WorldWonders

బెంగుళూరు సరస్వతికి బాలభీముడి జననం

Heavy Weight Infant Born To Bangalore Couples

డార్జిలింగ్ ప్రాంతానికి చెందిన యోగేష్, సరస్వతి దంపతులు గత కొన్నీల్లుగా బెంగలూరులోని యోలహాంక ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. సరస్వతికి నెలలు నిండడంతో ఇటీవల ఆసుపత్రికి వెళ్ళగా వైద్య పరిక్షలు చేసి కవల పిలలు పుట్టే అవకాశాలున్నాయని చెప్పారు. ఆమెబరువు 80 కిలోలు ఉండడంతో వైద్యులు కవలలుగా భావించారు. అయితే ప్రసవం తర్వాత వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆమెకు ఒక్క మగశిశువు మాత్రమే జన్మించాడు. అయితే సాదారణ రీతిలో 5.9 కిలోల బరువున్నాడు. సాదారణంగా అప్పుడే పుట్టిన ఆరోగ్యకరమైన శిశువులు మూడు కేజీల వరకు బరువు ఉంటారు. ఈ బాలాభీముడు మాత్రం ఐదు కేజీలకు బరువు తూగి అందరినీ విస్మయానికి గురి చేసాడు. యోగేష్ సరస్వతి దంపతులకు ఇప్పటికే ఒక బిడ్డ ఉండగా, 14 ఎల్లా తర్వాత ఇలా రెండో బిడ్డకు జన్మనిచ్చారు.