* మున్సిపాలిటీల్లో కారు జోరు: తెలంగాణ భవన్లో సంబరాలు
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తిరుగులేని హవా కనబరుస్తోంది టీఆర్ఎస్ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ మునిసిపాలిటీల్లో విజయం సాధిస్తూ దూసుకుపోతోంది. దీంతో తెలంగాణ భవన్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని సంబరాలు చేసుకుంటున్నారు.టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో కూర్చుని ఫలితాల ట్రెండ్‌ను పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కారు జోరు స్పష్టంగా కనిపిస్తుండడంతో మంత్రుల్లో సంతోషం కనిపిస్తోంది. ఏ ఒక్క మున్సిపాలిటీ ఓడినా పదవులు ఊడుతాయని సీఎం కేసీఆర్ హెచ్చరించిన నేపథ్యంలో వారి వారి పరిధిలో విస్తృతంగా ప్రచారం చేసి మంచి ఫలితాల కోసం ప్రయత్నించారు. తమ కృషికి తగ్గ ఫలితం రావడంతో వారు ఆనందంలో మునిగిపోయారు. పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు జరుపుకొంటున్నారు.
*సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌కు షాక్ తగిలింది. సొంత నియోజకవర్గంలో కేటీఆర్ ప్రభావం చూపలేకపోయారు. స్వతంత్రులు ఏకంగా 10 మంది గెలిచారు. టీఆర్ఎస్ గెలుపు కోసం అన్ని ప్రాంతాల్లో కేటీఆర్ ప్రచారం నిర్వహించారు. కానీ సొంత నియోజకవర్గంలో మాత్రం ఆయన ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. మిగతా మున్సిపాలిటీల్లో కారు స్పీడ్‌గా దూసుకుపోతోంది. సిరిసిల్లలో మాత్రం కేటీఆర్ సత్తా చాటలేకపోయారు. మొత్తం 39 వార్డులకు ఓట్ల లెక్కింపు ముగియగా టీఆర్ఎస్ 24 వార్డుల్లో గెలిచింది. బీజేపీ అభ్యర్థులు 3, కాంగ్రెస్ అభ్యర్థులు 2, స్వతంత్రులు 10 స్థానాల్లో గెలుపొందారు. వీరు టీఆర్ఎస్ రెబల్స్ గా తెలుస్తొంది.
*కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి షాక్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆయన గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడంగల్‌లో కాంగ్రెస్‌కు చేదు ఫలితాలు వచ్చాయి. కొడంగల్ మున్సిపాలిటీలో అధికార టీఆర్ఎస్ హవా కొనసాగింది. మొత్తం 12 వార్డుల్లో గులాబీ పార్టీ 7 గెలుపొందగా, కాంగ్రెస్ కేవలం మూడు స్థానాలకు పరిమితమైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి కొడంగల్‌కు ఎక్కువ సమయం కేటాయించినప్పటికీ ఫలితం లేకపోయింది. టీఆర్ఎస్కు కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పునరావృత్తం చేస్తూ.. కొడంగల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
*ఫలితాలు బాధ్యతను మరింత పెంచాయి: కేటీఆర్
మున్సిపల్ మంత్రిగా ఫలితాలు తన బాధ్యతను మరింత పెంచాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. శనివారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తెరాస ఘన విజయం సాధించిన సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…2014 నుంచి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్లే భారీ విజయం లభించిందన్నారు. ఇంతటి పెద్ద విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
*ఎన్నికలు ఏవైనా గెలుపు తెరాసదే: హరీశ్‌రావు
మున్సిపల్ ఎన్నికల్లో తెరాస ప్రభంజనం సృష్టించిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం తెరాసదేనని మరోసారి రుజువైందన్నారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన సీఎం కేసీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ శ్రేణులకు హరీశ్‌రావు అభినందనలు తెలిపారు.
*సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ విజయం
రాజన్న సిరిసిల్ల రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో పూర్తిస్థాయి ఫలితాలు వెలువడ్డాయి. సిరిసిల్ల మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. సిరిసిల్లలో మొత్తం 40 వార్డులకు గానూ 39 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 21 వార్డులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. బీజేపీ 3, కాంగ్రెస్ 2, ఇతరులు 13 స్థానాల్లో గెలుపొందారు. వేములవాడ మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులకు గానూ.. టీఆర్ఎస్ 16, కాంగ్రెస్ 1, బీజేపీ 6, స్వతంత్రులు 5 స్థానాల్లో గెలుపొందారు.
*కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ జయకేతనం
కరీంనగర్ జిల్లావ్యాప్త మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. జమ్మికుంట మున్సిపాలిటీలో 30 వార్డులకుగాను టీఆర్ఎస్-22, కాంగ్రెస్-3, ఇతరులు-5 వార్డుల్లో గెలుపొందారు. హుజూరాబాద్(30) మున్సిపాలిటీలో 30 వార్డులకు గాను టీఆర్ఎస్-21, కాంగ్రెస్-1, బీజేపీ-5, ఇతరులు-3 స్థానాల్లో గెలుపొందారు. చొప్పదండి మున్సిపాలిటీలోని 14 వార్డుల్లో టీఆర్ఎస్-9, కాంగ్రెస్-2, బీజేపీ-2, ఇతరులు-1 స్థానంలో గెలుపొందారు. కొత్తపల్లి మున్సిపాలిటీలోని 12 వార్డులకుగాను టీఆర్ఎస్ 11 వార్డులను కైవసం చేసుకోగా కాంగ్రెస్ పార్టీ ఒక వార్డులో గెలుపొందింది.
* భువనగిరిలో TRS విజయం
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార పార్టీ అభ్యర్థుల జోరు కొనసాగుతోంది. భువనగిరి మున్సిపాలిటీలో TRS గెలిచింది. భువనగిరిలో వార్డులకు 15 TRS, 12 కాంగ్రెస్, 7 BJP ఇతరులు 1 గెలిచారు. ఆలేరు, పోచంపల్లిలోనూ TRS విన్ అయ్యింది.జనగాం మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. మొత్తం 30 స్థానాల్లో టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 10, బీజేపీ 4, ఇండిపెండెంట్లు మూడు స్థానాల్లో గెలిచారు. క్యాతనపల్లి మున్సిపాలిటిని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక్కడ 22 స్థానాలకు గాను 19 స్థానాల్లో గెలుపొందింది టీఆర్ఎస్. ఇక్కడ కాంగ్రెస్, సీపీఐ ఒక్కొక్క స్థానంలో గెలుపొందాయి. పోచారం మున్సిపాలిటీలో టీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఇక్కడ 18 స్థానాలకు గాను 12 స్థానాల్లో కారు దూసుకుపోయింది. కాంగ్రెస్, బీజేపీ ఒక్కోక్క స్థానంలో గెలవగా.. ఇతరులు నాలుగు స్థానాల్లో గెలిచారు. గద్వాల మున్సిపాలిటిని టీఆర్ఎస్ గెలుచుకుంది. మొత్తం 37 స్థానాల్లో టీఆర్ఎస్ 19, కాంగ్రెస్ 3, బీజేపీ 10, ఎంఐఎం 1, ఇతరులు నాలుగు స్థానాల్లో గెలుపొందారు.
* ఉమ్మడి వరంగల్ జిల్లాలో TRS క్లీన్ స్వీప్
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెలువడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది టీఆర్ఎస్. ఇక్కడ 9 మున్సిపాల్టిలను టీఆర్ఎస్ గెలుచుకుంది. వేములవాడలో టీఆర్ఎస్ విజయం సాధించింది. మొత్తం 28 స్థానాలకు గాను టీఆర్ఎస్ 16, బీజేపీ 6, ఇండిపెండెంట్లు 5, కాంగ్రెస్ 1 స్థానాల్లో విజయం ధించింది.
* యాదాద్రి కాంగ్రెస్ కైవసం
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెలువడుతున్నాయి. యాదగిరి గుట్టలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మొత్తం 12 వార్డులకు గాను నాలుగు కాంగ్రెస్… మరో నాలుగింట్లో కాంగ్రెస్ రెబల్స్ విజయం సాధించారు. కేవలం రెండు స్థానాల్లోనే టీఆర్ఎస్ గెలిచింది. మరో స్థానంలో సీపీఐ విజయం సాధించింది.
* బ్యాలెట్ బాక్స్ లో KTRకి లెటర్
పెద్దపల్లి జిల్లా మంథని లో బ్యాలెట్ బాక్స్ లో ఓ దివ్యాంగుడు రాసిన లెటర్ బయటపడింది. వెన్నెముక గాయంతో బాధపడ్తున్న దివ్యాంగుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని, ప్రభుత్వం సహాయం చేయాలన్నాడు. తమ కష్టాలు చెప్పుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ను కోరాడు.
* ఎమ్మెల్యేను అడ్డుకున్న టీఆర్ఎస్.. భువనగిరిలో ఉద్రిక్తత
భువనగిరిలోని కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీఆరెస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కౌంటింగ్ కేంద్రంలోకి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వెళ్లేందుకు యత్నించగా… టీఆరెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చివరకు రాజగోపాల్ రెడ్డి పోలీసుల జోక్యంతో లోపలికి వెళ్లారు.
* నిర్మల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం
నిర్మల్ మున్సిపాలిటీని అధికార టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 42 వార్డులకు గాను టీఆర్ఎస్ 30, కాంగ్రెస్ 7, బీజేపీ 1, ఎంఐఎం 2, ఇండిపెండెంట్స్ 2 వార్డుల్లో గెలుపొందారు. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి టీఆర్ఎస్ హవా కొనసాగింది. మొదట 21 వార్డుల్లో లెక్కింపు పూర్తికాగా, తరువాత మిగిలిన 21 వార్డులకు కౌంటింగ్ జరిగింది. అధిక వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
* సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. మొత్తం 12 వార్డుల్లో టీఆర్ఎస్ 5 వార్డుల్లో, కాంగ్రెస్ 5 వార్డుల్లో, స్వతంత్రులు రెండు వార్డుల్లో విజయం సాధించారు.
*వడ్డేపల్లి మున్సిపాల్టీ కాంగ్రెస్ కైవసం
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ లో కాంగ్రేస్ జెండా ఎగిరిందివడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10. వార్డులలో 8 వార్డు లు కాంగ్రేస్ కైవసం చేసుకుందిశాంతినగర్ పైపాడు వడ్డేపల్లి ప్రజలు అవినీతినీ పాలనను వేలి ముద్ర పాలన ను ప్రాలదొరి నీతి వంతమైన నిజాయితీ గలా కాంగ్రేస్ వైపు ప్రజలు ఉన్నారన్నావిషయాలను ప్రజలు ఓటుద్వారా ఈ రోజు నిరూపించారు.
* కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి షాక్..
సంగారెడ్డి మున్సిపాలిటీ టీఆర్ఎస్దే కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి తన సొంత నియోజకవర్గంలోనే అనుకోని షాక్ తగిలింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సంగారెడ్డి మునిసిపాలిటీలో టీఆర్ఎస్ చైర్ పర్సన్ పీఠాన్ని దక్కించుకుంది. అ పార్టీ అత్యధికంగా 18 వార్డులను గెలుచుకోంది. ఎంఐఎం సహకారంతో టీఆర్ఎస్ ఈ వార్డులను గెలుచుకుందిద. సంగారెడ్డిలో మొత్తం వార్డులు 38 ఉండగా.. టీఆర్ఎస్ పార్టీ 18, కాంగ్రెస్ 14, ఎంఐఎం 01, బీజేపీ 02, ఇండిపెండెంట్లు 03 స్థానాలను దక్కించుకుంది.
* భైంసాలో ఖాతా తెరవని టీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా నడుస్తుండగా.. రాష్ట్రంలోని ఒక మునిసిపాలిటీలో మాత్రం ఆ పార్టీ ఆనవాలు కూడా లేకుండా పోయింది. అధికార టీఆర్ఎస్ కానీ, ప్రతిపక్ష కాంగ్రెస్ కానీ ఆ మున్సిపాలిటీలో ఒక్కటంటే ఒక్క వార్డును కూడా గెలుచుకోలేదు. అదే నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీ.తెలంగాణలో ప్రభంజనం సృష్టిస్తున్న టీఆర్ఎస్ పార్టీ భైంసాలోని ఒక్క వార్డులో బోణీ కొట్టలేకపోయింది. భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం పార్టీ సొంతం చేసుకుంది. భైంసా మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డుల్లో ఎంఐఎం 15 గెలుపొందగా, బీజేపీ 9 స్థానాల్లో విజయం సాధించింది. ఇండిపెండెంట్లు 2 వార్డులను సొంతం చేసుకున్నారు.
తెలంగాణ మున్సిపల్ ఫలితాలపై TNI ప్రత్యేక కథనాలు
Related tags :