భారత షట్లర్లు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ ప్రస్తుతం కఠిన సమయం ఎదుర్కొంటున్నారని భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. కానీ, వారు ఉత్తమ ప్రదర్శన చేసి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ పీవీ సింధు సత్తా చాటడానికి కాస్త కష్టపడుతుంది. కానీ ఆమె ఎన్నో టోర్నమెంట్స్‌లో నిలకడగా రాణించించి. అలాగే ఈ ఒలింపిక్ ఏడాది కూడా తను అదరగొడుతుందని నమ్ముతున్నా. ఆటలో ఎక్కడ మెరుగవ్వాలో తనకి తెలుసు. దీనిపై దృష్టిసారిస్తాం. అయితే సైనా, శ్రీకాంత్‌లు కఠిన సమయం ఎదుర్కొంటున్నారు. ఒలింపిక్స్‌కు ముందు వారికి 7-8 టోర్నమెంట్స్ మాత్రమే ఉన్నాయి. గత కొన్ని టోర్నీల్లో ఆశించిన రీతిలో రాణించలేకపోయారు. వచ్చే టోర్నీల్లో సత్తా చాటుతారని ఆశిస్తున్నా. సైనా రెండు మంచి ప్రదర్శనలు చేస్తే ఒలింపిక్ బెర్తును ఖరారు చేసుకుంటుంది. ఆమె కచ్చితంగా పుంజుకుంటుంది. శ్రీకాంత్ అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు.
సైనాకు కష్టమేనన్న గోపీచంద్
Related tags :