Movies

మాల్దీవుల్లో జలకాలాటలు

Parineethi Chopra In Maldives Water Fun

మాల్దీవుల్లోని మహాసముద్రంలో బాలీవుడ్ ప్రముఖ సినీ హీరోయిన్ పరిణీతి చోప్రా జలాకాలాడి సందడి చేశారు. మాల్దీవుల పర్యటనకు వచ్చిన పరిణీతి చోప్రా నల్లరంగు స్విమ్ సూట్ ధరించి, నల్ల కళ్లద్దాలు పెట్టి… నీలం రంగులో ఉన్న మహాసముద్రంలో తాళ్లతో కట్టిన ఊయలలో ఊగుతూ జలాకాలాడారు. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తన వెకేషన్ సమయాన్ని ఎక్కువగా మాల్దీవుల్లో గడుపుతుంటారు. మహాసముద్రంలో ఊయలపై జలాకాలాడుతున్న చిత్రాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఈ సుందరి ‘‘నాకు కొంత సముద్రం ఇవ్వండి…నేను సంతోషంగా ఉన్నాను…మాల్దీవులు దాదాపు నా రెండవ ఇల్లు లాంటిది…డైవింగ్‌తోనే పరిపూర్ణత వస్తోంది’’ అని శీర్షిక పెట్టారు.పరిణీతి చోప్రా డిసెంబరు నెలలో ఆస్ట్రియా లోయలతోపాటు మంచుకొండల్లోనూ విహరించారు. దట్టమైన మంచులో నల్లరంగు కోటు వేసుకొని ఫోటోకు ఫోజిచ్చారు. ఈ అమ్మడు చలిమంట కాచుకుంటూ ఆస్ట్రియా లోయల అందాలను ఆస్వాదించారు.పరిణీతి సిద్దార్థ్ మల్హోత్రా సరసన ‘జబారియా జోడి’ సినిమాలో కనిపించారు. బ్యాడ్మింటన్ స్టార్ ‘సైనా’ జీవిత కథ ఆధారంగా తీస్తున్న బయోపిక్ చిత్రంలో సైనా నెహ్వాల్ పాత్రను పరిణీతి పోషిస్తున్నారు. ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’ చిత్రం హిందీ రీమేక్‌లో ఆమె నటిస్తున్నారు. విడాకులు తీసుకున్న మహిళ ఓ తప్పిపోయిన వ్యక్తితో కలిసి జీవితాన్నిపంచుకునే థ్రిల్లర్ సినిమా కథలో పరిణీతి నటిస్తున్నారు.