కాఫీపొడితో రెట్టింపు అందం ఆరోగ్యానికి మంచిదనో.. మరో కారణమో కాఫీ తాగుతుంటారు. కానీ అదే కాఫీపొడిని ఉపయోగించి అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చని చాలామందికి తెలియదు. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు. కాఫీ పొడితో మిలమిలా మెరిసిపోవచ్చు. మొటిమల సమస్యతో బాధపడేవారు కాఫీ గింజలను గ్రైండ్ చేసుకొని దాంట్లో చిటికెడు ఉప్పు, ఆలివ్ నూనె కలపాలి. ఇది మంచి స్క్రబ్‌లా పనిచేస్తుంది. అలాగే ముడతల్ని దూరం చేస్తుంది. రెండు చెంచాల పెరుగులో ఒక చెంచా స్ట్రాబెర్రీ రసం, ఒక చెంచా కాఫీ పొడి కలిపి ముఖానికి 15 నిమిషాలు పట్టించి తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే ముఖంపై ఉన్న మచ్చలు, ముడతలు తొలిగిపోతాయి. పెరుగులో కొద్దిగా కాఫీ పొడి, తేనె కలుపుకొని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. నల్ల మచ్చలు, మొటిమలు తొలిగిపోతాయి. కాఫీ గింజలను గ్రైండ్ చేసుకొని దాంట్లో చిటికెడు ఉప్పు, ఆలివ్ నూనె కలపాలి. ఇది మంచి స్క్రబ్‌లా పనిచేస్తుంది. అలాగే ముడతల్ని దూరం చేస్తుంది. జుట్టు ఎక్కువగా రాలుతుంటే రెండు చెంచాల కాఫీ పొడిలో, మూడు చెంచాల ఆలివ్ నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకొని మర్దన చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఫలితం ఉంటుంది. రెండు చెంచాల పెరుగులో చెంచా స్ట్రాబెర్రీ రసం, చెంచా కాఫీ పొడి కలిపి ముఖానికి పట్టించాలి. పావుగంట తర్వాత కడిగితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే ముఖం మీది మచ్చలు, ముడతలు తొలిగిపోతాయి.
కాఫీపొడితో అందం మందం అవుతుంది
Related tags :