Devotional

మధురై మనియాండి ఆలయంలో మటన్ బిరియాని ప్రసాదం

Madhurai Maniyandi Swamy Temple Offers Mutton Biriyani

సాధారణంగా గుడి పేరు చెబితే మనకు గుర్తొచ్చే ప్రసాదాలు.. లడ్డూ, పొంగలి, పులిహోర. అయితే సంప్రదాయాలకు పూర్తి భిన్నంగా తమిళనాడులోని మదురైలో ఉన్న మునియాండి స్వామి దేవాలయం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రసాదాలుగా చికెన్‌బిర్యానీ, మటన్‌ బిర్యానీ పంపిణీ చేయడం వీళ్ల ఆచారం. ప్రతి ఏటా జనవరి 24 నుంచి 26 వరకు జరిగే వార్షిక ఉత్సవాల్లో భాగంగా గుడికి వచ్చిన భక్తులకు బిర్యానీని పంచుతారు. ఇందుకోసం ఈ ఏడాది వెయ్యి కేజీల బియ్యం, 150 మేకలు, 300 కోళ్లను ఉపయోగించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఏమాత్రం వివక్ష చూపకుండా ఈ బిర్యానీ ప్రసాదాన్ని అందజేస్తారు. బిర్యానీని ఇంటికి పార్శల్‌ తీసుకెళ్లే సదుపాయం కూడా ఉంది. ఈ బిర్యాని ప్రసాదం కోసం భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు సైతం అందజేస్తుంటారు. 84 ఏళ్లుగా బిర్యానీని ప్రసాదంగా పంచే సంప్రదాయం కొనసాగుతుంది.