మామిడిలో తేనెమంచు పురుగు నివారణ తల్లి పురుగులు, పిల్ల పురుగులు చేరి లేత ఆకులు, పుష్పగుచ్చాలు, పూలు, పిందెల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల పూత, పిందె వాడి రాలిపోతాయి. అంతేకాకుండా ఈ పురుగులు విసర్జించిన తేనె లాంటి తియ్యని పదార్థంపై మసి కారణమైన శిలీంద్రాలు పెరుగుతాయి. దీనివల్ల ఆకులపై, పూత, కాయలపై నల్లని మసి మంగు ఏర్పడుతుంది. జనవరి నుంచి మార్చి వరకు ఇవి లేత ఆకులపై, పూరెమ్మలపై 4 నుంచి 5 జీవిత చక్రాలను పూర్తి చేసుకుంటాయి. ఈ పురుగులు కాయలేని సమయంలో చెట్ల కాండం, కొమ్మల బెరడులోని పగుళ్లలో దాక్కొని ఉంటాయి. తోటలలో కలుపు ఎక్కువగాను, వాతావరణం మబ్బుగా ఉండి గాలిలో తేమ శాతం ఎక్కువగాను, ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగుల వల్ల ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నది. ఈ పురుగులు రసాన్ని పీల్చటం వలన పూత పూర్తిగా మాడిపోయి పిందె పట్టదు. లేత ఆకులు, కొమ్మల నుంచి కూడా రసం పీలుస్తుంది. దీంతో ఆకులు ముడతపడి అంటుకొని సరిగా పెరుగవు. పురుగులు విసర్జించిన తేనె లాంటి బంక ఆకుల మీద కారి, సూర్యరశ్మి వెలుతురులో మెరుస్తుంది. నివారణ: లీటరు నీటికి డైమిథోయేట్ 2 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి. లీ. కలిపి పూత మొదలయ్యే సమయం, పిందెలు తయారయ్యే సమయంలో పిచికారీ చేయాలి. పూత బాగా ఉన్నప్పుడు పిచికారీ చేయడం వల్ల పుప్పొడి రాలి పరాగ సంపర్కానికి తోడ్పడే కీటకాలు నశిస్తాయి. మొగ్గ దశలో కనిపించినప్పుడు ఇమిడాక్లోప్రిడ్ 0.33 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. థయోమిథాక్సమ్ 0.3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మామిడి సాగులో తేనెమంచు పురుగు నివారణ
Related tags :