* స్మార్ట్ ఫోన్ విపణిలో అగ్రరాజ్యం అమెరికాను దాటేసి భారత్ తొలిసారిగా రెండో స్థానానికి దూసుకెళ్లింది. చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా అవతరించింది. ఈ మేరకు కౌంటర్‌పాయింట్ రీసర్చ్ తాజా నివేదికలో పేర్కొంది. 2019లో భారత్‌లో 158 మిలియన్ల స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు, దిగుమతులు జరిగాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 7శాతం ఎక్కువ. దీంతో ఈ జాబితాలో అమెరికా మూడో స్థానానికి పడిపోయింది. ఇక భారత స్మార్ట్‌ఫోన్ విపణిలో చైనా బ్రాండ్లు మరోసారి సత్తా చాటాయి. 2019లో అమ్ముడైన మొత్తం ఫోన్లలో చైనా బ్రాండ్ల వాటా రికార్డు స్థాయిలో 72 శాతానికి చేరింది. అంతకుముందు ఏడాది ఇది 60శాతంగా ఉండేది. చైనా దిగ్గజం షామీ 28శాతం మార్కెట్ షేర్‌తో మరోసారి అగ్రస్థానం దక్కించుకుంది. ఆ తర్వాత శామ్సంగ్ 21శాతం, వివో 16శాతం, రియల్మీ 10శాతం, ఒప్పో 9శాతం వాటా దక్కించుకున్నాయి. రెండో స్థానంలో వివో..అయితే 2019 నాలుగో త్రైమాసికంలో మాత్రం చైనా సంస్థ వివో రాణించింది. తొలిసారిగా శామ్సంగ్ను దాటేసి రెండో స్థానం దక్కించుకుంది. నాలుగో త్రైమాసికంలో అమ్ముడైన మొత్తం స్మార్ట్ఫోన్లలో వివో మార్కెట్ వాటా 21శాతం ఉండగా.. శామ్సంగ్ వాటా 19శాతానికి పడిపోయింది. 27శాతం వాటాతో షావోమీ తొలి స్థానంలో కొనసాగినట్లు కౌంటర్‌పాయింట్ రీసర్చ్ తన నివేదికలో పేర్కొంది.
*పాన్‌కార్డు గానీ, ఆధార్ కార్డుగానీ ఇవ్వని ఉద్యోగులకు 20 శాతం వరకు లేదా అత్యధిక రేటుతో పన్ను మొత్తాన్ని జీతాలు ఇచ్చే సమయంలో టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత)చేయాలని ఆదాయపు పన్ను శాఖ అన్ని సంస్థల యాజమాన్యాలకు మరోసారి వెల్లడించింది. ఈ మేరకు గత వారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక సర్క్యిలర్ జారీ చేసింది.
*చమురు.. భారత్ ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద గుదిబండగా మారిన వస్తువు ఇది. దేశ దిగుమతుల్లో దాదాపు 80శాతం చమురు రంగం నుంచే ఉంటున్నాయి. ఇది దేశ విదేశీ మారక ద్రవ్యంలో అత్యధిక మొత్తం దిగుమతులకు చెల్లింపులు చేసేందుకే వెచ్చిస్తున్నాము.. దిగుమతులపై పూర్తి పట్టు సాధిస్తే మన ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగ్గా ఉంటుంది. పరిమితంగానే విదేశీ చమురుపై ఆధారపడాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో అనుకుంటోంది.
*ఆర్థిక మందగమనం నుంచి బయట పడేందుకు కృషి చేస్తున్న మోదీ ప్రభుత్వానికి మరో చేదు వార్త. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల రాబడిలో కోతపడే అవకాశముంది. ఈసారి కార్పొరేట్ పన్ను, ఆదాయపు పన్ను వసూళ్లు తగ్గే అవకాశముందని సీనియర్ పన్ను అధికారులు అంటున్నారు. ఆర్థిక మందగమనం, కార్పొరేట్ ట్యాక్స్‌లో కోత ఇందుకు కారణమని పేర్కొంటున్నారు.
*అత్యంత చౌక (సబ్సే సస్తే) పేరిట నిర్వహిస్తున్న ఆఫర్ విక్రయాలు ఈనెల 26 వరకు కొనసాగుతాయని బిగ్‌బజార్ తెలిపింది. బిగ్‌బజార్, బిగ్‌బజార్ జన్నెక్ట్స్, హైపర్సిటీ విక్రయశాలల్లో ఈనెల 22 నుంచి ఆఫర్లు అమలవుతున్నట్లు వెల్లడించింది. ఆహారం, నిత్యావసరాలపై 2 కొంటే 1 ఉచితం, ఫ్యాషన్ ఉత్పత్తులపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు వివరించింది. రూ.13,505 విలువైన వంటగది కాంబోసెట్ రూ.4999కి, రూ.39,990 విలువైన 43 అంగుళాల కోర్యోటీవీ రూ.14,999కి, అరిస్టోక్రాట్, సఫారీ, స్కైబ్యాగ్స్ వంటి ట్రాలీబ్యాగ్లపై 70 శాతం రాయితీ ఇస్తున్నట్లు బిగ్‌బజార్ సీఈఓ సదాశివ్ నాయక్ తెలిపారు. ఇంకా పలు ఆకర్షణీయ ఆఫర్లున్నాయని పేర్కొన్నారు.
*ప్రస్తుతం భారత్‌లో వృద్ధి నెమ్మదించడం తాత్కాలికంగానే కనిపిస్తోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టరు (ఎండీ) క్రిస్టలినా జార్జివా అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో వృద్ధి పుంజుకుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్- 2020) సదస్సు సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2019 అక్టోబరులో ప్రపంచ వృద్ధి అంచనాలు ప్రకటించినప్పటితో పోలిస్తే 2020 జనవరిలో పరిస్థితులు మెరుగైనట్లు కనిపిస్తున్నాయని అన్నారు. అమెరికా- చైనాల మధ్య తొలి విడత వాణిజ్య ఒప్పందం కుదరడం ప్రపంచ వృద్ధికి సానుకూలతను తెచ్చిపెట్టిందని అభిప్రాయపడ్డారు. అయితే 3.3 శాతం వృద్ధి రేటు సంతృప్తినిచ్చేదైతే కాదని అన్నారు. ‘వృద్ధిలో ఇంకా స్తబ్దత ఉంది. విధాన నిర్ణయాల్లో మరింత దూకుడు అవసరం. వృవస్థీకృత సంస్కరణలు మరిన్ని చేపట్టాలని మేం కోరుకుంటున్నామ’ని పేర్కొన్నారు. వర్ధమాన విపణులు కూడా ప్రస్తుతం పుంజుకునే దిశగా సాగుతున్నాయని అన్నారు.
*పన్ను ఎగవేస్తే తోటి పౌరులకు సామాజికంగా అన్యాయం చేసినట్లేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఏక పక్షంగా అధిక పన్నులు వేసినా సమాజానికి అన్యాయం చేసినట్లే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఐటీఏటీ) 79వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘పన్ను విషయాలను ప్రత్యేక నిపుణులు పరిశీలించాలని న్యాయవ్యవస్థ 79 ఏళ్ల క్రితమే గుర్తించింది.
*ఫుజిత్సు జనరల్ లిమిటెడ్(ఎఫ్జీఎల్) విపణిలోకి కొత్త ఎయిర్ కండిషనర్లు విడుదల చేసింది. మార్కెట్ వాటా పెంచుకోవడానికి తక్కువ ధర మోడళ్లపై దృష్టి పెట్టినట్లు సంస్థ అధ్యక్షుడు, రెప్రజెంటేటివ్ డైరెక్టర్ ఎట్సురో సైటో పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ఫుజిత్సు ఇండియా ఇన్వర్టర్ స్ల్పిట్ ఎయిర్ కండీషనర్ల కొత్త మోడళ్లు విడుదల చేశామన్నారు. ఆవి 55 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద కూడా చల్లదనాన్ని అందించేలా రూపొందించినట్లు తెలిపారు.
*జీవీకే గ్రూపు నిర్వహిస్తున్న ముంబయిలోని జీవీకే ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులు రాకపోకల్లో అనూహ్యమైన వృద్ధి నమోదు చేస్తోంది. 2007-08 ఆర్థిక సంవత్సరంలో ఈ విమానాశ్రయం నుంచి 2.59 కోట్ల మంది రాకపోకలు సాగించగా, 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రయాణికుల సంఖ్య 4.88 కోట్లకు పెరిగినట్లు జీవీకే ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఏఎల్) తెలిపింది. అంటే దశాబ్దకాలంలో ప్రయాణికుల సంఖ్య దాదాపు రెట్టింపు అయినట్లు అవుతోంది. అంతేగాక ముంబయి నుంచి 66 గమ్యస్థానాలకు అప్పట్లో విమాన సర్వీసులు ఉండగా, ఇప్పుడు 108 గమ్యస్థానాలకు విమాన సర్వీసులు ఉన్నాయి
అమెరికాను దాటేసిన భారత్-వాణిజ్యం
Related tags :