DailyDose

మహా రాజకీయాల్లో ఫోన్‌ ట్యాపింగ్‌ కలకలం-రాజకీయ

Phone Tapping Sensation In Maharashtra Politics-Telugu Political News Roundup

* మహారాష్ట్ర రాజకీయాల్లో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, తదనంతరం మహారాష్ట్ర వికాస్‌ ఆఘాడీ ప్రభుత్వం ఏర్పాటు సమయంలో అప్పటి భాజపా ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడిందంటూ వస్తున్న ఆరోపణలపై సర్కార్‌ దర్యాప్తునకు ఆదేశించింది. భాజపాయేతర పార్టీల నేతల ఫోన్లు ట్యాపింగ్‌ వ్యవహారంపై దర్యాప్తు జరిపించి కఠిన చర్యలు తీసుకోనున్నట్టు గురువారం మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ స్పష్టంచేశారు. అలాగే, గతంలో మంత్రిగా పనిచేసిన భాజపా సీనియర్‌ నేత ఒకరు ఫోన్‌ట్యాపింగ్‌పై తనను హెచ్చరించారని శివసేన ఎంపీ సంజయ్‌ రౌట్‌ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ట్విటర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘మీ ఫోన్‌ ట్యాపింగ్‌కు గురవుతుందని గతంలో భాజపా మంత్రిగా పనిచేసిన వ్యక్తే నాతో అన్నారు. అందుకు నేను స్పందిస్తూ.. నా సంభాషణల్ని ఆలకించేందుకు ఇష్టపడేవారు వాటిని స్వేచ్ఛగా వినొచ్చు. నేను బాలాసాహెబ్‌ శిశ్యుడిని. నేనేదీ రహస్యంగా చేయను’’ అని ఆయనకు స్పష్టంచేసినట్టు రౌట్‌ పేర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తునకు ఆదేశించినట్టు హోంమంత్రి వెల్లడించారు
* గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు
గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను తెదేపా అధినేత చంద్రబాబు కలిశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు పార్టీ నేతలతో కలిసి వెళ్లి శాసనసభ, మండలిలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఫిర్యాదు చేశారు. మండలిలో మంత్రులు వ్యవహరించిన తీరుకు సంబంధించిన వివరాలతో ఉన్న పెన్‌డ్రైవ్‌ను గవర్నర్‌కు చంద్రబాబు అందజేశారు. ఛైర్మన్‌ పోడియాన్ని ముట్టడించి అనుచితంగా ప్రవర్తించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.
* చరిత్రహీనులు కావొద్దు.. వైసీపీకి తులసిరెడ్డి హెచ్చరిక
శాసనమండలిపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఖండించారు. ‘‘పేద రాష్ట్రానికి మండలి అవసరమా?’’ వంటి వ్యాఖ్యలు సరికాదని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. రైతులకు, మహిళలకు వ్యతిరేకంగా వాదించడానికి రూ.5 కోట్లతో అడ్వకేట్‌ను ఏర్పాటు చేయడం అవసరమా అని మండిపడ్డారు. సీఎం ఎక్కడ ఉంటే అక్కడి నుంచి పరిపాలన చేయవచ్చా? అని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దల సభ న్యాయం చేయకపోవడం నిజంగా దుర్మార్గమని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం అత్యంత హేయమన్నారు. సెలెక్ట్ కమిటీకి పంపితే మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని వ్యాఖ్యానించారు. అభివృద్ధి జరగకుండా, విభజన చట్టంలో అభివృద్ధి కార్యక్రమాలు అమలుకాకుండా శాసన మండలి అడ్డుకుందా అని ప్రశ్నించారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా పెద్దల సభ ఎటువంటి నిర్ణయాలు చేయలేదన్నారు. పెద్దల సభలో మంత్రి బొత్స సత్యనారాయణ.. తాబేదార్లు అనడాన్ని శాసనమండలి చరిత్రకు కళంకమన్నారు.
* అందుకే ఇవాళ ఏపీ అసెంబ్లీకి సెలవిచ్చారు: దేవినేని ఉమా
సీబీఐ, ఈడీ కేసులు పర్యవేక్షించుకునేందుకే శుక్రవారం ఏపీ అసెంబ్లీకి సెలవిచ్చారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఏ2 ముద్దాయి విజయసాయిరెడ్డికి శాసనమండలిలో ఏం పని? అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్‌ వేస్తామన్నారు. విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు ఉండాల్సింది జైల్లోనే అని అన్నారు. సీఎం జగన్ ఎంత ప్రయత్నించినా మండలి రద్దు కాదన్నారు. మండలి రద్దుపై అసెంబ్లీ తీర్మానం చేస్తే కోర్టుకెళ్తామని దేవినేని ఉమా స్పష్టం చేశారు. సీఎం జగన్‌ కోర్టుకు హాజరుకావడం వల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ.30 కోట్ల భారం పడుతుందన్నారు. మీడియా ప్రతినిధులపై నిర్భయ, దిశ కేసులు నమోదు చేస్తారా?.. మీడియా గొంతు నొక్కేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారని దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విమర్శించారు.
* ఛైర్మన్‌ షరీఫ్‌ను కొట్టబోయారు: చంద్రబాబు
శాసన మండలి ఛైర్మన్‌ షరీఫ్‌, తెదేపా ఎమ్మెల్సీలు రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలబడ్డారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులను మండలి ఛైర్మన్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపడం.. మండలి రద్దు దిశగా ప్రభుత్వ నిర్ణయం తీసుకోనుందనే వార్తల నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై ఆరోపణలు చేశారు. మండలిలో బిల్లులు ఆమోదం పొందేందుకు అధికార పార్టీ తమ సభ్యులను ప్రలోభాలతో పాటు బెదిరింపులకు గురిచేసిందని..అయినా తమ సభ్యులు లొంగలేదన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా వీరోచితంగా పోరాడుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.
*మోడీకి అసంతృప్తి ఉంటె నిర్మలా సీతారామన్ రాజీనామా చేయమని అడగాలి.
ప్రీ బడ్జెట్ సమావేశాలు అన్ని ప్రధాన కేంద్రమంత్రి కార్యాలయంలో నిర్వహించారని ఆ సమావేశాలకు ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ ఆహ్వానించలేదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంరి కాంగ్రెస్ నేత ప్రుద్వి రాజ్ చవాన్ ఆరోపించారు. సీతారామన్ పనితీరు పట్ల ప్రధాని మోడీ అసంతృప్తిగా ఉంటే ఆమెతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేసారు. బడ్జెట్ సన్నాహక సమావేశాలను ఆర్ధిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుందని బడ్జెట్ కు సంబందించిన పూర్తీ ప్రక్రీయ ఆశాఖ ఆద్వార్యంలోనే జరగాలని చెప్పారు.
*జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా- పల్లంరాజు
ఏపీ రాజధానిని విశాఖకు మార్చాలన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని తానూ వ్యక్తిగాత్మగా స్వాగతిస్తున్నామని కేంద్ర మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పల్లమరాజు అన్నారు. పార్టీ అభిప్రాయం ఏమిటన్నది పీసీసీ అద్యక్షుడు పల్లంరాజు అన్నారు. పార్టీ అభిప్రాయం ఏమిటన్నది పీసీసీ అద్యక్దుసు తెలియజేతారని చెప్పారు. రాజధానిగా విశాఖ అనువైన ప్రాంతంమేనన్నారు. ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పల్లంరాజు ఈసందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అమరావతిని రాజధానిగా నిర్ణయించడంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుచేసారని శివరామకృష్ణ నిర్ణయాన్ని కూడా ఆయన పరిగణనలోకి తీసుకోకుండా సొంత నిర్ణయం తీసుకున్నారని విమర్సించారు.
* అధికారులంతా గుడారాలేసుకోవాలా?:సోమిరెడ్డి
రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్నారని, ఈ అంశాన్ని ప్రస్తావించకుండా అంబేడ్కర్‌ పొరపాటు చేశారేమోనని మాజీ మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తొలిసారిగా జగనే గుర్తించినట్లున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంటున్నారని, ఈ లెక్కన ఆయన వెనకే అధికారులంతా గుడారాలేసుకుంటే సరిపోతుందని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. మొత్తానికి రాజధానికి సీఎం జగన్‌ కొత్త నిర్వచనం చెబుతున్నారని అన్నారు. ఈ మాత్రం ఆలోచన 72 ఏళ్లు పాలించిన వారికి లేకుండా పోయిందని సోమిరెడ్డి అన్నారు. జయలలిత ఊటీ నుంచి పాలన సాగించారని వైకాపా నేతలు చెబుతున్నారని,ఈ లెక్కన మన రాష్ట్రంలోని హార్స్‌లీ హిల్స్‌, అరకు ప్రాంతాల నుంచి పాలన సాగించుకోవచ్చని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.
*ఇష్టం లేకపోతే మండలి రద్దు చేస్తారా?:వడ్డే
‘వైకాపా నేతలకు ఇష్టం లేకపోతే శాసన మండలిని రద్దు చేస్తారా?’ అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. అధికారం ఉందని ఇష్టమొచ్చినట్లు చేస్తానంటే ప్రజాస్వామ్యంలో కుదరదని ముఖ్యమంత్రి జగన్‌పై మండిపడ్డారు. మండలి ఛైర్మన్‌ నిర్ణయాలను ప్రశ్నించడానికి మీకు అధికారమెక్కడిదని ప్రశ్నించారు. మండలిని రద్దు చేయడం అనుకున్నంత సులభం కాదని, ఎవరో స్వామీజీ చెప్పారని ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రాజధానిని మారుస్తారా? అని మండిపడ్డారు. పరిపాలన రాజధాని అని పెట్టిన బిల్లుల్లో పూర్తిగా అబద్ధాలను పొందుపరిచారని విమర్శించారు. ‘అమరావతి వద్దని ఎవరు ఆందోళన చేశారు? మంత్రి బొత్స చెప్పేదాకా కర్నూలులోగానీ, విశాఖ ప్రజలుగానీ ఆందోళనలు చేశారా?’ అని వడ్డే అన్నారు. మండలిలో ఛైర్మన్‌పై బొత్స వ్యవహార శైలిపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.
*జయలలిత విషయంలో జగన్ చెప్పింది అబద్ధం: చంద్రబాబు
అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాజ్యాంగంలో కేపిటల్ పదమే లేదనడం పచ్చి అబద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. జయలలిత పాలన ఊటీ నుంచే చేశారనడం మరో అబద్ధమని, విశ్రాంతి కోసమే జయలలిత ఊటీకి వెళ్లేవారని.. దానినీ వక్రీకరించారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతలు.. ప్రజల దృష్టిలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన విమర్శించారు.
*పరిటాల రవి ఒక శక్తి: చంద్రబాబు
మాజీ మంత్రి పరిటాల రవి ఒక శక్తి అని, ఒక వ్యవస్థను, పెత్తందారీ విధానాన్ని నిరసించాడని, టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ భవన్‌లో పరిటాల రవి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవికి చంద్రబాబు, టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, రామానాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్, దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, జవహర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఉదాత్త ఆశయాల కోసం జీవితాంతం పోరాడాడని, చనిపోయి 15ఏళ్లయినా పేదల గుండెల్లో చిరంజీవిగా ఉన్నాడని చంద్రబాబు ప్రశంసలు గుప్పించారు. వైసీపీ హత్యా రాజకీయాలపై రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు, ఫ్యూడల్ పాలనపై పోరాటమే పరిటాల రవికి అందించే నివాళి అని చంద్రబాబు చెప్పారు.
*జగన్‌ కేసులతో రాష్ట్రంపై రూ.30కోట్ల భారం’
సీబీఐ, ఈడీ కేసులు పర్యవేక్షించుకునేందుకే ఇవాళ అసెంబ్లీకి సెలవు ప్రకటించారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉమా మాట్లాడుతూ…రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. ‘‘సీఎం జగన్‌ తన సొంత అజెండా అమలు చేస్తున్నారు. సీఎం ఎంత ప్రయత్నించినా మండలి రద్దు కాదు. మండలి విషయంలో సీఎం తప్పుడు నిర్ణయం తీసుకుంటే కోర్టుకెళ్తాం. ఏ2 ముద్దాయి విజయ సాయిరెడ్డికి మండలిలో ఏం పని? విజయ సాయిరెడ్డి బెయిల్‌ రద్దు కోరుతూ కోర్టును ఆశ్రయిస్తాం. ఎమ్మెల్సీలను ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. మండలి ఛైర్మన్‌పై దాడికి యత్నించారు. తప్పు చేస్తున్నందునే మండలి ప్రసారాల లైవ్‌ నిలిపివేశారు.
*ఆ ఒక్కటీ నెరవేర్చలేక పోయా!: సునీత
మాజీ మంత్రి పరిటాల రవి చనిపోయి 15 ఏళ్లు గడిచినా ఇంకా అభిమానుల గుండెల్లో నిలిచే ఉన్నారని ఆయన భార్య పరిటాల సునీత అన్నారు. పరిటాల రవి 15వ వర్ధంతి సందర్భంగా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలోని ఘాట్‌ వద్ద కుటుంబసభ్యులతో కలిసి ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు అక్కడికి భారీగా తరలివచ్చి రవికి నివాళులర్పించారు. అభిమానులు, కార్యకర్తల కోసం అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. రవి చనిపోయిన నాటి నుంచి ఆయన ఆశయ సాధన కోసమే పని చేస్తు్న్నామని చెప్పారు. అయితే, గత ఏడాది రవిఘాట్‌ వద్ద తనయుడు శ్రీరాంను గెలిపిస్తానని మాట ఇచ్చానని.. కానీ, అది ఒక్కటీ నెరవేర్చలేకపోయానన్న బాధ అలానే ఉండిపోయిందని ఆవేదన చెందారు
*బీజేపీ ఎంపీపై కేసు నమోదు
బీజేపీ పార్లమెంటు సభ్యురాలు శోభ కరంద్లాజేపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ‘పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) మద్దతు ఇచ్చినందున మలప్పురంలోని కుట్టిపురం పంచాయతీలో హిందువులకు నీటి సరఫరాను నిరాకరిస్తున్నారు’ అని ఈనెల 22న కరంద్లాజే ఓ ట్వీట్ చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించారనే అభియోగంపై ఐపీసీలోని సెక్షన్ 153(ఎ) కింద ఆమెపై, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.కరంద్లాజే ట్వీట్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో ఎంపీ ట్వీట్ కుట్టిపురంలో మత సామరస్యానికి తీవ్ర విఘాతం కలిగించే అవకాశం ఉందంటూ సుప్రీంకోర్టు న్యాయవాది, మలప్పురం స్థానికుడు అయిన సుభాష్ చంద్ర కేఆర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
*మంత్రివర్గ విస్తరణ వాయిదా
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కేబినెట్ విస్తరణ వాయిదా పడినట్టు రాజ్భవన్ నుచి ఒక ప్రకటన వెలువడింది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ శుక్రవారమే మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉంది. అయితే పశ్చిమ సింగ్భూమ్జీ జిల్లాలో పాతాల్గర్హి ఉద్యమ మద్దతుదారులు ఏడుగురు గ్రామస్థులను మట్టుబెట్టిన ఘటన తనను తీవ్ర విచారంలో ముంచెత్తిందని, మంత్రివర్గ విస్తరణ వాయిదా వేయాలని గవర్నర్ ద్రౌపది ముర్ముకు ముఖ్యమంత్రి సోరెన్ చేసిన విజ్ఞప్తి మేరకు మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. డిసెంబర్ 29న సోరెన్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఈ మంత్రివర్గ విస్తరణ చేపడుతున్నారు
*భూదందాలకే 3 రాజధానులు
జనసేన అధినేత పవన్, ఏపీలో భూ దందాల కోసమే వైకాపా 3 రాజధానులను ఏర్పాటు చేస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. 3 రాజధానుల ఏర్పాటుపై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి అనుమతి తీసుకున్నామని వైకాపా నేతలు పదేపదే చెబుతున్నది అంతా అబద్ధమన్నారు. గురువారమిక్కడ భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, భాజపా నేతలు సునీల్ దేవధర్, జీవీఎల్ నరసింహారావు, పురందేశ్వరి సమావేశమయ్యారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ… భూదందాల కోసమే వైకాపా 3 రాజధానులను తీసుకొచ్చిన విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ప్రజలకు వ్యతిరేకంగా వైకాపా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, గతంలో తెదేపా చేసిన ప్రజా వ్యతిరేక పనులపై భాజపా, జనసేన కలిసి పోరాడతాయని సునీల్ దేవ్ధర్ ప్రకటించారు.
*ఒవైసీవి రెచ్చగొట్టే మాటలు: భాజపా
పార్టీ కార్యక్రమాలకు పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్కు భాజపా నేతలు ఫిర్యాదు చేశారు. ఆయా కార్యక్రమాలకు హాజరవుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి కనీస గౌరవం ఇవ్వడం లేదని అన్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచందర్రావు సీపీకి ఫిర్యాదు చేశారు.అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ… ఎంఐఎం చేసే కార్యక్రమాలకు పోలీసులు ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. ఉద్దేశ పూర్వకంగానే మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని అన్నారు. ఈ నెల 25వ తేదీన చార్మినార్ వద్ద ఎంఐఎం తలపెట్టిన ర్యాలీకి అనుమతి ఇవ్వొద్దని కమిషనర్ను కోరినట్లు వారు వివరించారు. మజ్లిస్ ర్యాలీకి అనుమతిస్తే వేరే చోట భాజపా కూడా ఆందోళన చేసే అవకాశముందని లక్ష్మణ్ హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో అల్లకల్లోలం సృష్టించాలని చూడటం మంచి సాంప్రదాయం కాదని నేతలు అభిప్రాయపడ్డారు.
*జగన్ మొండిగా వ్యవహరించడం తగదు: వర్ల
మూడు రాజధానుల విషయంలో ముఖ్యమంత్రి జగన్ మొండిగా వ్యవహరించడం సరికాదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య హితవు పలికారు. జగన్ ప్రతి విషయానికి ఉలిక్కిపడుతున్నారని విమర్శించారు. శాసన మండలికి 23 మంది మంత్రులు రావాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానుల నిర్ణయంపై రాష్ట్రమంతా అట్టుడుకుతున్నా సీఎం జగన్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాజధాని రైతులకు వ్యతిరేకంగా వాదించేందుకు దిల్లీ నుంచి ముకుల్ రోహత్గీని నియమించి ఆయనకు ఫీజు కింద రూ.5 కోట్ల ప్రజాధనం ముట్టజెప్తున్నారని విమర్శించారు. ప్రజల డబ్బుతోనే ప్రజలను ఓడించాలని చూస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఏ ప్రభుత్వమూ ఓ కేసు కోసం లాయర్లకు ఇంత మొత్తంలో డబ్బు వెచ్చించలేదన్నారు. జగన్ అవినీతి కేసులతో కలిపి వాదించేందుకు ముకుల్కు రూ.5 కోట్లు ఇచ్చారా? అని వర్ల నిలదీశారు.
*కాంగ్రెస్ మానసిక రుగ్మతతో బాధపడుతోంది
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీపై భాజపా నూతన జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ మానసిక రుగ్మతతో బాధపడుతోందని విమర్శించారు. గురువారం ఆగ్రాలో సీఏఏకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని దుయ్యబట్టారు.
*మ్మకంతో ఓటేస్తే హామీలు విస్మరించారు:షా
హస్తినలోని కేజ్రీవాల్ ప్రభుత్వం పాలన సరిగాలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం, అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామన్న హామీతో పాటు సాహసోపేత నిర్ణయాలు తీసకుందని, దిల్లీ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజల్ని కోరారు. గురువారం సాయంత్రం నైరుతి దిల్లీలో నిర్వహించిన ఎన్నిక ప్రచార కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఐదేళ్ల క్రితం కేజ్రీవాల్పై ఎంతో నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని గుర్తుచేశారు. కానీ ఆయన మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారని దుయ్యబట్టారు.
*కొల్లాపూర్ కారులో ముదిరిన ఆధిపత్య పోరు- పట్టణంలో 144 సెక్షన్
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో తెరాస వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుతోంది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల మధ్య నెలకొన్న విభేదాలు రోజు రోజుకూ వేడెక్కుతున్నాయి. వారం రోజులపాటు నువ్వా.. నేనా అన్నట్లుగా అటు ఎమ్మెల్యే వర్గం, ఇటు మాజీ మంత్రి అనుచరులు జోరుగా ప్రచారం చేశారు. బుధవారం సాయంత్రం పోలింగ్ ముగిశాక రాత్రి 10.30 గంటల ప్రాంతంలో మరమ్మతుల కారణంగా కొల్లాపూర్ పట్టణంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు, అభ్యర్థులు.. బ్యాలెట్ పెట్టెలు భద్రపరచిన స్ట్రాంగ్ రూం వద్దకు తరలివచ్చారు.
*పార్టీ బాధ్యతల్లోకి కేంద్ర మంత్రులు!
భాజపా జాతీయ కార్యవర్గంలో కొందరు కేంద్రమంత్రులకు చోటు కల్పించాలని పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా భావిస్తున్నారు. ఇందుకోసం వారు మంత్రి పదవులను త్యాగం చేయనున్నారని తెలిసింది. కొత్త కార్యవర్గం త్వరలో ఏర్పాటు కానుంది. ఇందులో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు స్థానం కల్పించాలని, మూడొంతుల మంది మహిళలు ఉండేటట్టు చూడాలని కూడా నడ్డా ప్రతిపాదించినట్టు తెలిసింది. జాతీయ కార్యవర్గంలో 40 పదవులు ఉంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడులకు ప్రాధాన్యమిచ్చి, తద్వారా ఆ రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలని కూడా భావిస్తున్నారు.
*కాశీం నిర్బంధాన్ని ఖండిస్తున్నాం: కోదండరాం
విరసం రాష్ట్ర కార్యదర్శి కాశీం నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. కవులు, కళాకారులు, రచయితలు భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రజల కోసం బాధ్యతగా ఉపయోగిస్తారని ఆయన చెప్పారు. అయితే, ఒక విశ్వవిద్యాలయ ఆచార్యుడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని ఆయన ధ్వజమెత్తారు.
*ఏడు నెలల్లోనే డమ్మీ కాన్వాయ్ అవసరమేంటి?
తెదేపా ఎమ్మెల్యే రామానాయుడు
ప్రతిపక్షనేత చంద్రబాబును విమర్శించే ముందు అధికారం చేపట్టిన ఏడు నెలల్లోనే డమ్మీ కాన్వాయ్ అవసరం ఎందుకు వచ్చిందో సీఎం జగన్ ఆలోచించుకోవాలని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సూచించారు. 144 సెక్షన్ నీడలో మెష్లు అడ్డుపెట్టుకుని అసెంబ్లీకి వెళ్లడం జగన్కే చెల్లిందన్నారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘మండలి గ్యాలరీలో చంద్రబాబు ఎందుకున్నారని వైకాపా నేతలు ప్రశ్నించడానికి ముందు విజయసాయిరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి రెండు రోజులపాటు గ్యాలరీల్లో ఎందుకు మకాం వేశారో చెప్పాలి. ఛైర్మన్, వైస్ఛైర్మన్ గదుల్లో వారికేం పని? మండలిలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియకుండా విద్యుత్తు సరఫరాను తొలగించడంతోపాటు టీ.వీ ప్రసారాలు నిలిపేశారు.
*తెదేపా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు సన్మానం
రాజధాని విభజన బిల్లు విషయంలో పోరాడిన తెదేపా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో గురువారం సన్మానం నిర్వహించారు. మంగళగిరి సమీపంలోని తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఛాంబర్ అధ్యక్షుడు వీబీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో, ఛాంబర్ ప్రతినిధులు మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, శాసన సభలో తెదేపాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణను సన్మానించారు.
*వైకాపాలో చేరిన ఎమ్మెల్సీ సునీత
ఎమ్మెల్సీ పోతుల సునీత గురువారం సాయంత్రం తన భర్త సురేష్తో పాటు వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కలిశారు. తెదేపా ఎమ్మెల్సీగా ఉన్నా.. ఆ పదవికి రాజీనామా చేయకుండానే వైకాపాలో చేరారు. న్యాయపరంగా ఇబ్బందులుంటే తన పదవికి రాజీనామా చేస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు. వారితోపాటు జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఉన్నారు. పాలన వికేంద్రీకరణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమర్థనీయమేనని, ఇదే సమయంలో రాజధానికి భూములిచ్చిన రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి విన్నవించినట్లు తెలిసింది. అదే పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్తో ఉన్న వైరం గురించి అడిగితే.. ఓ నియోజకవర్గంలో నలుగురు నాయకులుంటారని, ఎవరైనా పార్టీ కోసం పనిచేయాల్సిందేనని సమాధానమిచ్చారు. చట్టానికి వ్యతిరేకంగా ఏం జరిగినా ముఖ్యమంత్రి ఉపేక్షించరని, ఇదే విషయం చీరాలకూ వర్తిస్తుందని పేర్కొన్నారు
*బిల్లులను సెలక్టు కమిటీకి పంపడం హర్షణీయం: తులసిరెడ్డి
రాజధాని మార్పు, సీఆర్డీఏ రద్దు బిల్లులను మండలి ఛైర్మన్ సెలక్టు కమిటీకి పంపటంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తోందని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి పేర్కొన్నారు. దీనిపై అధికార వైకాపా ఎందుకు గగ్గోలు పెడుతోందని ప్రశ్నించారు. గురువారం విజయవాడలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘సెలక్టు కమిటీకి పంపడం అధికార పార్టీ అపజయమో, ప్రతిపక్షానికి విజయమో కాదు. ఇది సర్వసాధారణ విషయం. రాజధాని మార్పు అత్యవసరం కాదు. బిల్లు సెలక్ట్ కమిటీవద్ద ఉండగా కొన్ని కార్యాలయాలను తరలించడం కుదరదు. మంత్రులు పోడియంలోకి ప్రవేశించి ఛైర్మన్ చేతిలోని కాగితాలు లాక్కుని, చించి ఆయనపై విసరడం హేయమైన చర్య. వైకాపా అధికారంలోకి వస్తే రాష్ట్రం రౌడీల రాజ్యం అవుతుందని ఎన్నికల ముందే మేం చెప్పిన మాటలు నిజమయ్యాయి. రాజధానికి భూములిచ్చిన రైతులను జైల్లో పెట్టించిన వైకాపాకు తమ పార్టీ పేరులో రైతు పదం వాడేందుకు అర్హత లేదు. ఆ పార్టీ పేరును యువజన, శ్రామిక, రౌడీ కాంగ్రెస్ అని మార్చుకోవాలి.’ అని తులసిరెడ్డి పేర్కొన్నారు.
*మండలి అంశాన్ని అసెంబ్లీలో ఎలా చర్చిస్తారు: కళావెంకట్రావు
మండలికి సంబంధించిన అంశాన్ని ఏ నిబంధన ప్రకారం శాసనసభలో చర్చించారో చెప్పాలని ప్రభుత్వాన్ని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు ప్రశ్నించారు. శాసనసభలో లేని సభ్యుల గురించి సభలో ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. దీనికి స్పీకర్ ఎలా అంగీకరించారో చెప్పాలన్నారు. అసెంబ్లీ జరుగుతున్న తీరు కౌరవ సభను తలపిస్తోందన్నారు. మండలి ఛైర్మన్ షరీఫ్ ప్రజాస్వామ్యయుతంగానే తన విచక్షణాధికారాన్ని వినియోగించి బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపారని వివరించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘గతంలో అనేక బిల్లులు మండలి నుంచి సెలక్ట్ కమిటీకి పంపారు.