Sports

ఒలంపిక్స్ టేబుల్ టెన్నిస్‌కు భారత జట్టుకు అవకాశం

Indian Table Tennis Team Is So Close To Qualify For Olympics

భారత పురుషుల, మహిళా టేబుల్ టెన్నిస్‌ (టీటీ) జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించడానికి అడుగు దూరంలో నిలిచాయి. మరో పోరులో విజయం సాధిస్తే ఒలింపిక్స్‌కు భారత్‌ టేబుల్‌ టెన్నిస్ జట్లు తొలిసారిగా అర్హత సాధిస్తాయి. పోర్చుగల్‌లో జరుగుతున్న ప్రపంచ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో భారత టీటీ జట్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నాయి. లక్సెంబర్గ్‌పై పురుషుల జట్టు 3-0తో, స్వీడన్‌పై మహిళా జట్టు 3-2తో విజయం సాధించి ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నాయి. శరత్‌ కుమార్, హర్మిత్ దేశాయ్‌, సత్యన్‌, అర్చనా కామత్‌, మనికా బాత్రా తమ మ్యాచుల్లో విజయం సాధించారు. ప్రీ క్వార్టర్స్‌లో స్లొవేనియా, రుమేనియాతో భారత జట్లు తలపడనున్నాయి. ఈ పోరులో గెలిస్తే ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత టీటీ జట్లుగా చరిత్ర సృష్టిస్తాయి.