బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS) 2020 సంక్రాంతి వేడుకలు శనివారం నాడు యాష్‌బర్న్‌లోని బ్రాడ్‌రన్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. డూడూబసవన్నలు, చెఱుకుగడలు, హరిదాసుల అవతారాలు, సరదా నాటకాలతో ఈ ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా సందడిగా సాగాయి. సంస్థ అధ్యక్షురాలు పాలడుగు సాయిసుధ సభికులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తన నూతన కార్యవర్గాన్ని సభకు పరిచయం చేశారు. సంస్థ ఆధ్వర్యంలో భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలకు సభ్యుల సహకారాన్ని కోరారు. అనంతరం స్థానిక చిన్నారుల ప్రదర్శనలు అలరించాయి. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ధనుంజయ్, దామినిల సంగీత విభావరి ఆకట్టుకుంది. కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్, GWTCS మాజీ అధ్యక్షుడు మన్నే సత్యనారాయణ, సంస్థ ప్రతినిధులు మాలవత్ చంద్ర, లాం కృష్ణ, యాష్ బొద్దులూరి, సుష్మ అమృతలూరి, అడుసుమిల్లి రవి, భాను మొగులూరి, సత్య యేరువా, గంగా శ్రీనివాస్, మన్నే సుశాంత్, పాలడుగు సురేష్, తాళ్లూరి ఫణి, ప్రవీణ్ కొండుక, విజయ్ అట్లూరి, కార్తీక్ నాదెళ్ల, సత్య సూరపనేని, ఉప్పుటూరి రాంచౌదరి తదితరులు పాల్గొన్నారు. బంతి భోజనాల్లో నేతి అరిసెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఘనంగా GWTCS సంక్రాంతి వేడుకలు
Related tags :