా మారాయి. వీటిని మే 10 నుంచి 13వ తేదీ మధ్య జరుపుతామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఇంతకుముందు ప్రకటించిన ప్రకారం ఇవి ఏప్రిల్ 15 నుంచి 18వ తేదీ మధ్య జరగాల్సి ఉంది. బీసీ, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ పరీక్షలు మే 10, 11 తేదీలు, రాయల్టీ ఇన్స్పెక్టర్-మే 11, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్-మే 12, టెక్నికల్ అసిస్టెంట్ (ఆటోమొబైల్ ఇంజినీరింగ్-పోలీసు శాఖ)-మే 12, అసిస్టెంట్ డైరెక్టర్-(టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) మే-12, 13, అసిస్టెంట్ కెమిస్ట్ (భూగర్భ నీటిపారుదల)-మే 12, 13, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ పరీక్షలు మే 12, 13 తేదీల్లో జరుగుతాయని కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ఓ ప్రకటనలో తెలిపారు.
*రాజధాని కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు వచ్చిన మాజీ అటార్నీ జనరల్, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితర ముఖ్య నేతలు కొందరు పాల్గొన్నారు.
జనవరి 27న ఏపీ కేబినెట్ భేటీ-తాజావార్తలు
Related tags :