WorldWonders

ఇది అతి చిన్న నాణెం

Swiss Researchers Creates The Smallest Coin

ప్రపంచంలోనే అత్యంత బుల్లి బంగారు నాణేన్ని స్విట్జర్లాండ్ టంకశాల తయారుచేసింది. దీని వ్యాసం 2.96 మిల్లీమీటర్లు బరువు 0.063 గ్రాములు. ముద్రిత విలువ 1/4 స్విస్ ఫ్రాంక్ (రూ.18.58). ఇలాంటి పసిడి నాణేలను కేవలం 999 మాత్రమే తయారు చేశామనీ, ఒక్కోదాన్ని 199 ఫ్రాంక్లకు (రూ.14,439) విక్రయిస్తామని టంకశాల పేర్కొంది. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐన్స్టీన్ నాలుకను బయటపెట్టి చూస్తున్న చిత్రాన్ని దీనిపై ముద్రించారు.