Movies

ఆ పదవి మా అక్కకే

Manchu Manoj Posts About Manchu Lakshmi's New Role

మంచులక్ష్మినే తనకి బెస్ట్‌ ఫ్రెండ్‌ అని అంటున్నారు టాలీవుడ్‌ నటుడు మంచు మనోజ్‌. తాజాగా మంచు మనోజ్‌, లక్ష్మి కలిసి తమ బంధువల వివాహానికి హజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసిన మనోజ్‌.. తన సోదరితో ఉంటే సమయం చాలా సరదాగా గడిచిపోయిందని పేర్కొన్నారు. ‘తను నాతో ఉంటే కేవలం నవ్వులకు మాత్రమే స్థానం ఉంటుంది. మనకి చాలా మంది బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఉండొచ్చు కానీ అందరికంటే బెస్ట్‌ ఫ్రెండ్స్‌ మన సోదరి మాత్రమే’ అని మనోజ్‌ తెలిపారు. ఇదిలా ఉండగా మంచు లక్ష్మి సైతం ఇన్‌స్టా వేదికగా మనోజ్‌తో దిగిన ఓ ఫొటోను షేర్‌ చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఓ అందమైన సాయంత్రాన్ని గడపడం చాలా సంతోషంగా ఉందనన్నారు. ‘ఈ వ్యక్తిని నేను ఫంక్షన్స్‌కు తీసుకువెళ్లడం చాలా అరుదుగా జరిగింది. ఓ సాయంత్రాన్ని ఇలా గడపడం చాలా ఆనందంగా ఉంది’ అని మంచు లక్ష్మి పేర్కొన్నారు.