Business

అవినీతి సూచీలో ఇండియాకు సుస్థిర స్థానం

India gets strong rank in corruption index

అవినీతి సూచీలో 180 దేశాల్లో భారత్ 80వ స్థానంలో నిలిచింది. ‘కరప్షన్ పెర్సెప్షన్ ఇండెక్స్’ (సీపీఐ) పేరుతో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ దీనిని రూపొందించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి గురించి వ్యాపార వర్గాలు, నిపుణుల నుంచి వివరాలు సేకరించి దీనిని రూపొందించింది. అవినీతిని కట్టడి చేయడంలో డెన్మార్క్, న్యూజిలాండ్ తొలి స్థానంలో… ఫిన్లాండ్, సింగపూర్, స్వీడన్, స్విట్లర్లాండ్ వంటివి మొదటి 10 స్థానాల్లో ఉన్నాయి. భారత్తో పాటు చైనా, బెనిన్, ఘనా, మొరాకోలు 80వ స్థానంలో ఉన్నాయి.