DailyDose

అట్లాస్ సైకిల్ యజమానురాలు ఆత్మహత్య-నేరవార్తలు

Atlas Cycles Natasha Kapoor Commits Suicide-Telugu Crime News Roundup

* ప్రముఖ సైకిల్ తయారీ సంస్థ అట్లాస్ యజమాని సంజయ్ కపూర్ భార్య నటాషా కపూర్(58) ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీలోని ఔరంగజేబు రోడ్‌లో ఉన్న ఆమె నివాసంలో మంగళవారం సాయంత్రం పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఆమె ఉరి వేసుకుని చనిపోయినట్టు గుర్తించారు. నటాషా ఆత్మహత్య చేసుకున్న గదిలో పోలీసులకు సూసైడ్ లభ్యమైంది. ‘నేను నా కుటుంబ సభ్యులను ప్రేమిస్తున్నాను’ అని అందులో ఆమె పేర్కొన్నారు. నటాషా మృతిపై పోలీసులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గంగారామ్ ఆస్పత్రికి తరలించారు.ఆమె మృతదేహాన్ని గుర్తించిన భవనానికి బిషంబెర్ దాస్ కపూర్,జైదేవ్ కపూర్,జగదీష్ కపూర్ అనే నేమ్ ప్లేట్స్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆమె తన కుమారుడు సిద్దాంత కపూర్‌తో నివసిస్తున్నట్టు సమాచారం. మధ్యాహ్నం లంచ్ సమయం నుంచే నటాషా కనిపించట్లేదని తెలుస్తోంది. ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం కలిగినట్టు సమాచారం. కుమారుడు సిద్దాంత కపూర్ ఆమె గదిలోకి వెళ్లి చూడగా.. సీలింగ్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేరగా.. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గంగారామ్ ఆస్పత్రికి తరలించారు.అక్కడ దొరికిన పలు ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు.
* హైదరాబాద్‌ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్‌, మస్కట్‌, సౌదీ అరేబియా నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల నుంచి దాదాపు 4 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ దాదాపు రూ. 1.66 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పక్కా సమాచారంతోనే… దుబాయ్ నుండి వచ్చిన ప్యాసింజర్ నుండి 800 గ్రాములు, మస్కట్ నుండి వచ్చిన ప్యాసింజర్ నుండి 700 గ్రాములు,సౌదీ అరేబియా నుండి వచ్చిన ఇద్దరు ప్యాసింజర్ల నుండి కేజీ న్నర బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ అధికారులు చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
* అనంతపురం జిల్లా గుత్తి లోకో షెడ్డులో ఎదురు ఎదురుగా వస్తున్న రెండు రైలు ఇంజన్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. రైలు ఇంజన్లు ఢీకనడంతో ట్రాక్ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో అధికారులు మరమ్మత్తులు చేపట్టారు.
* విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో విద్యార్థులకు తీవ్రగాయాలవగా ఆటో పూర్తిగా దెబ్బతిన్నది. రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడ మండలంలో ఈ ప్రమాదం జరిగింది. చౌదర్ గూడ నుంచి చూడర్ పూర్ వెళ్తున్న సమయంలో ఆటో బోల్తా పడింది. స్థానికంగా ఉన్న ప్రజలు గాయాలైన విద్యార్థులను సమీప హాస్పిటల్ కు తరలించారు.
* మందస మండలంలోని బుడారిసింగి పంచాయతీ గుడ్డికోల గ్రామానికి చెందిన ఓ 12 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. ఈమె స్వస్థలం ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బత్రసాయి సమీపంలోని గౌడు గ్రామం. గుడ్డికోల గ్రామానికి చెందిన యువకుడికి సదరు బాలిక వరుసకు మేనకోడలు. ఈమె తల్లిదండ్రులు మరణించడంతో బాలికను ఒడిశా నుంచి తీసుకువచ్చి యువకుడు వివాహం చేసుకున్నట్టు తెలిసింది. శుక్రవారం జాతీయ బాలికా దినోత్సవం కావడంతో సిరిపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గిరిజన బాలికల ఆరోగ్య పరీక్షలు చేస్తుండగా గర్భిణి అనే విషయం వెలుగులోకి వచ్చింది.
*ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు కర్నూలు వద్ద ఎన్‌హెచ్‌ 44పై బీభత్సం సృష్టించింది. రెండు ఆటోలు, బస్సును ఢీకొడుతూ వెళ్లింది. చివరకు ఓ ఇంటి గోడును ఢీకొని ట్రావెల్స్‌ బస్సు ఆగిపోయింది. ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలు కాగా.. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
*ఘంటసాల మండలం శ్రీకాకుళంలో విషాదం చోటు చేసుకుంది. జిల్లా పరిషత్ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థి ఉరి వేసుకుని మృతి చెందాడు. తమ్మనబోయిన దీపక్ మణికంఠ సాయి(15)గా స్థానికులు గుర్తించారు. రాత్రి ప్రైవేటుకు వెళ్లిన దీపక్ తెల్లారేసరికి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
*చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ విప్‌, వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెన్నై వెళుతుండగా ఎస్కార్ట్‌ వాహనం బోల్తా పడింది. ప్రమాదం కారణంగా వాహనంలో ఉన్న సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతిలోని ఆసుపత్రికి చెవిరెడ్డి పంపించారు. ఎస్కార్ట్‌ వాహనానికి ముందున్న వాహనంలో చెవిరెడ్డి ఉండడంతో ఎమ్మెల్యేకు ప్రమాదం తప్పినట్టయింది.
*తిరుమలలో ఎర్రచందనం కూలీలను తితిదే విజిలెన్స్‌ సిబ్బంది అదుపులోకి తీసుకుంది. శ్రీవారి పుష్కరిణి వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఐదుగురిని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. పరిశీలించగా వారి వద్ద వంట సామగ్రి లభించింది. భక్తుల ముసుగులో అడవిలోకి వెళ్లి ఎర్రచందనం తరలించేందుకు వచ్చినట్లు నిందితులు అంగీకరిం చారు. వీరితోపాటు మరికొందరు కూలీలు ఉంటారని విజిలెన్స్‌ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అదుపులోకి తీసుకున్న కూలీలను విజిలెన్స్‌ అధికారులు విచారిస్తున్నారు.
*అనంతపురం జిల్లా కదిరి… రోడ్డు ప్రమాదం ఒకరి మృతి … ఒకరి పరిస్థితి విషమం… ఎన్ పి కుంట మండలం సోలార్ ప్రాజెక్ట్ లో టూ వీలర్ బొలెరో ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి. మరొకరి పరిస్థితి విషమం
*ర్కీలో భారీ భూకంపం సంభవించింది. భూకంప ధాటికి ఇప్పటివరకు 14 మంది మృతి చెందారు. రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదైన తీవ్రత.. టర్కీకి తూర్పున ఉన్న ఇలాజిజ్‌ ఫ్రావిన్స్‌లోని సివ్‌రిస్‌ జిల్లాలో సంభవించింది. భూకంపకేంద్రం సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే అంచనా వేసింది.
*చెన్నై వెళుతున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం వద్ద చెవిరెడ్డి ఎస్కార్ట్ వాహానం బోల్తా
ఎస్కార్ట్ వాహానంలోని సిబ్బందికి తీవ్రగాయాలుతిరుపతి ఆసుపత్రికి తరలింపుఎస్కార్ట్ ముందున్న వాహానంలో ఉన్న చెవిరెడ్డి.
*బంగారం అక్రమ రవాణాపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు విరుచుకుపడ్డారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఒకే రోజు ఐదు కేసులు నమోదు చేశారు. ఐదుగురు నిందితుల నుంచి మొత్తం రూ.1.66 కోట్ల విలువైన 4.08 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి డీఆర్ఐ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
*అల్లారుముద్దుగా చూసుకుంటున్న ఆ ఇంటిదీపం క్షణకాలంలో ఆరిపోయింది. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్లోని ఏవీసీ కాలనీలో శుక్రవారం ఉదయ జరిగిన రోడ్డుప్రమాదంలో ఏకైక సంతానమైన 18 నెలల పసిపాప ప్రాణాలు కోల్పోయింది. ఆ సమయంలో కారు నడుపుతున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
*బహళ అంతస్తుల భవనంలో కారును లోపల పెడుతుండగా చూపిన అజాగ్రత్త ఐదేళ్ల బాలుడి ఊపిరి తీసింది. కారు వెనుక ఎవరున్నది గమనించక పోవటం ఈ ప్రమాదానికి అసలు కారణం అయితే.. తమ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు.. ఏం చేస్తున్నాడు అనే విషయంలో పెద్దల నిర్లక్ష్యం మరో కారణం. ఈ ఘటన మల్కాజిగిరి ఆనంద్బాగ్లో చోటు చేసుకుంది.
*విశాఖపట్నంలో గురువారం గంజాయితో పట్టుబడిన కారులో ఓ పోలీసు ఉన్నతాధికారి కుమారుడు ఉన్నట్లు తెలిసింది. దువ్వాడ సీఐ లక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు, ఒంగోలు, మంగళగిరి నుంచి బీటెక్ చదువుతున్న నలుగురు స్నేహితులు స్విఫ్ట్ డిజైర్ కారులో మధురవాడలోని మిత్రుడి ఇంట్లో శుభకార్యానికి వచ్చారు. వారంతా అరకు వెళ్లి రెండు బ్యాగుల్లో గంజాయి నింపుకొని తిరుగు పయనమయ్యారు. దారిలో మద్యం తాగుతూ రావడాన్ని గమనించిన అజ్ఞాతవ్యక్తి ఒకరు 100కు సమాచారం అందించారు.
*కెనడాలో భారత్కు చెందిన విద్యార్థినిపై జరిగిన దాడి ఘటన కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన 23 ఏళ్ల రేచల్ ఆల్బర్ట్ అనే విద్యార్థినిపై టొరెంటోలో గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు రేచల్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.
*సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అత్యాచార ఆరోపణలపై నమోదైన కేసు కొలిక్కి వచ్చింది. బాలిక చెప్పిందంతా ఓ కట్టుకథగా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి నిర్ధరించారు. ఒక యువకుడు బాలికను ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడని చెప్పారు. సినిమాకు వెళ్లినట్లు తెలిస్తే తల్లి తిడుతుందని భావించిన బాలిక అబద్ధం చెప్పినట్లు ఎస్పీ తెలిపారు. బాలిక ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసినందుకు ఇంటి యజమానిపై కేసు నమోదు చేశారు. మైనర్ను తల్లిదండ్రులకు తెలియకుండా తీసుకెళ్లినందుకు యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
*తన మరదలిపైనే బావ యాసిడ్తో దాడి చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా కదబా పట్టణంలో జరిగింది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఏర్పడిన వివాదంతో తన మరదలు అయిన స్వప్నపై సాక్షాత్తూ బావ అయిన జయానంద యాసిడ్తో దాడి చేశాడు. ఈ దాడిలో స్వప్న ముఖం కాలి పోయి గాయాలయ్యాయి. ఈ దాడిలో స్వప్న మూడేళ్ల కుమార్తె కూడా స్వల్పంగా గాయపడింది. కదబా పోలీసులు బాధితురాలు స్వప్నను ఆసుపత్రికి తరలించి నిందితుడు జయానందపై కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
*కడప జిల్లా వేముల మండలం వేముల గ్రామంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. స్థానిక జూనియర్ కళాశాల వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను హైచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా తలుపుల మండలం సిద్ధగురు పల్లి గ్రామానికి చెందిన కూలీలు వేంపల్లి మండలం కొత్తూరు గ్రామంలో పనికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులు ఇంద్రాణి, గంగోజి అమ్మ, నారాయణమ్మ, గంగులమ్మ లక్ష్మీదేవిగా గుర్తించారు
*టీవీ ప్రముఖ నటి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబై నగరంలోని మీరారోడ్డులో వెలుగుచూసింది. టీవీ ప్రముఖ నటి సెజల్ శర్మ తన ఇంట్లోని గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సెజల్ శర్మ ‘దిల్ తో హ్యాపీ హై జీ’ టీవీ సీరియల్లో నటించారు. సెజల్ శర్మ గదిలో సూసైడ్ నోట్ లభించింది. సెజల్ శర్మ ఆత్మహత్య చేసుకున్నపుడు ఆమె ఇంట్లో ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారని పోలీసులు చెప్పారు.
*టర్కీ దేశంలో సంభవించిన భూకంపం వల్ల 18 మంది మరణించగా, మరో 550 మంది గాయపడ్డారు
* కంచికచర్ల మండలం మోగులూరు గ్రామంలో దారుణం.ముస్లిం సోదరులు పవిత్రంగా ప్రార్థనలు చేసుకుంటున్న ఈద్గా ను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు.వందల సంఖ్యలో చేరుకుంటున్న ముస్లిం సోదరులు.